Anthonomus grandis
కీటకం
పెద్ద పురుగులు ముఖ్యంగా పూలు మరియు కాయలను ఎక్కువగా తింటూ అప్పుడపుడు ఆకులను కూడా తింటూ ఉంటాయి. పూమొగ్గల యొక్క ఒక ప్రక్క భాగాలలో చిన్న చిన్న గాట్లు ఉండి చిన్న కణితి లాంటి భాగాలను గమనించవచ్చు. ఈ పురుగులు పూమొగ్గలను ఆశించడం వలన రంగు కోల్పోయి త్వరగా రాలిపోతాయి. గాట్లు పెద్దవిగా ఉన్నపుడు వాటి ద్వారా మరిన్ని సూక్ష్మ జీవులు లోపలికి వెళ్లి కాయ కుళ్ళిపోయే ఆస్కారం ఉన్నది. పెద్ద పురుగులు ఆకుల కాడలను తినడం వలన ఆకులు వళ్ళిపోయి కొమ్మను అంటిపెట్టుకుని ఉండడం వలన అవి చూడడానికి నల్లటి జెండాల వలె కనిపిస్తూ ఉంటాయి.
కాటోలాకస్ గ్రాండిస్ అనే పరాన్న జీవిని ఈ పురుగులకు విరుద్ధంగా ఉపోయోగించవచ్చు. ఇదే విధంగా బివేరియా బాసియానా అనే శీలింద్రాన్ని, బాసిల్లస్ తురింగెన్సిస్ అనే బాక్టీరియాను లేదా చైలో ఇరిడేసేంట్ (CIV) అనే వైరస్ ను జీవ నియంత్రకాలుగా ఉపయోగించవచ్చు.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సింధటిక్ పెరిత్రాయిడ్లు మరియు డెల్టామేత్రిన్, ఫిప్రోనిల్ వంటి కీటక నాశినులను వాడవచ్చు. తేమ అధికంగా వున్నప్పుడు ఈ పురుగుల మందుల పనితీరు మరింత మెరుగవుతుంది. ఫెరొమోన్ ట్రాప్స్ ను కూడా ఈ పురుగులను గమనించడానికి మరియు నివారణకు ( కీటక నాశినులు మరియు జీవ ఏజెంట్లతో కలిపి) ఉపయోగించవచ్చు.
అంతోనోమస్ గ్రాండిస్ అనే మొక్కపురుగు వలన ఈ నష్టం సంభవిస్తుంది. పెంకుపురుగులు 6 మిల్లీమీటర్ల పోడవైన ముక్కు కలిగి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఎక్కువ నీరు నిలువ వున్న ప్రదేశాలలో మరియు ప్రత్తి పొలాలకు దగ్గరలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. తరువాత అక్కడినుండి ఇవి శీతాకాలంలో ప్రత్తి పొలాలను ముఖ్యంగా కాయ ఏర్పడే దశలో ఆశిస్తాయి. పెరుగుతున్నటువంటి ప్రత్తి కాయలపై ఆడపురుగు గుడ్లను పెడతాయి. తెల్లని కాళ్లులేని ‘C’ ఆకారంలో ఉండే లార్వా పింజలోపల 10 రోజులు తిని అక్కడే కోశస్దదశలోనికి వెళ్ళిపోతుంది. వేసవిలో ఈ పురుగు యొక్క జీవితకాలం 3 వారాలు మరియు సంవత్సరానికి 8-10 తరాలను ఉత్పత్తి చేయగలవు.