ఇతరములు

నల్ల లద్ధి పురుగు

Agrotis ipsilon

కీటకం

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న అపసవ్యమైన రంధ్రాలు.
  • కొమ్మలు కింది భాగంలో కత్తిరింపబడతాయి.
  • మొక్కల ఎదుగుదల మందగించవచ్చు లేదా చనిపోవచ్చు.
  • మొక్కలు వాడిపోయి ఒక ప్రక్కకు ఒరిగిపోతాయి.

లో కూడా చూడవచ్చు

35 పంటలు
ఆపిల్
అరటి
బార్లీ
చిక్కుడు
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

ఈ పురుగులు అనేక రకాల పంటలపై దాడి చేస్తాయి కానీ లేత మొలకలను ఎంచుకుంటాయి. మొలకల ఎదుగుదల సమయంలో గొంగళి పురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన పంటకు అధిక నష్టాన్ని కలుగచేస్తుంది. చిన్న గొంగళి పురుగులు కలుపు మొక్కలపై లేదా, ఒక వేళ ఉంటే, మొక్కజొన్న మొక్కలపై ఉంటాయి. ఇవి ఆకులపై చిన్న రంధ్రాలు చేస్తాయి. పెద్ద గొంగళి పురుగులు ఉదయం వేళలో మట్టిలోనే వుండి, రాత్రి సమయాలలో బైటకి వచ్చి ఆకులను తింటాయి. చిన్న మొక్కలను మట్టి లోపలకు లాక్కుకుని వెళ్లిపోవచ్చు. మొక్కల మొదలు వద్ద కాండం కత్తిరించబడుతాయి. దీనివలన ఎదిగే మొక్కల కణజాలం దెబ్బతిని మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ పురుగులకు పరాన్న కందిరీగలు, ఈగలు మరియు గొల్లభామలు వంటి అనేక రకాల సహజ శత్రువులు ఉంటాయి. బాసిల్లస్ తురింగింసిస్, న్యూక్లియో పోలీహైడ్రోసిస్ వైరస్ వైరస్ మరియు బియువేరియా బస్సినా వంటి జీవ క్రిమినాశనులు ఈ పురుగులపై మంచి ప్రభావం చూపిస్తాయి. పొలంలో పురుగుల మందులు వాడకముందు ఈ పురుగులను సహజంగా వేటాడే వాటిని ప్రోత్సహించాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లొర్ఫైరిఫాస్, బీటా - సైప్ర్మేట్రిన్, డెల్టా మేట్రిన్, లాంబ్డా సైహలోత్రిన్ లను ఈ తెగులును నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. విత్తనాలను వేయకముందే ఈ మందులను వాడవచ్చు కానీ తెగులు అధికంగా వున్నప్పుడు బాగా పనిచేస్తుంది.

దీనికి కారణమేమిటి?

నల్ల లద్ధి పురుగులు బూడిద-గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటుంది. లేత మరియు ముదురు గోధుమ రంగు రెక్కలు కలిగి ఉంటాయి వాటి అంచుల్లో మచ్చలు ఉంటాయి. వెనక తెలుపు రంగు రెక్కలు ఉంటాయి. ఉదయం సమయాలలో ఇవి మట్టిలో దాగి ఉంటాయి. రాత్రి సమయాలలో బైటకు వచ్చి తినడం మొదలు పెడతాయి. ఆడ పురుగులు మగ పురుగుల వలే ఉంటాయి కానీ కొంచం ముదురు రంగులో ఉంటాయి. ఇవి ముత్యాల్లాంటి తెల్లటి గుడ్లను ఒకొక్కటిగా లేదా గుంపులుగా మొక్కలపై లేదా భూమి పగ్గుళ్ల లోనో పెడతాయి. లార్వా పొదగడానికి సరైన ఉష్ణోగ్రతలు ముఖ్య కారణం. లార్వా పొదగడానికి సహజంగా 3 నుండి 24 రోజుల మధ్య పడుతుంది (30°C మరియు 12°C మధ్యలో). చిన్న లార్వాలు లేత బూడిద రంగులో, మృదువుగా కనిపిస్తాయి మరియు 5 నుండి 10 మిల్లీమీటర్లు పొడవు కలిగి ఉంటాయి. పెద్ద లార్వా ముదురు గోధుమ రంగులో, దాదాపుగా 40 మిల్లీమీటర్లు పొడవుతో ఉంటాయి, వీటి పైన రెండు పసుపు రంగు మచ్చల రేఖలు ఉంటాయి. ఇవి రాత్రి మరియు పగటి వేళల్లో తింటూ ఉంటాయి. ఇవి మట్టిలో ఉన్న చిన్న రంద్రాలలో C ఆకారంలో ముడుచుకొని ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులు తీవ్రతను తగ్గించడానికి పంటను ముందుగానే వేయండి.
  • ముందు సోయాబీన్ నాటిన పొలాల్లో మొక్కజొన్న నాటకుండా చూసుకోండి.
  • నాటడానికంటే 3 నుండి 6 వారాల ముందు పొలాన్ని దున్ని లార్వాను పాతిపెట్టడం కానీ అవి పక్షులకు బహిర్గతం అయ్యేటట్టు కానీ చేయండి.
  • పొలం చుట్టూ పొద్దుతిరుగుడు మొక్కలను నాటండి.
  • ఇవి నల్ల లద్ధి పురుగుల్ని ఆకర్షిస్తాయి.
  • నాటడానికి ముందు మరియు ఎదుగుదల సమయంలో పొలంలో కలుపు మొక్కలను తొలగించండి.
  • దీపపు వలలు లేదా ఫెరొమోన్స్ వలలు పురుగుల్ని పట్టుకోడానికి ఉపయోగించండి.
  • తరుచుగా పొలాన్ని దున్ని ఈ పురుగులను పక్షులకు బహిర్గతం చేయాలి.
  • పంట కొత్త తర్వాత అవశేషాలను భూమిలో లోపల వరకు పాతి పెట్టాలి.
  • విత్తనాలను నాటటానికి ముందు భూమిని కొన్ని వారాల పాటు బీడుగా ఉంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి