Urbanus proteus
కీటకం
ఆకు మడత పురుగుల లార్వే ఆకులను రాల్చివేస్తాయి. ఇవి ఆకు కోణం పై చిన్న త్రికోణపుభాగాన్ని కత్తిరించి ఆకును మడత వేసి వాటిలో ఉంటాయి. ఇవి తమ నివాసాలను పట్టి దారంతో చుట్టివేసి రాత్రి వేళల్లో బైటకు వచ్చి ఆకులను తింటాయి.
ఈ తెగులు అధికం అయితే పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. బీన్ లీఫ్ రోలర్ పురుగుల్ని తినే కీటకాలైన కందిరీగలు,స్టింక్ బగ్స్( ఉదాహరణకు పోలిస్ట్స్ spp ) ఈ పురుగుల్ని నియంత్రించటానికి ఉపయోగపడతాయి
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి కీటక నాశినులను ఆకులపై పిచికారీ చేయండి. ఆలస్యంగా వేసిన పంటకే ఈ కీటక నాసీనుల అవసరం ఉంటుంది. పెరిథ్రాయిడ్స్ కలిగిన ద్రావణాన్ని ఉపయోగించడం వలన వీటి జనాభాను నియంత్రించవచ్చు.
ఆకుల కింది భాగంలో ఆడ పురుగులు 20 వరకు గ్రుడ్లు( 2 నుండి ఆరు గుంపులుగా) పెడతాయి. గ్రుడ్లు తెలుపు నుండి నీలపు-ఆకుపచ్చ రంగు లో మరియు అర్ధగోళాకారంలో ఉండి ఒక మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. లార్వే ఆకుపచ్చ రంగు లో ఉండి వెనక భాగంలో నల్లటి రేకలు కలిగి ఉంటాయి. తల గోధుమ లేదా నలుపు రంగు లో ఉంటుంది మరియు రెండు పక్కలా నారింజ లేదా పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రతల్ని బట్టి ఇవి వ్యాపిస్తాయి. ఇవి అధిక ఎత్తు కలిగిన ప్రదేశాల్లో కనపడవు ఎందుకంటే ఇవి బాగా గడ్డకట్టుకుపోయే వుండే ప్రదేశాల్లో బ్రతికి ఉండలేవు.