Euschistus spp.
కీటకం
కంపు నల్లి మొక్కజొన్న పై విత్తే దశలో లేదా ఏపుగా పెరిగే దశ మొదట్లో దాడి చేస్తుంది. ఈ పురుగులు తినడం వలన కాండానికి జరిగే నష్టాన్ని పూరించడానికి మొలకలు అధికంగా పిలకలు వేస్తాయి. ఈ పురుగులు ఆకులను తినడం వలన వరస క్రమంలో రంద్రాలు ఏర్పడతాయి. రంధ్రాల సైజులో చాలా తేడాలు వుంటాయి కానీ వాటి చుట్టూ పసుపు రంగు వృత్తాలు వుంటాయి. కాండంలో ఈ పురుగు తిన్న చోట ఒక సన్నని, క్షీణించే ప్రాంతం కనిపిస్తుంది. ఈ తెగులు అధికంగా సోకితే మొక్కల ఆకారం మారిపోయి ఎదుగుదల తగ్గిపోతుంది. పొత్తులు కూడా రూపు మారిపోతాయి. పొత్తులు ఆలస్యంగా పక్వానికి వచ్చి చాలా తక్కువ మొత్తంలో గింజలు ఏర్పడతాయి. ఇవి బాగా ఎగిరి, పంటల మధ్య వెంటనే వ్యాపించగలవు, తద్వారా దిగుబడిని తగ్గిస్తాయి. పెద్ద పురుగులు కాయలు మరియు విత్తనాలపై వ్యాపిస్తాయి కానీ ఎటువంటి తిన్న నష్టాలు మనకు కనిపించవు. కోత సమయంలో రూపు మారిన, ఎదుగుదల లేని లేత విత్తనాలు కనిపిస్తాయి. ఈ పురుగులు మొక్కల వేరే భాగాలపై కూడా దాడిచేస్తాయి. చిన్న నల్ల మచ్చలు కాండాల పైన కనపడతాయి. దీని వలన కంకులు కూడా రూపు మారిపోతాయి. ఆలస్యంగా పక్వానికి రావడం మరియయు గింజలు పూర్తిగా నిండకపోవడం జరుగుతుంది. పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది.
ఈ పురుగుల జనాభా తగ్గించటానికి ఈ పురుగులను ఆశించే టాచినిడ్ ఈగలను లేదా కందిరీగల్ని ప్రోత్సహించాలి. ఇవి ఈ పురుగులపై గుడ్లు పెడతాయి. తరువాత వీటి లార్వా పొడగబడుతున్న గుడ్లను తింటాయి. సాలెపురుగులు మరియు పక్షులు వీటి సంఖ్యను తగ్గించటంలో తోడ్పడతాయి. యూకలిప్టస్ యూరోగ్రాండిస్ నూనెను వాడవచ్చు. ఇది పురుగులకు మరియు చిన్న పురుగులకు విషతుల్యంగా ఉంటుంది.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెరిథ్రాయిడ్స్ తో విత్తన శుద్ధి చేయడం వలన మొలకలను నష్టం వాటిల్లకుండా ఉంటుంది. బైఫెత్రిన్ వంటి పురుగుల మందులను ఆకులపై పిచికారీ చేయడం కూడా ఈ పురుగుల జనాభా తగ్గించటానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జాతులను బట్టి ఈ పురుగులు వేరు వేరు ఆకృతులలో ఉంటాయి. పెద్ద పురుగులు కవచ రూపం లో గోధుమ రంగు మచ్చలు కలిగివుండి తోలువంటి రెక్కలు మరియు త్రికోణపు నమూనాలు వెనక ప్రక్కన కలిగి ఉంటాయి. ఇవి ఆకులపై గుంపులుగా గొట్టపు ఆకారంలో గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు సహజంగా గుండ్రంగా మరియు నలుపు రంగులో రెక్కలు లేకుండా ఉంటాయి. పెద్ద పురుగులు మరియు నింఫ్స్ మొక్కలను పీల్చి తినడం వలన నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి జనాభా ఉన్నపుడు ఇది తినటం వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోయి రూపు మారి ఉంటాయి. పండ్లు మరియు విత్తనాలపై ఈ పురుగులు మచ్చలను మరియు లోపాలను కలగచేయడం వలన పంట నాణ్యత తగ్గిపోతుంది. ఈ పురుగులు సోయాబీన్ , కూరగాయలు మరియు అల్ఫాల్ఫా వంటి చాలా రకాల అతిథేయ మొక్కలను ఆశిస్తాయి.