పొగాకు

దోస పెంకు పురుగు

Diabrotica spp.

కీటకం

క్లుప్తంగా

  • ఈ పురుగులు తినడం వలన కలిగిన నష్టం వేర్లు మరియు కాండంపైన కనపడుతుంది.
  • కొమ్మలను బలహీనపరచడం వలన మొక్క పడిపోతుంది.
  • లార్వాలు తినడం వలన జరిగే నష్టం వలన అవకాశవాద రోగకారక క్రిములు మొక్కలను ఆశిస్తాయి.

లో కూడా చూడవచ్చు


పొగాకు

లక్షణాలు

ఎదిగిన పురుగులు ఫలదీకరణం మరియు గింజ అభివృద్ధితో జోక్యం చేసుకొంటూ, ముఖ్యంగా ఆకులు, పట్టు మరియు పువ్వులను ఆహారంగా తీసుకుంటాయి. లార్వా వేరు రోమాలు, వేర్లు మరియు కాండాలను ఆహారంగా తీసుకుని, నేల నుండి నీరు మరియు పోషకాలను గ్రహించే, మొక్క యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. వేరు కొసలు మొక్క యొక్క మొదలుకు తిరిగి గ్రహించబడవచ్చు లేదా గోధుమ వర్ణంలో కనిపిస్తూ సొరంగాలతో రంద్రాలు చేయబడవచ్చు. లక్షణాలు కరువు లేదా పోషక లోపాలుగా చూపించబడతాయి. మొక్కల పెరుగుదల యొక్క తరువాత దశలలో వేరుకు జరిగిన నష్టం కొమ్మను బలహీనపరిచి మొక్క పడిపోయిన కారణంగా సాగులో ఇబ్బందులకు దారితీయవచ్చు. లార్వాల ద్వారా జరిగే నష్టం కూడా అవకాశవాద రోగకారక క్రిములకు అనుకూలిస్తుంది. అంతేకాక, డియాబ్రోటికా యొక్క కొన్ని జాతులు మైజ్ క్లోరోటిక్ మోటెల్ వైరస్ మరియు బాక్టీరియా ఎండుతెగులును కలిగించే బాక్టీరియాకు వాహకాలు. ఇది ఎక్కువ దిగుబడి నష్టాలకు దారి తీయవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

నులి పురుగులు, మాంసాహార (పురుగులు, కీటకాలు) మరియు పరాన్నజీవ ఈగలు మరియు కందిరీగల యొక్క అనేక జాతులు వీటి జనాభాను నియంత్రించడానికి ఉపయోగించపడ్డాయి. ఉదాహరణకు, దోస పెంకు పురుగు జనాభా అంత పెద్ద సంఖ్యలో లేనప్పుడు, టచినిడ్ ఫ్లై సెలాటోరియా డియాబ్రోటికాయే ను ఉపయోగించవచ్చు. బీయూవేరియా బసియానా మరియు మెటార్హిజియం అనిసిప్లియే అనే శిలీంధ్రాలు కూడా డియాబ్రోటికా యొక్క కొన్ని జాతుల మీద సహజంగా దాడి చేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నష్టపరిచే దోస పెంకు పురుగు జనాభాను సాధారణంగా క్రిమిసంహారకాలతో చికిత్సచేస్తారు. పెంకు పురుగులు అధిక సంఖ్యలో వున్నట్లైతే మరియు పర్యావరణ సమస్యలు పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎసిటప్రిమిడ్, కార్బరీల్ లేదా ఫెన్డ్రోపాత్రిన్ గ్రూప్ కీటక నాశినులను ఉపయోగించాలి. పెరిథ్రోయిడ్ యొక్క వాడకంతో మట్టికి చికిత్స చేయడం అనేది మరొక పద్దతి

దీనికి కారణమేమిటి?

డియాబ్రోటికా జాతులు అనేవి సాధారణ బీన్స్ మరియు మొక్కజొన్న వంటి వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన అనేక పంటలపై దాడి చేసే క్రిమి కీటకాల యొక్క ఒక వర్గం. దోసకాయ పెంకు పురుగులు సాధారణంగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉండి మరియు చారలు లేదా మచ్చలను కలిగి ఉండవచ్చు.మొదటి పురుగులు వీపు క్రింద మూడు నలుపు చారలను కలిగి ఉండగా చుక్కలతో ఉండేవి వీపు మీద పన్నెండు నల్ల మచ్చలను కలిగి వుంటాయి. ఇవి శీతాకాలంలో పరిసర ప్రాంతాల్లో పెద్దవిగా వుంటాయి మరియు మధ్య వసంతకాలంలో, ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైనప్పుడు చురుకుగా మారతాయి. ఆడ పురుగులు వాటి అతిథేయ మొక్కలకు సమీపంలో నేల పగుళ్ళలో సమూహాలుగా గుడ్లను పెడతాయి. వీటి లార్వా మొట్టమొదట వేర్లను, ఆ తరువాత చిన్న కొమ్మలను కూడా ఆహారంగా తీసుకోగా, పెద్ద పురుగులు ఆకులు, పుప్పొడి మరియు పువ్వులను ఆహారంగా తీసుకుంటాయి. వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి, గుడ్డు నుండి పెద్దవాటి వరకు అభివృద్ధి చెందడానికి దాదాపు ఒక నెల వరకు సమయం పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అభివృద్ధి చెందడానికి పట్టే సమయం తగ్గుతుంది. దోసకాయ పెంకు పురుగులు మంచి నీటి సరఫరా గల తేమ ప్రాంతాలను ఇష్టపడతాయి మరియు వేడి వాతావరణాన్ని ఇష్టపడవు.


నివారణా చర్యలు

  • ఆలస్యంగా మొక్కను నాటడం వలన ఈ పురుగుల వలన కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు.
  • పుచ్చకాయ, కర్బూజా, గుమ్మడికాయలు లేదా బీన్స్ వంటి ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కల పక్కన మీ పంటను నాటడం నివారించండి.
  • పొలంలో ఈ పురుగులను పర్యవేక్షించటానికి వీలుగా ఉచ్చులను ఉపయోగించండి మరియు వీటిని సామూహికంగా పట్టుకోండి.
  • ఈ తెగులుకు ఆతిధ్యం ఇవ్వని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి