ఆలివ్

ఆలివ్ పంటలో పండు ఈగ

Bactrocera oleae

కీటకం

క్లుప్తంగా

  • పండిన పండ్లపై త్రిభుజాకార ఆకారంలో రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి.
  • అవి మొదట ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ తర్వాత పసుపు-గోధుమ రంగులోకి మారుతాయి.
  • లార్వాలు తినడం వలన పండ్ల కండకి నష్టం కలుగుతుంది.
  • ఆలివ్ పండ్లు ఎండిపోయి ముందుగానే రాలిపోవచ్చు..

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

పండిన పండ్లపై ఆడ ఈగల అండాశయ పంక్చర్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. అవి త్రిభుజాకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, తరువాత పసుపు-గోధుమ రంగులోకి మారుతాయి. లార్వా పండ్ల లోపల తినడం వలన అత్యధిక నష్టం కలుగుతుంది. ఆలివ్ పండ్లు ఎండిపోయి ముందుగానే రాలిపోవచ్చు. ఈ గాయాలు బాక్టీరియల్ మరియు ఫంగల్ వ్యాధికారక క్రిములకు ప్రవేశ కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి. పండ్ల దిగుబడి, నాణ్యత మరియు నూనె దిగుబడి తగ్గుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఆలివ్ పండు ఈగ జనాభాను నియంత్రించడానికి వ్యాధి సోకిన తోటలలో అనేక పరాన్నజీవి కందిరీగలను ప్రవేశపెట్టవచ్చు. ఓపియస్ కాంకోలర్, ప్నిగాలియో మెడిటరేనియస్, ఫోపియస్ అరిసానస్, డయాచస్మిమోర్ఫా క్రాస్సీ లేదా యూరిటోమా మార్టెల్లి వాటిలో కొన్ని. ప్రెడేటర్లలో లాసియోప్టెరా బెర్లేసియానా ఉన్నాయి. వేప చెట్టు సారం లేదా రోటెనోన్ ను సహజ వికర్షకాలుగా ఉపయోగించవచ్చు. పండ్లపై ఆడ పురుగులు గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి కావోలిన్ పొడిని కూడా విజయవంతంగా ఉపయోగించబడింది. రాగి-ఆధారిత వికర్షకాలతో చేసే(బోర్డియక్స్ మిశ్రమం, కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ ఆక్సిక్లోరైడ్) నివారణ చికిత్సలు కూడా పని చేస్తాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవసంబంధమైన చర్యలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. జనాభా ఒక పరిమితిని చేరుకున్నప్పుడు డైమెథోయేట్, డెల్టామెత్రిన్, ఫాస్మెట్ లేదా ఇమిడాక్లోరిడ్ ఆధారిత పురుగు మందులను ఉపయోగించవచ్చు. విషపూరితమైన ప్రోటీన్ ఎరలు లేదా మాస్ ట్రాపింగ్‌తో నివారణ చికిత్సలు కూడా సాధ్యమే.

దీనికి కారణమేమిటి?

ఆలివ్ పండు ఈగ బ్యాక్ట్రోసెరా ఒలే యొక్క లార్వాల వల్ల లక్షణాలు ఏర్పడతాయి, దీనికి ఏకైక అతిధేయ చెట్టు ఆలివ్ చెట్టు. పెద్ద పురుగులు 4-5 మిమీ పొడవు, నలుపు గోధుమ రంగు శరీరం, నారింజ రంగు తల మరియు రొమ్ము భాగం రెండు వైపులా తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు ఉంటాయి. రెక్కల చివర్లో ముదురు రంగు చుక్కతో అపారదర్శక రెక్కలు మరియు ముదురు రంగు సిరలను కలిగి ఉంటాయి. పెద్ద ఆలివ్ పండు ఈగ చాలా నెలలు జీవించగలదు. ఆడ ఈగలు వాటి జీవితకాలంలో 400 వరకు గుడ్లు పెట్టగలవు, పొత్తికడుపు దిగువన వుండే ఒక స్టింగర్‌ని ఉపయోగించి పండిన పండ్ల పై తొక్కని గుచ్చి లోపల ఒక్క గుడ్డును పెడతాయి. లార్వా క్రీము తెల్లగా ఉంటాయి మరియు పండ్ల గుజ్జును తింటాయి, దీని వలన పండ్లకి గణనీయమైన నష్టం జరుగుతుంది మరియు పండ్లు ముందుగానే రాలిపోతాయి. ఉష్ణోగ్రతపై ఆధారపడి(అనుకూలమైన ఉష్ణోగ్రత 20-30 °C) ఒక సంవత్సరంలో 2 నుండి 5 తరాల ఆలివ్ పండు ఈగలు ఉండవచ్చు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోండి.
  • ఈగలను పట్టుకోవడానికి మరియు వాటి సంఖ్యను పర్యవేక్షించడానికి జిగురు లేదా లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • అధిక నష్టాన్ని నివారించడానికి ముందుగానే పండ్లను కోయండి, నాణ్యమైన పండ్లను పొందడం ద్వారా దిగుబడిలో నష్టాన్ని భర్తీ చేయవచ్చు.
  • జనాభా పెరుగుదలను నివారించడానికి పండ్ల తోటలను పరిశుభ్రంగా ఉంచడం కీలకం.
  • చెట్టుకి ఉన్నలేదా నేలపై పడిన వ్యాధి సోకిన పండ్లను వెంటనే తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి