వరి

వరిలో హిస్పా తెగులు

Dicladispa armigera

కీటకం

క్లుప్తంగా

  • ఆకు మధ్య ఈనె మీద తెల్లని, సమాంతర చారలు లేదా మచ్చలు ఏర్పడుతాయి.
  • ఒక ఒక క్రమ పద్దతిలో లేని తెల్లని మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు వాడిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

వయస్సులో వున్న కీటకాలు ఆకు పైపొరను తింటాయి. ఆకు మధ్య ఈనె మీద తెల్లని, సమాంతర చారలు లేదా మచ్చలు ఏర్పడుతాయి. లార్వా ఆకు అంతర్గత కణజాలంలోకి రంధ్రాలు చేస్తుంది మరియు ఒక వరుస లేని తెల్లని మచ్చలు ఏర్పరుస్తుంది. వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు ఈ రంధ్రాలు మరియు లార్వా కనబడుతాయి.ఒకవేళ తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఏర్పడితే, ఈనె కూడా ప్రభావితం అవుతుంది. ఇది పెద్ద, తెల్లని పొక్కులు కనబడేలా చేస్తుంది. పెద్ద పురుగులు సాధారణంగా పాడైపోయిన ఆకుల పైభాగాన వుంటాయి. ఆకుల భాహ్య పొర మధ్యలో వున్న ఆకుపచ్చ కణజాలాన్ని తింటూ ఆకు ఈనెల వెంబడి తొలుస్తూ తెల్లటి మచ్చలను కలిగిస్తుంది. పాడై పోయిన ఆకుల్ని వెలుగులో వుంచినప్పుడు లేదా రంధ్రాల వెంబడి వేలును పోనిచ్చినప్పుడు కనిపెట్టవచ్చు. దూరం నుండి leaf bladeచూస్తే పంట కాలిపోయినట్టుగా కనిపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు జీవరసాయన నియంత్రణ ఇంకా అధ్యయనంలోనే వుంది. లార్వల్ పారాసిటోయిడ్, ఎలోఫొస్ ఫెమరాలిస్, బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో ప్రవేశపెట్టబడింది దీనివలన ఈ ప్రాంతాల్లోని హిస్పా తెగులు సమస్య తగ్గవచ్చు. సహజ శత్రువుల పరిరక్షణ కూడా ఈ తెగుళ్ళ నిర్వహణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గ్రుడ్లు మరియు లార్వాల మీద దాడి చేసే చిన్న కందిరీగలు మరియు పెద్ద పురుగులను తినే రిడ్యూవిడే కీటకాలు ఉన్నాయి. పెద్ద పురుగులపై దాడి చేసే మూడు శిలీంద్ర వ్యాధికారకాలు కూడా ఉన్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే వివిధ రసాయన ఫార్ములేషన్లు కలిగిన ఈ క్రిందిక్రియాశీలకమైన పదార్థాలను వీటి జనాభా నియంత్రణకు వాడవచ్చు: : క్లోర్ఫైరిఫాస్, మాలాథియాన్, సైప్ర్మేత్రిన్, ఫెన్తోయేట్

దీనికి కారణమేమిటి?

రైస్ హిస్పా, డిక్లాడిస్పా ఆర్మీగెరా అనే పెద్ద పురుగు మరియు దీని లార్వా వలన నష్టం జరుగుతుంది. పెద్ద పెంకు పురుగులు ఆకు దిగువ పొరను మాత్రమే వదిలి ఆకు ఈనెల మధ్యన ఎగువ ఉపరితలాన్ని గీరి విచ్ఛిన్నం చేస్తాయి. సాధారణంగా ఇవి లేత ఆకులపై వున్న సూక్ష్మ రంధ్రాల్లో ఆకు కొనల చివర్లో గ్రుడ్లను పెడతాయి.ఈ పిల్ల పురుగు తెల్లటి పసుపు రంగులో చదునుగా వుంటుంది. ఇది ఆకు ఈనెలను తొలిచి ఆకు లోపలి భాగంలోని కణజాలాన్ని తింటుంది మరియు లోపల ప్యూపాగా మారుతుంది. పెద్ద పెంకు పురుగు చతురస్రాకారంలో వుండి 3-5 మిల్లీ మీటర్ల పొడవు మరియు వెడల్పు వుంటుంది. ఇది ముదురు నీలం లేక నలుపు రంగులో వుండి శరీరం అంతటా వెన్నెముకలను కలిగి వుంటుంది. గడ్డి కలుపు మొక్కలు, అధికమోతాదులో ఎరువుల వాడకం, అధిక వర్షాలు మరియు అధిక సాపేక్ష ఆర్ద్రత వరి హిస్పా సంక్రమణకు అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులును సమర్దవంతంగా అరికట్టగల ప్రతిఘటించగల గుణం వరికి లేదు.
  • అధిక ఆకు సాంద్రతతో మొక్కల మధ్య తక్కువ ఎడం ఉండేలా చూసుకోండి.
  • తెగులు సంతతి అధికం కాకుండా ఉండడానికి అదనుకు ముందుగా పంటలను నాటండి.
  • గ్గ్రుడ్లు పెట్టకుండా నివారించడానికి రెమ్మల కొనలను కత్తిరించండి.
  • ఈ పురుగులు ఉదయం పూట నెమ్మదిగా కదులుతూ ఉంటాయి.
  • ఆ సమయంలో స్వీపింగ్ నెట్ వుపయోగించి పెద్ద కీటకాలను ఏరివేయండి.
  • వరి పొలంలో పంట లేని సమయంలో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి.
  • వ్యాధి సోకిన ఆకులను మరియు రెమ్మలను కత్తిరించి కాల్చివేయండి లేదా బురదలో లోతుగా పూడ్చి పెట్టండి.
  • తెగులు సోకిన పొలాల్లో అధిక నత్రజని ఎరువుల వాడకాన్ని నిరోధించండి.
  • ఈ తెగులు జీవిత చక్రాన్ని విచ్చిన్నం చేయడానికి పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి