Anticarsia gemmatalis
కీటకం
వెల్వెట్ బీన్ గొంగళి పురుగులు వాటికి ఆతిథ్యము ఇచ్చిన ఆకులపై దాడి చేస్తాయి. మొదట చిన్న లార్వా మృదు కణజాలాలను ఆహారంగా మేస్తాయి. మధ్యస్థ దశలో వున్న లార్వా ఆకు ఈనెలతోపాటు పాటు సహా మొత్తం ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత దశల్లో, లార్వాలు మొగ్గలు, చిన్న బీన్ కాయలు మరియు కాడలను తినేస్తాయి. అవి రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటాయి. అవి చాలా పెద్ద సంఖ్యలో ఏర్పడతాయి మరియు నియంత్రణ లేకుంటే అవి ఒక వారం లోపల పూర్తిగా బీన్ లేదా ఇతర పప్పుదినుసులు పంటల పొలములో మొక్కల నుండి అన్ని ఆకులను వేరుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
వెల్వెట్ బీన్ చిమటను ఎదుర్కోవడానికి సహజమైన శత్రువులను ఉపయోగించండి, ఉదాహరణకు యుప్లె క్త్రాస్ పుట్ట్లేరి మరియు మేటే రాస్ ఆటో గ్రఫే లాంటి చాలా రకములైన కందరీగ పరాన్నజీవులు. ఇతర గమనించబడిన పరాన్న జీవులు గ్రౌండ్ బీటిల్స్, టైగర్ బీటిల్స్ , ఎర్రటి అగ్ని చీమ లేక టాఖినిడ్ ఫ్లై విన్తిమియా రూఫో పిట్క. పక్షులు,కప్పలు మరియు ఎలుకలు లాంటి వెన్నెముక గల వేటాడేవి వెల్వెట్ బీన్ చిమట జనాభాను తగ్గిస్తాయి. లేదా వ్యాధి కారకములను వెల్వెట్ బీన్ గొంగళి పురుగు జనాభాను అరికట్టడానికి వాడుకోవచ్చు, ఉదాహరణకు బాసిల్లస్ తురింగ్జినెసిస్ .
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశనినులతో ముందు జాగ్రత్తగా నివారణ చర్యలను చేపట్టడం వలన ఈ క్రిములను నియంత్రించడంలో మంచి ఫలితాలను పొందవచ్చు.
ఎదిగిన అంటికార్సియా గెమ్మటిలిస్ గొంగళి పురుగులు 30 నుండి 40 మిల్లీమీటర్ల రెక్కల వెడల్పు కలిగి వుంటాయి. ముందు రెక్కలు బూడిద ఊదా నుండి పసుపు-గోధుమ లేదా ముదురు ఎరుపు-గోధుమ రంగులు కలిగి వుంటాయి. వెనుక రెక్కలు లేత గోధుమ రంగు కలిగి అంచుల దగ్గర ఒక తేలికపాటి రంగుల మచ్చల వరస వుంటుంది. రెక్కలు పూర్తిగా విస్తరించినపుడు రెండు రెక్కలకు అడ్డంగా ఒక నల్లటి గీత కనబడుతుంది. వీటి గుడ్లు కొద్దిగా కోల ఆకారము కలిగి, గట్టిదనము మరియు తెలుపు రంగులో వుండి పొదిగే సమయములో అవి గులాబీ రంగులోనికి మారతాయి. ఇవి ఒకటి ఒకటిగా ఆకుల క్రింది భాగములో వుంచబడతాయి. మూడు నుండి ఏడు రోజుల తరువాత గ్రుడ్లు పొదగబడి బయటకు వచ్చి, మొదట తాను బయటకు వచ్చిన గుడ్డు యొక్క పెంకును ఆహారంగా తీసుకొంటుంది. వెల్వెట్ బీన్ గొంగళి పురుగులు వాటి ఎదుగుదల సమయములో వాటి రంగు గుర్తులలో చాలా మార్పులు చేసుకొంటాయి. యువ, మధ్యస్థ దశలలో వున్న వాటిని కొన్ని సార్లు సోయా బీన్ వలలుగా ( సుడో ప్లుసియా ఇంక్లుడేన్స్) తప్పుగా గుర్తించడము జరుగుతుంది. ప్యూపా దశ ముందుగా లార్వా 25 ఎం ఎం కు కుంచించుకొని ఎర్రటి గోధుమ రంగులోనికి మారుతుంది. ప్యూపా తేలికపాటి ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోనికి మారి సుమారు 20 ఎం ఎం వుంటుంది. ఇది సరిగ్గా మట్టి ఉపరితలం క్రింద వుంటుంది. దీని జీవిత చక్రం వేసవిలో నాలుగు వారాలలో అయిపోతుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు జీవిత చక్రం సమయం ఎక్కువవుతుంది. సంవత్సరానికి తరాల యొక్క సంఖ్య ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది.