ఇతరములు

మెడిటెర్రనియన్ ఫ్రూట్ ఫ్లై

Ceratitis capitata

కీటకం

క్లుప్తంగా

  • కాయల మీద రంధ్రాలు పడిన, ఆడ వాటికి సంబంధించిన ఓవో పొజిషన్ గుర్తులు కనిపిస్తాయి.
  • తెగులు బారిన పడ్డ కాయలు త్వరగా పండి కుళ్ళి పోతాయి లేదా ముందుగానే రాలిపోతాయి.
  • అవకాశవాద శిలీంధ్రాలు రంధ్రాల చుట్టూ లేదా పండ్ల నుండి కారుతున్న ద్రవాల చుట్టూ పెరుగవచ్చు.

లో కూడా చూడవచ్చు

14 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

ఈగల బారిన పడిన దానికి గుర్తులుగా కాయల పైన రంధ్రాలు పడిన, ఆడ కీటకాలకు సంబంధించిన ఓవో పొజిషన్ గుర్తులు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన కాయలు పక్వానికి రాకముందే పరిపక్వత చెంది ముందుగానే పాడైపోతాయి. కొన్ని సార్లు తీయని రసం వంటి పదార్ధం ఈ పండ్లనుండి స్రవిస్తుంది. అవకాశవాద శిలీంధ్రాలు రంద్రాల చుట్టూ లేదా పండ్ల స్రవణాల చుట్టూ పెరుగవచ్చు. ఈ ఈగలకు తల నుండి పొట్ట మధ్యలో నల్లటి చుక్కలతో వెండిరంగు ఉండి పొట్ట భాగం రాగి రంగులో ముదురు గీతలతో ఉంటుంది. వీటి రెక్కలు లేత గోధుమ రంగు పట్టీలతో బూడిద రంగు చుక్కలతో వుంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కొన్ని జీవ నియంత్రణల్లో ఈ కీటకాలను వేటాడి తినే కీటకాలను మరియు వాటి సహజ శత్రువులను ప్రోత్సహించడం కూడా ఫలితాన్ని ఇచ్చింది. సెరాటిటిస్ కాపిటాట మరియు కొన్ని నెమటోడ్లు కూడా ఒక స్థాయి వరకు అంచనా వేయబడిన పారాసైటిక్ ఫంగిలు (బెయువేరియా బసియానా)లను కూడా ఉపయోగించవచ్చు. . ఈ ట్రీట్మెంట్ ఫలితం పంట దిగుబడి పైన చూపిస్తుంది. వేడి నీటి ప్రవాహం (ఉదాహరణకు 44°C ఉష్ణోగ్రత వున్న వేడి నీటిలో 8 గంటలు ఉంచడం),వేడి నీరు మరియు వత్తిడితో కూడిన వేడి గాలి పద్దతులను ఉపయోగించ వచ్చును. ఈ చికిత్సలను నిల్వ చేయుటకు లేదా రవాణా లేదా రెండింటిలోనూ వాడవచ్చు. అయితే ఇవి చాలా వరకు పండ్ల నిల్వ వుండే కాలాన్ని తగ్గిస్తాయి. పంటను కాపాడటానికి స్పైనోసాడ్ కూడా సకాలంలో పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పండ్లను రక్షించుకొనుటకు క్రిమి నాశినుల ద్రావణాలలో పండ్లను ముంచడం అందరూ ఏకీభవించిన ఒక పద్దతి. పంటకు కవర్ స్ప్రే చేయడం కూడా నివారణా పద్దతులలో ఒకటిగా ఉపయోగించవచ్చు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. మగ మరియు ఆడ కీటకాలను ఒకే ఉచ్చులో సరి అయిన కీటక నాశినితో (మలాథియాన్) తో ఆకర్షించే ప్రోటీన్ ఎరను కలిగివున్న బైట్ స్ప్రేల పద్దతి బాగా ఆమోదం పొందింది.

దీనికి కారణమేమిటి?

మెడిటేర్రానియన్ ఫ్లై సిరటిటిస్ కాపిటాటా లార్వాలు ఆహారంగా తినడం వలన ఈ తెగులు లక్షణాలు బహిర్గతమౌతాయి. దీని పేరు ప్రకారం సబ్-సహారా ఆఫ్రికా మరియు మధ్యధరా ప్రాంతంతో పాటు మధ్య ప్రాచ్యం, దక్షిణ మరియు మధ్య అమెరికా మరియు ఆస్ట్రేలియాలో కూడా దీని ఉనికి ఉంది. ఆడ కీటకాలు వాటి వాడిగా వున్న ముల్లుతో పక్వానికి వచ్చిన పండు యొక్క మెత్తటి తొక్క పైన రంద్రం చేసి అందులో తొక్క లోపలిభాగంలో గుడ్లను పెడుతుంది. పొదగబడిన తర్వాత, పండ్ల గుజ్జును లార్వాలు ఆహారంగా తింటాయి మరియు సాధారణంగా పండును తినడానికి పనికి రాని వాటిగా చేసి పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు. ఇది ఒక పాలిఫాగస్ కీటకం. అంటే ఈ కీటకం చాలా రకాల మొక్కలపైన జీవించి వాటిని ఆహారంగా తింటుంది. తెగులు సోకిన పండ్ల మీద పెరిగే అవకాశవాద శిలీంద్రాల వ్యాప్తికి ఇది వాహకంగా కూడా పని చేయునట్లు ఆధారాలు వున్నాయి. ఇది చాలా విభిన్న వాతావరణాలలో మరియు విస్తృతమైన ఉష్ణోగ్రతల వద్ద వృద్ధి చెందుతున్న అత్యంత క్లిష్టమైన జాతి, 10 నుంచి 30°C మధ్య ఈ కీటకాలకు బాగా అనువైన వాతావరణం.


నివారణా చర్యలు

  • తోటల్లో ఈ పురుగును కనుక చూస్తే క్వారంటైన్ నిబంధనలను అనుసరించండి.
  • పురుగులను గుర్తించడానికి పురుగులను పసిగట్టే వలలు లేదా ఫెరొమోన్ వలలు ఏర్పాటు చేయండి.
  • గుర్తించిన తర్వాత సాధ్యమైనంత త్వరలో సంబంధిత అధికారికి ఈ విషయం తెలియచేయండి.
  • తెగులు సోకిన ప్రాంతం నుండి పండ్లను తరలించవద్దు.
  • ఎగుమతి చేసే పండ్లను కాగితంతో లేదా పాలీథీన్ కవర్లలో ప్యాక్ చేయండి.
  • తెగులు సోకిన పండ్లను డబల్ బ్యాగ్లలో ఉంచి సేకరించడానికి వీలుగా చెత్త బుట్టలో వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి