వరి

గోధుమరంగు దోమ పోటు

Nilaparvata lugens

కీటకం

క్లుప్తంగా

  • మొక్కల తొడుగులపై చిన్న ప్లాంట్‌ హాపర్లు కనపడతాయి.
  • ప్రారంభంలో నారింజ-పసుపు, తరువాత గోధుమ మరియు పొడి ఆకులు కనపడతాయి.
  • మొక్కలు వాలిపోయి పసుపు రంగులోకి మారతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

చిన్న మరియు పెద్ద పురుగులు మొక్కల యొక్క మొదళ్ళలో నివాసం ఏర్పరచుకుని కాండంలోని రసాలను పీల్చుకుంటాయి. గోధుమ రంగు దోమ వరి పంటకు హాని కలిగిస్తాయి. మొక్కలు రంగు మారిపోయి వాడిపోతాయి. ఈ పురుగుల అధిక జనాభా వలన ఆకులు ముందు నారింజపసుపు రంగులోకి ఆ తర్వాత గోధుమరంగులోకి మారి తర్వాత ఎండిపోతాయి. చివరకు మొక్క ఎండిపోయి చనిపోతుంది. ముందు చిన్న మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ పురుగుల జనాభా పెరిగేకొద్దీ ఈ మచ్చలు పెరుగుతాయి. ఆడ పురుగులు కాండం మీద ఆకుల ఈనెల మీద గ్రుడ్లను పెడతాయి. వరికంకులు చిన్నగా ఏర్పడడం వలన కొంత ధాన్యం మాత్రమే పండే దశకు చేరుకొని ధాన్యం గింజ బరువు తక్కువగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటి జనాభా తక్కువగా ఉన్నపుడు జీవ సంబంధమైన పద్ధతులు వాడవచ్చు. గోధుమ రంగు దోమకి సహజ శత్రువులు నీటి సాలీడ్లు, మిరిడ్ పురుగులు, సాలీడులు, కందిరీగలు మరియు ఈగలు. నారుమడిని ఒకరోజు అంతా పూర్తిగా నీటిలో ఉంచడం వలన ఈ తెగులును నివారించవచ్చు. ప్రత్యామ్నాయంగా చిన్న నారుమళ్లు పైనుండి వలతో చుట్టడం వలన ఈ కీటకాలను పట్టుకోవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటికి సహజంగా వుండే శత్రు కీటకాలకన్నా ఎక్కువ మొత్తంలో ఈ దోమలు ఉంటేనే పురుగుమందులు వాడాలి. బుప్రోఫెజిన్, పైరోమిత్రజిన్ లేదా యెటోఫన్ప్రాక్స్ ఉత్పాదనలు వాడాలి. క్లొర్ఫైరిఫాస్ లేదా లాంబ్డా సైహలోత్రిన్ లేదా ఇతర కృత్రిమ పెరిథ్రోయిడ్స్ కాబినేషన్స్ ను వాడడం వలన ఈ తెగులు రోగనిరోధకతను పెంచుకుంటుంది, కాబట్టి ఇలాంటి రసాయనాలను వాడకండి.

దీనికి కారణమేమిటి?

గోధుమ దోమ, నిలపర్వత ల్యుజెన్స్ వలన ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇది మాగాణి భూములలోను, వర్షాధార భూములలోను, ఎప్పుడూ నీరు నిల్వ వుండే, ఎక్కువ నీడ మరియు తేమ వుండే భూములలోను వ్యాపిస్తుంది. ఎక్కువ సాంద్రతతో వరి వేయడం వలన ఈ తెగులు సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ మోతాదులో నత్రజని వాడకం, ముందుగానే పురుగు మందులు చల్లడం ( వీటికి సహజంగా వుండే శత్రు కీటకాలు నాశనం అవుతాయి) వలన కూడా ఇవి ఎక్కువగా వృద్ధిచెందుతాయి. తడి సీజన్లో కంటే పొడి వాతావరణంలోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి జారీ నీటిలో పడతాయేమో చూడడానికి మొక్కలను కొంచెం పక్కకి వంచడం ద్వారా, మొదళ్ళ దగ్గర మెల్లగా తట్టడం ద్వారా మనం ఈ తెగులును గమనించవచ్చు.


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే స్థానికంగా సిఫారసు చేసిన నిరోధక రకాలని వాడండి.
  • తెగులు సోకకుండా ఉండడానికి ఒక ప్రాంతంలో ఒకే సమయంలో పంటను వేయండి.
  • ఖరీఫ్ సీజన్లో తూర్పునుండి పడమరకు మరియు రబి సీజన్లో ఉత్తరంనుండి దక్షిణానికి ప్రతీ 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల దారిని వదలండి.
  • కాండంమీద పురుగులు చేరాయేమో తెలుసుకోవడానికి ప్రతి రోజు నారుమడిని, పొలాన్ని, కాండాల పైన, నీటి పైన పరిశీలిస్తూ వుండండి.
  • చిన్న నారుమడులపై నెట్ తో తుడిచి కీటకాలను పట్టుకోండి.
  • పొలంలో, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • పొలంలో నత్రజనిని ఎక్కువగా వేయవద్దు.
  • లేత రంగులో వున్న గోడ దగ్గర కానీ లేదా ఒక గిన్నెలో నీళ్లు పెట్టి అక్కడ కరంట్ బల్బులు మరియు కిరోసిన్ దీపాలు లాంటి దీపాలను ఎరగా ఉపయోగించాలి (ఎకరానికి 5).
  • విచక్షణారహితంగా పురుగు మందులు వాడి పంటకు ఉపయోగపడే కీటకాలకు నష్టం కలిగించవద్దు.
  • కీటకాలను నాశనం చేయడానికి పొలాన్ని ఒకసారి తడపడం మరియు ఒకసారి ఎండబెట్టడం లాంటి పద్ధతులు వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి