ఆలివ్

ఆలివ్ చిమ్మట

Prays oleae

కీటకం

క్లుప్తంగా

  • ఆకులపై సొరంగాలు మరియు విసర్జించబడిన మల పదార్ధం ఆకుల దిగువ భాగంలో కనపడుతుంది.
  • పుష్పగుచ్ఛాలు పట్టు లాంటి దారంతో చుట్టబడిఉంటాయి.
  • లార్వా పండ్లలోకి ప్రవేశించి వాటిని తినడం వలన పండ్లు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

సంవత్సరంలో సమయం బట్టి మారుతూ ఉంటాయి. ఆకు-తినిపించే తరం పురుగులు ఆకుల రెండు పొరల మధ్య సొరంగాలు చేస్తాయి మరియు ఆకుల దిగువ భాగంలో సొరంగాలు మరియు చాలా అధికంగా మల పదార్ధాన్ని విసర్జిస్తాయి. విండో-ఫీడింగ్ నమూనాని కూడా కొన్నిసార్లు గమనించవచ్చు. పువ్వులను తినే తరం పురుగులు పట్టు దారాలతో అనేక పుష్పాలను కలిపి ఒక గూడును తయారు చేస్తాయి. ఇవి చాలా అధికంగా తినడం వలన చాలా అధికంగా మల పదార్ధాన్ని విసర్జిస్తాయి. పండును తినే పురుగుల తరంలో, వేసవి ప్రారంభంలో ఆలివ్ చెట్టు యొక్క చిన్న పండ్లకు లార్వా రంధ్రాలు చేస్తుంది మరియు శరదృతువు ప్రారంభంలో, అవి పూర్తిగా పెరిగినప్పుడు, మట్టిలో ప్యూపా దశకు చేరడానికి పండు నుండి నిష్క్రమిస్తాయి. పండ్లు అకాలంగా రాలిపోవడం అనేది పండ్లకు కలిగిన నష్టం యొక్క ప్రత్యక్ష పరిణామం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటికి అనేక సహజ శత్రువులైన కీటక జాతులు ఉన్నాయి మరియు కొన్ని రకాల చీమలు, క్రిసోపిడ్లు మరియు పెంకు పురుగులు ఒకటి లేదా అనేక తరాలకు చెందిన గుడ్లను తింటాయి. పారాసిటోయిడ్స్‌లో అనేక రకాల కందిరీగలు ఉన్నాయి, వాటిలో ట్రైకోగ్రామా ఎవానెసెన్స్ మరియు అజెనియాస్పిస్ ఫ్యూసికోల్లిస్ ఉన్నాయి. బాసిల్లస్ తురింజియెన్సిస్ కుర్స్తాకి ఆధారిత ద్రావణాలు కూడా ఆలివ్ చిమ్మట సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయని తేలింది. పెద్ద చిమ్మటలను పట్టుకోవడంలో లింగాకర్షక బుట్టలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని వసంత ఋతువు ప్రారంభంలో అమర్చాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి కీసుకోండి. సంభోగంలో అంతరాయాలు లేదా ఇథిలీన్ అప్లికేషన్లు తెగులును సమర్థవంతంగా నియంత్రించగలవు. లార్వా దశలో పుష్పాలను (మొదటి తరం)తినకుండా నియంత్రించడానికి వాడే ఆర్గానోఫాస్ఫేట్ సమ్మేళనాలు ఈ తెగులును బాగా నియంత్రిస్తాయి.

దీనికి కారణమేమిటి?

ప్రేస్ ఒలే జాతికి చెందిన మూడు వేర్వేరు తరాల లార్వాల వల్ల మొగ్గలు, ఆకులు మరియు పండ్లకు నష్టం కలుగుతుంది. పెద్ద చిమ్మటలు సిల్వర్ మెటాలిక్ ఛాయలో బూడిదరంగు ముందరి రెక్కలు మరియు అనేక నల్ల మచ్చలను కలిగి ఉంటాయి, కొన్ని నమూనాలలో అవి కనిపించకుండా ఉండవచ్చు. వెనుక రెక్కలు ఏకరీతి బూడిద రంగులో ఉంటాయి. తరాన్ని బట్టి లార్వా రంగు మరియు పరిమాణంలో మారుతూ ఉంటుంది. వీటిలో ప్రతి ఒక్కటి ఆలివ్ చెట్టు యొక్క నిర్దిష్ట భాగాన్ని తినడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. మొదటి బ్యాచ్ లార్వా (ఆకులను తినే తరం) వసంత ఋతువు మధ్యలో కనిపిస్తుంది మరియు మొగ్గలను మరియు తరువాత దశలో, పువ్వులను తింటాయి. రెండవ బ్యాచ్ లార్వా (పుష్పాలను తినే తరం) వేసవి ప్రారంభంలో ఉద్భవిస్తుంది మరియు ఇది అత్యంత విధ్వంసకరం. ఆడ పురుగులు కాండం దగ్గర ఉన్న చిన్న పండ్లపై గుడ్లు పెడతాయి, మరియు చిన్న లార్వా ఆలివ్‌ పండు లోకి ప్రవేశించి దానిని కబళిస్తుంది, దీని వలన భారీగా పండ్లు రాలిపోతాయి. చివరగా, పండ్ల నుండి ఉద్భవించే తరం ఆకులకు వలసపోతుంది, అక్కడ అవి ఆకు తొలుచు పురుగుల వలె ఆకుల పై పొరల మధ్యన సొరంగాలు చేస్తాయి.


నివారణా చర్యలు

  • మీ దేశంలో ఉన్న క్వారంటైన్ నిబంధనలను చెక్ చేయండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక లేదా స్థితిస్థాపక రకాలను నాటండి.
  • పి.
  • ఓలీయే సంక్రమణ సంకేతాల కోసం ఆలివ్ చెట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ప్రస్తుతం ఉన్న చిమ్మటల సంఖ్యను గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • వీటి సహజ శత్రువులైన కీటకాలను చంపే విస్తృత-స్థాయి పురుగుమందుల వాడకాన్ని నివారించండి.
  • తెగులు సోకిన మొక్కలను తోటల మధ్య రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి