వరి

పసుపురంగు కాండం తొలుచు పురుగు

Scirpophaga incertulas

కీటకం

క్లుప్తంగా

  • బోరింగ్ కార్యకలాపాల వలన డెడ్ - హార్ట్స్ మరియు చనిపోయిన పిలకలు ఏర్పడతాయి.
  • కాడలు మరియు పిలకలపై చిన్న రంధ్రాలు.
  • దెబ్బతిన్న కాండం లోపల చిన్న చిన్న రంధ్రాలు.
  • దెబ్బతిన్న కాండాల లోపల మల పదార్ధాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

పంట ఎదిగే సమయంలో మొక్క మొదళ్ళలో లేదా కాండం పైన ఈ లార్వా తినడం వలన పిలకలు ( డెడ్ హార్ట్స్) చనిపోతాయి. తెల్లని (వైట్ హెడ్స్) పూర్తిగా నిండని కంకులు ఏర్పడతాయి. గ్రుడ్లు పెట్టిన తర్వాత ఈ లార్వా ఆకు పైపొరపై కన్నం చేసి కాండం లోపల భాగాన్ని తినడం మొదలు పెడుతుంది. చిన్న చిన్న కన్నాలు, లార్వా విసర్జించిన పదార్ధాలు మరియు మలం మొక్కల కణజాలంపై కనిపిస్తాయి. ఒక కణుపు నుండి ఇంకొక కనుపుకు ఈ లార్వా వెళ్లగలదు. మొక్క ఎదుగుతునప్పుడు లార్వా తింటునందువలన కంటికి కనపడే లక్షణాలు కనిపించవు. ఎందుకంటే ఆ సమయంలో అది చేసిన నష్టాన్ని మరిన్ని పిలకలు వేయడం ద్వారా మొక్క భర్తీ చేస్తుంది. కానీ దీనికి అధికంగా శక్తి అవసరం ఉండడం వలన దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటిని సహజంగా వేటాడి తినే పరాన్నజీవులు చాలా ఉన్నాయి మరియు అనేక జాతుల చీమలు, బీటిల్స్, మిడత, ఈగలు, కందిరీగలు, నెమటోడ్లు, పురుగులు, ఇయర్ విగ్స్, బర్డ్స్‌డ్రాగన్‌ఫ్లైస్, డామ్‌సెల్ఫ్లైస్ మరియు స్పైడర్స్ ఉన్నాయి. నాటిన 15 రోజుల నుండి ప్రారంభించి, గుడ్డు పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామా జపోనికమ్ (100,000/హెక్టారు) ఐదు నుండి ఆరుసార్లు వేయడానికి ప్లాన్ చేయవచ్చు. లార్వాలను ప్రభావితం చేసే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు కలిగిన ఉత్పత్తుల వాడకం (ఇది కాండంలోకి చొచ్చుకుపోయే ముందు) ద్వారా కూడా చికిత్స చేయవచ్చు. వేప సారం, బాసిల్లస్ తురింగియెన్సిస్ కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నాటేముందు మొలకల వేర్లను 0.02 క్లొర్ఫెరీఫాస్ ద్రావణంలో 12 నుండి 14 గంటలు నానబెట్టి ముందస్తు రసాయన చర్య(30 రోజులవరకు రక్షణ) చేయండి. పొలంలో వీటి జనాభా ఒక స్థాయికి చేరినప్పుడు ( 25 నుండి 30 మగ చిమ్మటలు/ఉచ్చుకు/వారానికి) ఫిప్రోనిల్, క్లొర్ఫైరిఫాస్ లేదా క్లొరాన్త్రనిలిప్రోల్ ఆధారిత మందులను గుళికల రూపంలో పిచికారీగా కానీ వాడండి.

దీనికి కారణమేమిటి?

పసుపు రంగు కాండం తొలుచు పరుగు వలన ఈ నష్టం కలుగుతుంది. ఇది స్కిర్పొఫాగా ఇన్సెర్తలస్ అని పిలవబడే ఒక అధికంగా నీరు పెట్టె వరి పొలాల్లో వుండే తెగులు. ఇది మొక్కలలో కానీ ఎప్పుడూ నీరు వుండే దుబ్బుల్లో పైన కానీ కనిపిస్తాయి. చిన్న లార్వా ఆకు లో కొంత భాగాన్ని వాటి చుట్టూ మొక్కనుండి విడిపోయి నీళ్లలో పడిపోతాయి. ఆ తర్వాత ఇవి ఇంకొక మొక్క మొదలును చేరుకొని కాండాన్ని తొలిచి మొక్క లోపలికి ప్రవేశిస్తుంది. దీనికి అధికంగా నత్రజని వాడే పొలాలు అనుకూలంగా ఉంటాయి. సీజన్లో ఆలస్యంగా నాటిన పొలాలు వీటికి అనుకూలంగా ఉంటాయి. ముందుగా మొక్కలు నాటిన పొలాలలో అవి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. అందువలన ముందుగా పంట వేసిన పొలాలకు 20 % నష్టం కలిగితే ఆలస్యంగా వేసిన పంటకు 80 % వరకు నష్టం కలుగుతుంది.


నివారణా చర్యలు

  • తెగులును తట్టుకునే రోగనిరోధక వంగడాలను వాడండి (ఉదా TKM 6, IR 20, IR 36).
  • ఎక్కువ నష్టం కలుగకుండా నివారించడానికి పంటను ముందుగానే వేయండి.
  • మీ పక్కన వుండే రైతులతో కలసి సమన్వయంతో మీ పంటను వేయండి.
  • ముందునుండీ వున్న గ్రుడ్లను తొలగించడానికి నాట్లు వేసేముందు ఆకుల పైభాగాలను కత్తిరించండి.
  • బాగా దగ్గరగా నాట్లు వేయకండి.
  • నారుమడిని పొలాన్ని తరుచుగా గమనిస్తూ వుండండి.
  • నాట్లు వేసిన రోజు నుండి 15 రోజుల తర్వాత లింగాకర్షక బుట్టలు లేదా సామూహిక ఉచ్చులు ఉపయోగించండి.
  • నాట్లు వేసిన తర్వాత 25, 46, 57, రోజులకు వాటిని మార్చండి.
  • నాట్లు వేసేటప్పుడు నారుమడిలో పొలంలో వున్న గ్రుడ్ల సముదాయాలను చేతులతో తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల వున్న కలుపు మొక్కలు మరియు స్వచ్చందంగా వచ్చే మొక్కలను తొలగించండి.
  • తెగులుకు ప్రభావితమైన మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • పశువుల పెంట మరియు నత్రజనిని మితంగా ఉపయోగించండి.
  • సీజన్లో ఎరువులను విడతలవారీగా వేయండి.
  • గ్రుడ్లను చంపడానికి, క్రమానుగతంగా నీటి లెవెల్ ను పెంచి, తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయండి.
  • గ్రుడ్లను చంపడానికి పొలంలో నీటి పరిమాణాన్ని పెంచండి.
  • నత్రజని ఎరువులు లేదా పశువులపెంటను తక్కువ పరిమాణంలో వాడండి.
  • సీజన్లో, ఎరువులను ఎక్కువ విడతల్లో పొలంలో చల్లండి.
  • తెగుళ్లను నాశనం చేయడానికి విస్తృత స్థాయి కీటక నాశినులను ఉపయోగించకండి.
  • దుబ్బుల్లో వున్న గ్రుడ్లను నాశనం చేయడానికి, మట్టి మొదలుకు పంటను కోయండి.
  • పంట కోత తర్వాత దుబ్బులు, పంట అవశేషాలు తొలగించి నాశనం చేయండి.
  • మిగిలి వున్న లార్వా మునిగిపోయేటట్టు చేయడానికి పంట కోసిన తర్వాత పొలాన్ని దున్ని, పొలంలో బాగా ఎక్కువగా నీరు పెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి