ద్రాక్ష

ద్రాక్ష మొగ్గ పురుగు

Eupoecilia ambiguella

కీటకం

క్లుప్తంగా

  • లార్వాలు మొగ్గలు మరియు బెర్రీలను తింటాయి.
  • దీని వలన గణనీయమైన నష్టం జరుగుతుంది.
  • మొగ్గలు లేదా బెర్రీలు పట్టు దారాలతో కలపబడి వుంటాయి.
  • ఇవి తిన్న ప్రాంతంలో బూడిద లేదా గోధుమ అచ్చు ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

చిన్న లార్వాలు పూమొగ్గల్లోకి రంధ్రం చేసి లోపలినుండి ఆహారం తింటాయి. దీని ఫలితంగా జరిగిన నష్టం వలన ద్రాక్ష మార్కెట్ చేయడానికి పనికిరాదు. ఇవి మొదటి సారి తినడం మొదలుపెట్టినప్పుడు అనేక మొగ్గలను పట్టు దారాలతో కలుపుతాయి, చివరికి ఇవి మందపాటి గూడును తయారుచేసుకుని అందులో వృద్ధి చెందుతాయి. రెండవ తరం గొంగళి పురుగులు వాటి గూడు చుట్టూ పెరుగుతున్న బెర్రీలను తినడం వలన ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి చాలా అధికమొత్తంలో మలపదార్ధాలను విసర్జిస్తాయి. ఒకే లార్వా డజను బెర్రీల వరకు తినగలదు. అందువలన గణనీయమైన నష్టం జరుగుతుంది. ఇవి తిన్న ప్రాంతంలో బూడిద రంగు బూజు, బొట్రిటిస్ సినీరియా చేరడం వలన గాయం తీవ్రమవుతుంది. లేకపోయినట్లయితే ప్రక్కనే వున్న బెర్రీలు పాడవ్వనట్లయితే ఇవి కూడా వీటికి స్థావరాలుగా మారి గోధుమ రంగు బూజుగా మారతాయి. ఐరోపా మరియు ఆసియాలో వైన్ ఉత్పత్తి చేసే అనేక ప్రాంతాలలో ఈ చిమ్మట చాలా తీవ్రమైన తెగులుగా పరిగణించబడుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోగ్రామా కకోసియా మరియు టి. ఎవానెస్సెన్స్ వంటి పరాన్నజీవి కందిరీగలు వీటి గుడ్లలో గుడ్లు పెడతాయి మరియు అందువలన ద్రాక్షతోటలలో ద్రాక్ష మొగ్గ చిమ్మట సంక్రమణలను గణనీయంగా తగ్గిస్తుంది. విస్తృత-స్థాయి పురుగు మందుల అధిక వినియోగం వలన ఈ సహజ శత్రువుల జనాభా తగ్గకుండా చూసుకోండి. స్పినోసాడ్ మరియు సహజ పైరెత్రిన్ ఆధారిత సేంద్రీయ పురుగుమందు ఉత్పత్తులు ఇ. యంబిగ్యుల్లాకు వ్యతిరేకంగా సమర్థవంతమైన పనిచేస్తాయి. ఎన్నిసారు పిచికారి చేయాలి అనేది తెగులు సోకిన బెర్రీల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇ. యంబిగ్యుల్లాకు వ్యతిరేకంగా పైరెథ్రాయిడ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ తెగులు పునరావృతమయ్యే ప్రాంతాల్లో పూత తర్వాత కీటకనాశినుల వాడకం అవసరం ఉండవచ్చు. రెండవ తర్వాత సంక్రమణము నియంత్రించడానికి వేసవి చివర్లో తిరిగి ఈ పురుగు మందులను వాడవలసిన అవసరం ఉండవచ్చు. తెగులు సోకిన బెర్రీల పరిమాణం బట్టి ఎన్ని సార్లు పిచికారీ చేయాలి అనేది ఆధారపడివుంటుంది. రెండవ తరం గొంగళి పురుగుల ఆవిర్భావం ఉష్ణోగ్రత మరియు తేమ మీద ఆధారపడి వుంటుంది

దీనికి కారణమేమిటి?

ద్రాక్ష మొగ్గ చిమ్మట యుపోసిలియా యంబిగ్యుల్లా యొక్క గొంగళి పురుగులు తినడం మరియు బొట్రిటిస్ సినెరియా అనే ఫంగస్ దెబ్బతిన్న కణజాలంపై నివాసం ఏర్పరచుకోవడం వలన ఈ వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి. పెద్ద చిమ్మట పసుపు-గోధుమ రంగు ముందరి రెక్కలు, ముదురు గోధుమ రంగు పట్టీ మరియు బూడిదరంగు అంచుగల వెనక రెక్కలు కలిగివుంటుంది. వసంత ఋతువు చివరిలో లేదా వేసవి మధ్యలో ద్రాక్ష బెర్రీలపై పూల మొగ్గలు లేదా కాడలపై ఆడ పురుగు గుడ్లు (100 వరకు) ఒకేసారి పెడతాయి. 8-12 రోజుల తరువాత లార్వా పొదుగుతుంది. ఇవి గోధుమ-పసుపు మరియు 12 మి.మీ పొడవు వరకు ఉంటాయి, మొత్తం శరీరం మీద చెల్లాచెదురుగా వెంట్రుకలు ఉంటాయి. శీతాకాలంలో రెండవ తరం ప్యూపాగా బెరడు లేదా ఇతర అనువైన ప్రదేశాల్లోని పగుళ్లలో మనుగడ సాగిస్తుంది. ఈ చిమ్మట యొక్క జీవిత చక్రం ఎక్కువగా ఉష్ణోగ్రత మరియు తేమపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా చల్లటి మరియు తేమతో కూడిన ప్రాంతాలలో కనిపిస్తుంది మరియు సంవత్సరానికి రెండు తరాలు మాత్రమే కలిగి ఉంటుంది. వాంఛనీయ సాపేక్ష ఆర్ద్రత స్థాయి 70% లేదా అంతకంటే ఎక్కువ మరియు 18 నుండి 25°C మధ్య ఉష్ణోగ్రత దీని వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ సాపేక్ష ఆర్ద్రత స్థాయిలు మరియు ఉష్ణోగ్రతలలో గుడ్లు పొడగబడవు.


నివారణా చర్యలు

  • మీ దేశంలో క్వారంటైన్ నిబంధనలను చెక్ చేయండి మరియు సందేహం వచ్చినప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించండి.
  • తెగులు సోకిన మొగ్గలు లేదా బెర్రీల కోసం ద్రాక్ష తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూవుండండి.
  • వీటి సంఖ్యను అంచనా వేయడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • ఈ చిమ్మట నేలమీద ఆకు చెత్తలో ప్యుపాగా మారుతుంది కాబట్టి, వసంతకాలంలో ఇవి జననాన్ని తగ్గించడానికి ద్రాక్షతోటలో చెత్తను తొలగించి నాశనం చేయండి.
  • ప్రత్యామ్నాయంగా, ఆకు చెత్తను మట్టితో కప్పడం వలన ఇవి జనించకుండా ఉంటాయి.
  • ఈ రెండు పనులు మొగ్గలు వికసించడానికి మూడు వారాల ముందు పూర్తి చేయాలి.
  • వీటి తీవ్రత తక్కువగా వున్నప్పుడు దెబ్బతిన్న బెర్రీలను చేతితో తొలగించండి.
  • తెగులు సోకిన పదార్థాన్ని ఇతర పొలాలకు లేదా తోటలకు రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి