చెరుకు

ఎర్లీ షూట్ బోరర్

Chilo infuscatellus

కీటకం

క్లుప్తంగా

  • రెమ్మలు మరియు ఆకులపై తినడంవలన కలిగిన దెబ్బ.
  • లేత మొక్కలలో డెడ్ హార్ట్.
  • దెబ్బతిన్న చెరకు దుర్వాసనను విడుదల చేస్తుంది.
  • ఎదిగిన వాటికి టాన్ బాడీ, పీచు రంగు ముందు రెక్కలు మరియు తెల్లటి వెనుక రెక్కలు ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ఆకు తొడుగుల దిగువ ఉపరితలంపై 3 నుండి 5 వరుసలలో 60 గుడ్ల వరకు సమూహాలుగా తెలుపు, చదునైన గుడ్లు కనిపిస్తాయి. లేత లార్వాలు ఆకులు, ముఖ్యంగా ఆకు-తొడుగులలో సన్నటి రంధ్రాలను చేస్తుంది. ఎదిగిన లార్వాలు కాండం యొక్క మూలం వద్ద రంధ్రాలు చేసి, మొక్క లోపలికి ప్రవేశించి, మృదువైన అంతర్గత కణజాలాలను తిని మొక్కలలో డెడ్ హార్ట్ కలిగిస్తుంది. దెబ్బతిన్న మొక్కలలో ఆకుల మధ్యస్థ భాగం కూడా ఎండిపోవచ్చు. దీని దాడికి గురైన కణజాలం దుర్వాసనను విడుదల చేస్తుంది. ఎర్లీ షూట్ బోరర్ ఇంటర్నోడ్ బోరర్‌గా పనిచేస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామా చిలోనిస్‌ను ఏడు నుండి పది రోజుల వ్యవధిలో, నాటడం ప్రారంభించిన నెల నుండి పంటకోతకు ఒక నెల ముందు విడుదల చేయండి. నాటిన 30 నుండి 45 రోజుల తరువాత స్టుర్మియోప్సిస్ యొక్క ఆడజాతిని విడుదల చేయండి. ప్రత్యామ్నాయంగా, పంట పెరుగుదల 30, 45 మరియు 60 వ రోజులలో మిల్లీలీటర్‌కు ఎనిమిది నుండి పది వైరస్ చేరిక శరీరాల సాంద్రతతో చెరకు షూట్ బోర్ యొక్క గ్రాన్యులోసిస్ వైరస్ను వర్తించండి. వైరస్ ను సాయంత్రం సమయంలో వాడాలి మరియు ఆ వెంటనే నీరు వదలాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ ఎంచుకోండి . పురుగుమందులు అవసరమైతే, క్లోరాంట్రానిలిప్రోల్ కలిగిన ఉత్పత్తులను పిచకారీ చేయండి. మొక్కల పెంపకంలో మరియు పెరుగుదల సమయంలో పురుగుమందుల కణికల వాడకం అంటువ్యాధులను తగ్గిస్తుంది.

దీనికి కారణమేమిటి?

1-3 నెలల వయస్సు గల పంటలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఆడవి తెల్లటి చదునైన గుడ్లను 60 వరకు మూడు నుండి ఐదు వరుసలుగా ఆకు తొడుగుల కింది ఉపరితలంపై పెడతాయి. లార్వాలు గుడ్ల నుండి ఒకటి నుంచి ఆరు రోజులలో బయటకు వచ్చిణ తర్వాత చెదరిపోయి నేల మట్టానికి కొంచెం పైన రంధ్రం చేసి కాండంలోకి ప్రవేశిస్తుంది. లార్వాలు అదే విధంగా అనేక రెమ్మలకు వలస వెళ్లి దాడి చేయవచ్చు. ఇది 25 నుండి 30 రోజులలో పూర్తిగా పెరుగుతుంది మరియు కాండం లోపల ప్యూపేట్స్ అవుతుంది. ఆరు నుండి ఎనిమిది రోజుల తరువాత ఒక వయోజన చిమ్మట ఉద్భవిస్తుంది. మొత్తం జీవిత చక్రం 35 నుండి 40 రోజుల్లో పూర్తవుతుంది.


నివారణా చర్యలు

  • నిరోధక లేదా తట్టుకునే రకాలను ఉపయోగించండి.
  • చెరకు తోట (ష్వాంక్, డబ్ గడ్డి, మొక్కజొన్న) సమీపంలో ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలను నాటడం మానుకోండి.
  • దాడిని నివారించడానికి సీజన్ ప్రారంభంలో నాటండి.
  • చిమ్మటలను పట్టుకోవడానికి ఫెరోమోన్ స్లీవ్ వలలు లేదా కాంతి వలలను ఉపయోగించండి.
  • పంట కోత తర్వాత ఎండిన రెమ్మలు మరియు ఇతర పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • పెసర, మినుము, దైన్చా (అగతి) తో ఇంటర్‌క్రాపింగ్ కూడా ఎదిగిన పురుగును తిప్పికొట్టడానికి సహాయపడతాయి.
  • నత్రజని ఎరువుల అధిక వాడకాన్ని నివారించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి