ఇతరములు

గ్రేప్ బెర్రీ చిమ్మట

Lobesia botrana

కీటకం

క్లుప్తంగా

  • చిన్న లార్వా పువ్వులను ఆహారంగా తిని గ్లోమెరుల్స్ అని పిలువబడే పట్టు నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది.
  • పెద్ద గొంగళి పురుగులు బెర్రీలలోనికి చొచ్చుకుపోయి, వాటిని బోలుగా చేసి, చర్మం మరియు విత్తనాలను బహిర్గతం చేస్తాయి.
  • బెర్రీల మధ్య పట్టు దారాలు పుష్కలంగా ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ద్రాక్ష
ఆలివ్

ఇతరములు

లక్షణాలు

మొదటి తరం లార్వా వసంత ఋతువు చివరిలో లేదా వేసవి ప్రారంభంలో ఒంటరి పూమొగ్గలను తింటుంది. తరువాత, ప్రతి లార్వా అనేక పూమొగ్గలను పట్టు దారాలతో కలిపి, కంటికి కనిపించే "గ్లోమెరుల్స్" అనే నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఇవి తమ గూడు లోపల ఉన్న పువ్వులను తిన్నప్పుడు, అవి కంటికి స్పష్టంగా కనిపించేంత స్థాయిలో మలపదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. రెండవ తరం లార్వా (వేసవి మధ్యలో) మొదట ఆకుపచ్చ బెర్రీలను తింటుంది. తరువాత ఇవి వాటిలోకి చొచ్చుకుపోయి, వాటిని ఖాళీ చేసి, పై తొక్క మరియు విత్తనాలను మాత్రమే వదులుతాయి. మూడవ తరం లార్వా (వేసవి చివరిలో) బెర్రీల లోపల మరియు పుష్పగుచ్ఛాల లోపల తినడం ద్వారా చాలా అధిక నష్టాన్ని కలిగిస్తుంది. తరువాత ఇవి క్రమంగా ఎండిపోతాయి. బెర్రీలు పడిపోకుండా ఉండడానికి బెర్రీల మధ్యన సిల్క్ దారాలను నేస్తాయి. ఇవి తినడం వలన నష్టం వాటిల్లిన ప్రాంతంలో అనేక రకాల అవకాశవాద శిలీంధ్రాలు లేదా కీటకాల వలన తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఉదా. ఎండుద్రాక్ష చిమ్మట (కాడ్రా ఫిగ్యులిల్ల), పండు ఈగలు మరియు చీమలు. పెరుగుతున్న ప్రాంతాలు, చిగుర్లు లేదా ఆకులపై లార్వా నష్టం అసాధారణం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు జనాభాను నియంత్రించడానికి ద్రాక్షలో వాడటానికి అనేక సేంద్రీయ పురుగుమందులు సిఫార్సు చేయబడ్డాయి. వీటిలో సహజ క్రిమి పెరుగుదల నియంత్రకాలు, స్పినోసిన్లు మరియు బాసిల్లస్ తురింజెన్సిస్ ఆధారిత పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని జాతుల టాచినిడ్ ఈగలు మరియు అనేక రకాల పరాన్నజీవి కందిరీగలు (100 పైన) వంటి పరాన్నజీవులు కూడా ఎల్. బొట్రానా జనాభాను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కొన్ని జాతుల పరాన్నజీవులు ద్రాక్ష బెర్రీ చిమ్మట యొక్క లార్వాలో 70% వరకు మరణానికి కారణమవుతాయి. ఈ జాతులను ద్రాక్షతోటలో ప్రవేశపెట్టొచ్చు ఫెరామోన్ పంపిణీ ద్వారా సంభోగంలో అంతరాయం కలిగించడం వలన చిమ్మటలు సంభోగం చెందకుండా నిరోధిస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎల్. బొట్రానా జనాభాను నియంత్రించడానికి అనేక విస్తృత పరిధి కల పురుగుమందులు (ఆర్గానోక్లోరిన్లు, కార్బమేట్లు, ఆర్గానోఫాస్ఫేట్లు మరియు పెరిథ్రాయిడ్లు) ఉపయోగించవచ్చు, కానీ చిమ్మటను వేటాడి తినే జీవులను మరియు వాటి లార్వాలను కూడా చంపుతాయి. ఈ చర్యలను జీవ లేదా రసాయన నియంత్రణలతో కలపడం అవసరం.

దీనికి కారణమేమిటి?

లోబెసియా బొట్రానా యొక్క గొంగళి పురుగులు తినడం వలన ఈ వ్యాధి లక్షణాలు ఏర్పడతాయి. శీతాకాలంలో, బెరడు క్రింద పట్టు గూళ్ళ లోపల, ఎండిన ఆకుల దిగువ భాగంలో, మట్టి పైన లేదా తీగ అవశేషాలపైన ప్యూపా మనుగడ సాగిస్తుంది. పెద్ద పురుగుల ముందు రెక్కలు టాన్-క్రీమ్ రంగులో మొజాయిక్-నమూనాతో కూడిన బూడిద, గోధుమ మరియు నలుపు రంగు పొక్కుల వంటి మచ్చలతో ఉంటాయి. రెండవ జత రెక్కలు కప్పబడిన అంచుతో బూడిద రంగులో ఉంటాయి. 10 నుండి 12 రోజుల వరకు గాలి ఉష్ణోగ్రతలు 10°C పరిమితిని మించినప్పుడు మొదటి తరం పెద్ద పురుగులు బయటకు వస్తాయి. 26-29°C ఉష్ణోగ్రత మరియు 40 నుండి 70% వరకు తేమ వీటికి ఉత్తమమైన వృద్ధి పరిస్థితులు. లార్వా మొగ్గలోకి చొచ్చుకుపోయి పువ్వుల తొడిమలకు రంద్రాలు చేస్తుంది మరియు ద్రాక్షగుత్తుల యొక్క తొడిమలోకి కూడా ప్రవేశించి అది ఎండిపోయేటట్టు చేస్తుంది. పెద్ద గొంగళి పురుగులు పండ్లను పట్టు దారాలతో కలిపి, ఆపై వాటిని కొరికి తింటుంది లేదా లోపలకు చొచ్చుకుపోతాయి. ఆ ప్రాంతంలో వేసవి కాలం వ్యవధిని బట్టి ఈ చిమ్మట సంవత్సరానికి 2-4 తరాలను కలిగి ఉంటుంది.


నివారణా చర్యలు

  • మీ దేశంలో క్వారంటైన్ నిబంధనల గురించి తెలుసుకోండి.
  • ఆరోగ్యకరమైన నాట్లు లేదా అంటుకట్టుట పదార్థాన్ని ఉపయోగించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే, స్థితిస్థాపక రకాలను పెంచుకోండి.
  • వసంత ఋతువు నుండి ద్రాక్ష తోటలను ప్రతి వారం గమనిస్తూ వుండండి.
  • చిమ్మటల సంఖ్యను నిర్ణయించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • ద్రాక్ష పందిరి యొక్క నిర్దిష్ట కత్తిరింపు మరియు ఆకు తొలగించడం వంటి సాగు పద్ధతులు పందిరిలోనికి వెంటిలేషన్ మెరుగుపరచడానికి సహాయపడతాయి.
  • తగినంత నీరు పెట్టండి.
  • స్టాక్స్ యొక్క దిగువ భాగం వద్ద మట్టిని ఎగదోయడం వలన మంచు నుండి రక్షణ కలుగుతుంది.
  • ద్రాక్షతోటను కలుపు మొక్కలకు దూరంగా ఉంచండి.
  • తెగులు యొక్క గరిష్ట జనాభాను నివారించడానికి పంట కోత సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి.
  • వీటిని వేటాడి తినే జాతులను చంపే విస్తృత స్థాయి పురుగుమందుల వాడకాన్ని నివారించండి.
  • తెగులు సోకిన మొక్క పదార్థాలను పండ్ల తోటల మధ్య రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి