Sternechus subsignatus
కీటకం
స్టెర్నేకస్ సబ్సిగ్నేటస్ యొక్క లార్వా మరియు ఎదిగిన పురుగులు కాండం కణజాలాల్ని తినివేస్తాయి. ముఖ్యంగా ఎదుగుదల మొదటి దశల్లో ఆడపురుగులు ఆకు కాడలను తుంచి కాండములపై దెబ్బతిన్న కణజాలాల దగ్గర గుడ్లు పెడతాయి. వాటిని కత్తిరించిన పీచుతో మరియు కణజాల ముక్కలతో కప్పివేస్తాయి. లార్వా పగిలిన తరువాత అవి కాండాల్లోకి చొచ్చుకొని వెళ్లి అంతర్గత కణజలాల మీద దాడి చేస్తాయి. అవి పెరిగే కొద్దీ కాండాలకు అధికంగా నష్ఠాన్ని కలిగిస్తాయి.
ఈ చీడకు ఎటువంటి జీవనియంత్రణ పద్దతి అందుబాటులో లేదు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు యొక్క జనాభా, రసాయన నియంత్రణ లార్వా కాండాలలో గడిపే సమయంలోనే సాధ్యం అవుతుంది ( సుమారు 30 రోజులు). విత్తనాలు మరియు ఫోలియార్ కీటక నాశినులు కూడా పంటను కాపాడతాయి. కానీ వాటి ప్రభావం కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పురుగుల నిరంతర ఎదుగుదల పంటలో తెగులు సంక్రమణకి దారితీస్తూనే ఉంటుంది
మొక్కల మొదటి ఎదుగుదల దశ నుండి కోతకు వచ్చేవరకు స్టెర్నేకస్ సబ్సిగ్నేటస్ చురుగ్గా ఉంటాయి. ఈ కీటకాలు భూమిలో నిద్రావస్థను ( సోయాబీన్ మొక్కలు లేనపుడు) గడుపుతాయి. కోతకు ముందు లార్వా భూమిలో నుండి బయటకి వచ్చి నిద్రావస్థలోకి వెళ్తాయి. మట్టి అవశేషాలలో కప్పబడి పెద్దవిగా మారి సమయానుసారంగా భూమిలో నుండి బయటకి వస్తాయి. వీటి జీవిత దశల నిడివి బట్టి పెద్ద పురుగులు, లార్వా మరియు గుడ్లు ఒకే మొక్క లేదా పంట పైనే సంక్రమిస్తాయి.