ఇతరములు

ఓలీయాండర్ స్కేల్

Aspidiotus nerii

కీటకం

క్లుప్తంగా

  • అనేక తెల్లని స్కేల్స్, కాండం, ఆకులు మరియు పండ్లపై కనపడతాయి.
  • ఆకులు మరియు కాండం సూటీ బూజుతో కప్పబడి ఉండవచ్చు.
  • ఆకులు వాలిపోవడం మరియు ముందుగానే రాలిపోవడం జరుగుతుంది.
  • పండ్ల రూపం మారిపోతుంది.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఓలీయాండర్ స్కేల్ మొక్కల వివిధ భాగాలను ఆహారంగా తింటాయి. ఈ తెగులు లక్షణాలు దాడి తీవ్రత పైన ఆధారపడి వుంటాయి. అనేక తెల్లని పొలుసులు ( సుమారు 2 మిల్లీమీటర్లు ) కాండం, ఆకులు మరియు పండ్లపైన కనిపించడం దీని మొదటి లక్షణంగా చెప్పవచ్చు. ఇవి ఆహరం తీసుకుంటున్నప్పుడు హనీడ్యూ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హనీడ్యూ పండ్లు మరియు ఆకులపైన పడి సూటీ బూజు దానిపైన వృద్ధి చెందుతుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు వాలిపోయి ముందుగానే రాలిపోతాయి. చిగుర్లు ఎండిపోయి పండ్ల రూపం మారిపోతుంది.టేబుల్ ఆలివ్ చెట్లలో ఈ తెగులు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. మొత్తం మీద చెట్లుబలం మరియు సత్తువ కోల్పోయి పండ్ల సంఖ్య మరియు దిగుబడి ప్రభావితమౌతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పరాన్న జీవులైన ఆఫీటస్ మెలినస్ మరియు ఆఫీటిస్ చిలేన్సిస్ మరియు కొక్కినెల్లిడ్ ప్రెడేటర్లు అయిన చిలోకోరస్ బిపిస్టులటస్, రైజోబియూస్ లోఫన్టాయి మరియు చిలోకోరస్ కువానేయి ఈ A నెర్రి కు సహజ శత్రువులు. ఎండ అధికంగా ఉండే ప్రాంతాలలో చివరిది ఈ స్కేల్స్ తీవ్రత చాలా అధికంగా వున్నప్పుడు వీటిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్వల్పకాలం నిలకడగా వుండే మొక్కల నూనెలు, మొక్కల కషాయం, ఫ్యాటీ యాసిడ్లు లేదా పెరిత్రిన్స్ వంటి సేంద్రియ పురుగుల మందులు కూడా ఉపయోగించవచ్చు. వీటిని తరుచుగా మరియు ఆకుల క్రింది భాగంలో వాడవలసి ఉంటుంది .

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. డెల్టామేత్రిన్, లాంబ్డా- సైహలోత్రిన్ లేదా సైప్ర్ మేత్రిన్ కలిగిన కాంటాక్ట్ స్ప్రే ఆకుల క్రింది భాగంలో ఉపయోగించడం వలన ఈ తెగులును కొంతవరకు నియంత్రించవచ్చు. సిస్టమిక్ కీటక నాశిని అయిన అసిటమిప్రిడ్ ను మొక్కల కణజాలం గ్రహించి దీనిని స్కేల్స్ ఆహారం తీసుకుంటున్నప్పుడు పీల్చుకుంటాయి. చనిపోయిన స్కేల్స్ ఆకులకు, కొమ్మలకు చాలా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి.

దీనికి కారణమేమిటి?

ఆస్పిడియోటూస్ నెర్రి అనబడే ఈ ఓలీయాండర్ స్కేల్ చెట్లపై తినడం వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. పెద్దవి చదునుగా మరియు కోలగా ఉండి సుమారు 2 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ద్రవాలను వికర్షింపచేసే తెల్లని మైనపు పైపొరను కలిగి ఉంటాయి.పూర్తిగా ఎదగని దశలో( ప్రాకే క్రిములు) ఇవి చాల చిన్నగా ఉంటాయి. ఇవి రెండు కూడా ఆకుల క్రింది భాగంలో మరియు కొమ్మలపైన కణద్రవ్యాన్ని పీలుస్తూ కనపడతాయి. తెగులు సంక్రమించిన మొక్కల ద్వారా ఇవి సుదూర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. స్థానికంగా ఈ పాక్ క్రిములు చాలా చురుకుగా ఉంటాయి. ఒకదానికి ఒకటి తగిలే కొమ్మల ద్వారా ఇవి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు వలస పోతాయి. ఉష్ణోగ్రత మరియు తేమ వీటి జీవిత చక్రం పైన చాలా ముఖ్యమైన ప్రభావాన్ని కలిగి వుంటాయి. 30°C వద్ద ఈ పాక్ క్రిముల వృద్ధికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ఆలివ్ తోటలలో A. నేరి ఒక చిన్న చీడగా పరిగణింపబడుతుంది. ఆపిల్, మామిడి, పామ్ చెట్టు, వోలియెండెర్ మరియు నిమ్మ జాతి చెట్లు వీటికి అతిధి చెట్లుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • చెట్ల మధ్య సరిపడినంత దూరాన్ని పాటించండి.
  • చెట్ల కొమ్మలు ఒకదానికి ఇంకొకటి తగలకుండా కత్తిరించండి.
  • ఈ తెగులు లక్షణాలకోసం తోటను క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • వీటి సంఖ్య తక్కువగా వున్నపుడు గీరడం ద్వారా వీటిని తొలగించండి.
  • దిగుమతి చేసుకున్న అంటుమొక్కలు ఈ స్కేల్స్ కలిగి ఉన్నాయేమో జాగ్రత్తగా పరీక్షించండి.
  • తెగులు సోకిన మొక్కలను రవాణా చేయకండి.
  • ప్రయోజనకరమైన కీటకాలను ప్రభావితం చేసే విస్తృత పరిధి కల పురుగుల మందులను వాడకండి.
  • ఈ తెగులు తీవ్రత అధికంగా వున్న చెట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటండి.
  • ఉచ్చులు వుపయోగించి వీటికి సహాయకారులుగా వుండే చీమలను అడ్డుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి