Pentatomidae
కీటకం
ఈ పురుగుల వలన కలిగిన తెగులును పంట కోతకు ముందు కనిపెట్టడం చాల కష్టం. పెద్ద పురుగులు సోయాబీన్ కాయలు మరియు విత్తనాలపై వ్యాపిస్తాయి కానీ ఎటువంటి నష్టాలు మనకు బైటకు కనిపించవు. కోత సమయంలో రూపు మారిన, ఎదుగుదల లేని లేత విత్తనాలు కనిపిస్తాయి. ఈ పురుగులు మొక్కల వేరే భాగాలపై కూడా దాడిచేస్తాయి. చిన్నచిన్న గోధుమరంగు లేదా నల్లని మచ్చలు కణజాలాల పైన చూడవచ్చు. దీని వలన పండ్లు మరియు విత్తనాల పరిపక్వత పూర్తి కాదు మరియు మొక్కలు చాల తక్కువ మరియు చిన్న కాయలు కలిగి ఉంటాయి.
ఈ పురుగుల జనాభా తగ్గించటానికి వేటాడే ఈగలను లేదా కందిరీగల్ని ప్రోత్సహించాలి. ఇవి ఈ పురుగులపై గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు ముదురు రంగులో ఉంటాయి. వీటి లార్వా పెరుగుతున్న పురుగులు మరియు పెద్ద పురుగులపై లోపలనుండి దాడి చేస్తాయి. సాలెపురుగులు మరియు పక్షులు ఈ పురుగుల సంఖ్యను తగ్గించడంలో తోడ్పడుతాయి. యూకలిప్టస్ యూరోగ్రాండిస్ నూనె ను వాడవచ్చు. ఇది పురుగులపై విషం లాగా పని చేస్తుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడే ముందు పొలంలో వున్న అని జాతుల కీటకాలను పరిశీలించండి. అవసరమనుకుంటే పైరిత్రోయిడ్ కలిగిన పురుగుల మందులు వాడవచ్చు.
అనేక రకాల నల్లి జాతి పురుగులు సోయాబీన్ మొక్కలపై దాడి చేస్తాయి. వీటిల్లో అక్రోస్టర్నుమ్ హిలరే అనేది అన్నింటికంటే ప్రమాదకరం. ఈ పురుగులు 1.3 సెంటీమీటర్ పొడవు ఉండి, ఆకుపచ్చ రంగులో ఒక కవచం మాదిరిగా ఉంటాయి. వీటి నుండి వచ్చే దుర్వాసన వలన వీటిని స్టింక్ బగ్స్ అని అంటారు వీటి నోటితో ఇవి కాయల్లో రంధ్రాలు చేసి వాటిలో పోషకాల్ని లాగేస్తాయి. వీటి గుడ్లు గొట్టాల ఆకారంలో ఉంటాయి. ఈ పురుగులు గుంపుగా గుడ్లను పెడతాయి.