ఇతరములు

కాటనీ కుషన్ స్కేల్

Icerya purchasi

కీటకం

క్లుప్తంగా

  • పెద్దవి మరియు పిల్ల పురుగులు మొక్కల కణద్రవ్యాన్ని పీల్చుకుని చాలా అధిక మొత్తంలో హనీ డ్యూ ఉత్పత్తి చేస్తాయి.
  • ఆకులు వాలిపోవడం రెమ్మలు డై బ్యాక్ అవడం గమనించవచ్చు.
  • చాలా అధిక మొత్తంలో హనీ డ్యూ నల్ల బూజు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
  • మొక్క సత్తువ తగ్గడం, చెప్పుకోదగ్గ స్థాయిలో కాయ నాణ్యత మరియు దిగుబడి తగ్గడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
నిమ్మజాతి
జామ
మామిడి
గులాబీ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

పెద్దవి మరియు పిల్ల పురుగులు మొక్కల కణద్రవ్యాన్ని పీల్చుకుని చాలా అధిక మొత్తంలో హనీ డ్యూ ఉత్పత్తి చేస్తాయి. కాండం, ఆకులు పుష్ప గుచ్చము మరియు లేత చిగుర్లు దీనితో కప్పబడి వుంటాయి. కణద్రవ్యం తగ్గడం వలన ఆకులు వాలిపోయి రెమ్మలు డైబాక్ చెందుతాయి. ఇవి ఆహరం తీసుకుంటున్నప్పుడు చాలా అధిక మొత్తంలో హనీ డ్యూ ని విడుదల చేయడం వలన అది ఆకులను కప్పివేసి నల్ల బూజు వృద్ధి చెందడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు రాలిపోవడం మరియు రెమ్మలు డైబాక్ అవ్వడం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ బాగా తగ్గిపోతుంది. దీనితో చెట్ల సత్తువ తగ్గి పండ్ల నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటికి సహజ శత్రువులుగా బాగా చెప్పుకోదగిన వాటిలో లేడీ బర్డ్స్ మరియు లేస్ వింగ్స్ ఉంటాయి. వెడలియా బీటిల్, రోడలియా కార్డినలిస్ వీటికి నిర్దిష్టమైన సహజ శత్రువులు. వీటి చిన్న లార్వా గుడ్లను మరియు పెద్దవి స్కెల్స్ యొక్క అన్ని దశలలోను వాటిని ఆహారంగా తీసుకుంటాయి. పరాన్నజీవి ఈగ, క్రిప్టో ఛాయిటం ఐసెర్యై కూడా ఈ స్కెల్స్ యొక్క సమర్ధవంతమైన పరాన్న జీవులు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. స్కేల్స్ మరియు క్రాలర్లు ఒక మందపాటి మైనపు కోటింగ్ తో కప్పబడి ఉంటాయి. దీని వలన వీటికి వ్యతిరేకంగా రసాయనిక కీటక నాశినులను ఉపయోగించడం కష్టం. అసిటమిప్రిడ్ మరియు మలాథియాన్ కలిగిన ఉత్పత్తులను సమయానుసారం వాడడం, ఈ చీడను అరికట్టడానికి సిఫార్స్ చేయబడ్డాయి. గుడ్లు పొదగబడిన వెంటనే పెట్రోలియం పిచికారీ ఆయిల్ ను ఉపయోగించడం వలన క్రాలర్లను ప్రారద్రోలి అవి మొక్కల కణజాలాన్ని తినకుండా చేస్తాయి.

దీనికి కారణమేమిటి?

కాటనీ కుషన్ స్కేల్ అని పిలవబడే ఐసెర్య పూర్చసి, చెట్ల నాళంలోని ద్రవాన్ని పీల్చివేయడం వలన ఈ లక్షణాలు కనపడతాయి. కొని భౌగోళిక ప్రాంతాలలో ఇతర జాతులు ఆధిక్యతలో ఉండవచ్చు. ఉదాహరణకు ప్లానోకొక్కుస్ సిట్రి. ఇది సుమారు 10–15 మిల్లీమీటర్ల పొడవు ఉండి వాతావరణం అనుకూలిస్తే 2 నెలలలో దీని జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఆడ పురుగులు 1000 వరకు గుడ్లు పెడతాయి. ఇవి కడుపులో కాటన్ సంచి వంటి దానిలో ఈ గుడ్లను ఉంచి తరువాత ఆకులపై పెడతాయి. కొత్తగా పొదగబడిన పిల్లలు( లేదా క్రాలర్స్ అనగా పాకేవి) ముందుగా ఈనెల వెంబడి ఆకులను మరియు లేత రెమ్మలను తినడం మొదలుపెడతాయి. ఇవి పెద్దవి అయ్యేకొలదీ వీటిని కొమ్మలపైనా మరియు కాండం పైన చూడవచ్చు. కానీ చాలా తరుచుగా ఇవి పండ్లపైన కనపడతాయి. వీటికి తేమతో కూడిన చల్లని వాతావరణం ఇష్టంగా ఉండి బాగా గుబురుగా వున్న నిమ్మ చెట్లపైన బాగా వృద్ధి చెందుతాయి. ఇవి ఎదుగుతునప్పుడు వీటికి రక్షణగా ఒక దళసరి దూది వంటి మైనపు కోటును ఏర్పరుచుకుంటాయి. హనీ డ్యూ ను ఆహారంగా తీసుకునే చీమలు ఈ పురుగులను వీటి పిల్ల పిల్లలను కప్పివేసి వీటి సహజ శత్రువుల పనికి అంతరాయం కలిగిస్తాయి. మోర, అకాసియా మరియు రోస్మారినస్ వీటికి ప్రత్యామ్న్యాయ అతిధులు. కానీ ఇవి చాలా రకాల పండ్లు, అడవిలోని చెట్లను మరియు అలంకార పొదలను కూడా నష్టపరచగలవు.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాలకోసం తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ప్రతి చెట్టుకు కొన్ని పచ్చని కొమ్మలను ఎంచుకుని వాటిపైన గుడ్లతో కూడిన పెద్ద పురుగులు ఉన్నాయేమో గమనించండి.
  • ఈ పురుగులకు సహజ శత్రువులైన కీటకాలను సంరక్షించడానికి అధిక మొత్తంలో పురుగుల మందుల వాడకం నివారించండి.
  • సరైన వెంటిలేషన్ వుండే విధంగా చెట్లను కత్తిరించండి.
  • చెట్లపైన వుండే రసం పీల్చే పురుగులను మరియు నేలపైన వున్న నిర్జీవమైన పంట అవశేషాలను తొలగించండి.
  • కాటనీ కుషన్ స్కేల్ ను వ్యాపింపచేసే చీమలను నియంత్రించడానికి అడ్డంకులు మరియు వలలను ఏర్పాటుచేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి