ప్రత్తి

గోధుమరంగు కంపు నల్లి

Euschistus servus

కీటకం

క్లుప్తంగా

  • దూది పింజలు రంగు మారి పైభాగం గరుకుగా తయారౌతుంది.
  • విత్తనాలు కుచించుకు పోయి లేత దూది పింజలు రాలిపోతాయి.
  • పింజ లోపలి భాగంలో పులిపిరులు లాంటి బొడిపెలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

గోధుమ కంపు నల్లి మొగ్గ మరియు ప్రత్తి గింజలను తింటుంది. ఇవి సాధారణంగా ముదురు దూది పింజలను ఆశించినప్పుడు ఈ పింజలు రంగు కోల్పోతాయి. నల్లి ఆశించిన పింజలోని విత్తనాలు గరుకుగా మారి ఈ దూది పింజలు విచ్చుకోవు. లేత పింజలు దెబ్బ తింటే ఇవి రాలిపోతాయి. ఈ పింజల బైట వున్న గాయాలు లోపల చిన్న చిన్న బొడిపెలు లాగ వుండే కణుతుల పెరుగుదలతో ముడిపడి ఉంటాయి. ఈ నల్లులు విత్తనాలను తినడం వలన ప్రత్తి నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది. దూది పింజను కుళ్లిపోయేటట్టు చేసే ఇతర జీవుల పెరుగుదలకు ఇవి సహకరిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పరాన్న జీవులైన టాకినిడ్ దోమలు గోధుమ కంపు నల్లి గుడ్ల లోపల గుడ్లను పెట్టి బయటకు వచ్చే పిల్ల పురుగులను తినివేస్తాయి. పక్షులు మరియు సాలీడులు కూడా పురుగులను తింటాయి. నల్లులకు మరియు వాటి యొక్క కోశస్ధ దశలో ఉండే పురుగులపై యూకలిప్టస్ యురోగ్రండిస్ నూనె విషపూరితగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెరిత్రాయిడ్ వర్గానికి చెందిన కీటక నాశినులతో విత్తన శుద్ధి చేసినట్లైతే నారు మొక్కలకు ఈ తెగులు వలన నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు. డైక్రోటోఫోస్ మరియు బైఫెంత్రిన్ వంటి కీటక నాశినులను పిచికారీ చేయడం వలన వీటి జనాభాను నియంత్రించవచ్చును.

దీనికి కారణమేమిటి?

పెద్ద పురుగులు కంచెలలో, చనిపోయిన కలుపు మొక్కల కింద , చెట్ల బెరడు లోపల , మట్టిలో, రాళ్ళ కింద జీవిస్తాయి. వసంత ఋతువు మొదట్లో ఉండే వెచ్చని రోజులలో ఉష్ణోగ్రతలు 21 ° C కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఈ పురుగులు క్రియాశీలం అవుతాయి. మొదటి తరం నల్లులు అడవి జాతి అతిధి మొక్కలపై మరియు రెండో తరం నల్లులు పంటలపై అభివృద్ధి చెందుతాయి. ఆడ నల్లులు వంద రోజుల వ్యవధిలో సుమారుగా 60 గుడ్లను 18 సముదాయాలుగా పెడతాయి. పెద్ద పురుగులు ఎగరగలవు. ఇవి అతిధి మొక్కలు మరియు కలుపు మొక్కల మధ్య తిరుగుతూ ఉంటాయి.


నివారణా చర్యలు

  • తీవ్రమైన నల్లి జనాభాను తగ్గించడానికి పంట ముందుగా వేయాలి.
  • పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ కలుపు మొక్కలను తొలగించాలి.
  • పంట కోత తర్వాత పంట అవశేషాలను తొలగించాలి.
  • పొలానికి పొలానికి మధ్యన అవరోధాలను ఏర్పర్చడం వలన ఈ తెగులు వ్యాపించకుండా నివారించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి