Cnaphalocrocis medinalis
కీటకం
వీటిని ఆకు ముడత అని కూడా అంటారు.పెద్ద పురుగులు మన వేలి గోరు పొడవు ఉండి గోధుమ రంగు జిగ్ జాగ్ గీతలు కలిగి ఉంటాయి. ఆకుల కొన భాగంలోనే ఇవి గ్రుడ్లు పెడతాయి. ఈ గొంగళి పురుగులు వరి ఆకులను వాటి చుట్టూ చుట్టుకుని, పట్టు దారాలతో వరి ఆకు అంచులను జోడిస్తాయి. అప్పుడు ఇవి గొట్టంలా ముడుచుకుని వున్న ఆకు లోపల తిని,ఈనెల మధ్య భాగాన ఒక పొడవాటి తెల్లటి మరియు పారదర్శక చారలను సృష్టిస్తాయి. కొన్నిసార్లు, ఆకులు చివర్లనుండి మొదలు వరకు ముడుచుకుపోయి ఉంటాయి. డిస్క్ ఆకారంలో ఉన్న గుడ్లు ఒకొక్కటిగా పెట్టబడడం లేదా మల పదార్థంగా ఉండటం కూడా సంక్రమణ సంకేతాలు.
కాంతి వలలు వుపయోగించి పెద్ద పురుగులను పట్టండి. ట్రైకోగ్రామ్మా టైడ్, సాలెపురుగులు, బీటిల్స్, కప్పలు మరియు డ్రాగన్ ఫ్లై లేదా ఫంగై మరియు వైరస్ వంటి సహజ శత్రువులను కాపాడితే అవి ఈ తెగులును నియంత్రించడంలో సహాయపడతాయి. వేప ఆకులను పొలంలో అక్కడక్కడా ఉంచడం వలన పెద్ద కీటకాలు గ్రుడ్లు పెట్టకుండా నిరోధించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పిలకలు వేసే సమయంలో తెగులు 50 శాతంకన్నా ఎక్కువగా ఉంటే ఫ్లూబెండియమైడ్ @ 0.1 మిల్లీలీటర్ చొప్పున లేదా ఒక లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ క్లొరాన్త్రనిలిపారోల్ పిచికారీ చేయండి. ముట్టడి తీవ్రంగా వున్నప్పుడు, క్లోర్ఫెరీఫోస్, ఇండొక్సాకార్బ్, అజాడిరచితిన్, గామా -లేదా లాంబ్డా- సైహలోత్రిన్ ను వాడడం వలన ఫలితం ఉంటుంది. ఇతర కీటక నాశినులైన ఆల్ఫా- సైపర్ మేత్రిన్, అబామెక్టిన్ 2% ను వీటి లార్వాను చంపడానికి వాడొచ్చు. కీటకాలు మళ్ళీ పంటను సోకే వీలు కల్పించే రసాయనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వరి ఆకు ముడత తెగులు అన్ని రకాల పర్యావరణ పరిస్థితులలోను ఆశిస్తుంది మరియు వర్షాకాలంలో మరింత ఉధృతి చెందుతుంది. తేమ అధికంగా వున్నప్పుడు, ఎండ తగలని పంట ప్రాంతం, గడ్డి కలుపుమొక్కలు పొలంలో మరియు పొలం చుట్టుపక్కల వున్న ప్రాంతాలలో ఈ తెగులు మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మందులు అధికంగా వాడడం వలన మళ్ళీ తెగులు తిరగదోడడం, బహుళ వరి పంట మరియు నీటిపారుదల సౌకర్యంతో విస్తరించిన వరి వైశాల్యం ఈ తెగులు బాగా విస్తరించడానికి తోడ్పడుతుంది. అధికమొత్తంలో ఎరువులు వాడడం వలన ఈ తెగులు చాలా వేగవంతంగా విస్తరిస్తుంది. ఉష్ణమండల వాతావరణంలో సంవత్సరం పొడుగునా ఈ తెగులు చురుకుగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా వుండే ప్రదేశాలలో ఇవి మే నుండి అక్టోబర్ వరకు చురుకుగా ఉంటాయి. 25-29°C మరియు 80% తేమ దీని ఎదుగుదలకు అత్యుత్తమం. చిన్న మరియు పచ్చని వరి మొక్కలకు ఈ తెగులు త్వరితంగా వ్యాపిస్తుంది.