Argyrotaenia ljungiana
కీటకం
వసంత ఋతువులో, వృద్ధి చెందుతున్న మొగ్గలను మరియు లేత ఆకు కణజాలాలను గొంగళి పురుగులు తింటాయి. ఫలితంగా ఆకు ఈనెలు మాత్రమే మిగిలి ఆకులు అస్థిపంజరంలాగా మారతాయి. మొగ్గలు వికసించడానికి ముందు. పెద్ద లార్వాలు గుత్తుల్లోకి ప్రవేశించి అనేక ఆకులను కలిపి గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. అవి పైతొక్కను గీరవచ్చు లేదా ఇవి ద్రాక్ష లోపల తింటూ ద్రాక్ష పండ్లలోకి లోకి చొచ్చుకుపోవచ్చు. ఇదే కాకుండా ఆకులు మరియు ద్రాక్ష పండ్లకు గాయాలు అవుతాయి. ఈ దెబ్బతిన్న కణజాలాలను అవకాశవాద వ్యాధికారక సూక్ష్మ జీవులు ఆవాసంగా చేసుకోవడం వలన కుళ్ళిపోతుంది. ఈ తెగులు సాధారణంగా, ద్రాక్షతో పాటు పియర్ మరియు ఆపిల్ చెట్లకు కూడా సంక్రమిస్తుంది. ప్రత్యామ్నాయ అతిధి మొక్కల్లో మల్లో, కర్లీ డాక్, ఆవాలు లేదా లుపిన్ ఉన్నాయి. ఓట్స్ మరియు బార్లీ యొక్క ద్రాక్షతోట కవర్ పంటలు కూడా ఈ తెగులును ఆకర్షిస్తాయి.
పరాన్నజీవి కందిరీగలు, కొన్ని జాతుల ట్రైకోగ్రామా మరియు ఎక్సోచస్ నిగ్రిపాల్పస్ సుబోబుస్కురస్ ఇంకా అనేక జాతుల సాలెపురుగులు లార్వాలను తింటాయి. బాసిల్లస్ తురింగెన్సిస్ మరియు స్పినోసాడ్ ఆధారిత సేంద్రీయ సూత్రీకరణల పిచికారీ జీవశాస్త్రపరంగా ఆమోదయోగ్యమైన నిర్వహణ సాధనాలు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. టార్ట్రిక్స్ చిమ్మటలకు వ్యతిరేకంగా మేథోక్సిఫెనోజైడ్, క్లోరాంత్రనిపోల్, క్రయోలైట్ మరియు స్పినెతో రమ్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉన్న పిచికారీలు ప్రభావవంతంగా ఉంటాయి.
పాలిఫాగస్ జాతుల ఆర్గిరోటెనియా జుంగియానా తినడం వలన ఆకులు మరియు ద్రాక్షపై ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. పెద్ద పురుగులు సుమారు 15 మి.మీ వెడల్పు రెక్కలు కలిగి ఉంటాయి. ఇవి లేత గోధుమ రంగు ముందరి రెక్కలు, కొన్ని ముదురు పార్శ్వ బ్యాండ్లు మరియు గడ్డి-రంగు వెనక రెక్కలతో ఉంటాయి. శీతాకాలంలో దీని లార్వా, బెరడు భూమిపై లేదా కలిసిపోయి వున్న ఆకులపై ప్యూపా స్థితిలో మనుగడ సాగించడం కాని, ప్రత్యామ్నాయ అతిధి మొక్కలపై జీవించడం చేస్తాయి. వసంత ఋతువులో ఆడ పురుగులు ఆకుల ఉపరితలంపై సుమారు 50 వరకూ గుడ్లు పెడతాయి. గొంగళి పురుగులు పాలిపోయిన పచ్చ రంగులో, కొంచెం అపారదర్శకంగా పసుపు గోధుమ రంగుతో ఉంటాయి. ఇవి మొదట ఆకు ఈనెల మధ్యన వున్న లేత ఆకు కణజాలాన్ని తింటాయి. దీని వలన ఈనెలు మాత్రమే మిగిలి ఆకు అస్థిపంజరంలాగా కనపడుతుంది. పెద్ద లార్వా ఆకులను చుట్టి లేదా ఆకులను కలిపి గూడును నిర్మించుకుంటాయి. ఇవి మొగ్గలు మరియు పండ్లను కూడా తింటాయి. ఇవి సంవత్సరానికి మూడు తరాలను వృద్ధి చేస్తాయి అలాగే ఈ తెగులు యొక్క అన్ని వృద్ధి దశలు పంట ఎదిగే అన్ని దశల్లోనూ ఉంటాయి.