మినుములు మరియు పెసలు

సోయాబీన్ లూపర్

Chrysodeixis includens

కీటకం

క్లుప్తంగా

  • చిన్న లార్వా ఆకులకు నష్టం చేకూరుస్తుంది.
  • అందువలన (విండో పేన్స్) ఏర్పడతాయి.
  • పెద్ద లార్వా ఆకు మొత్తం తినేస్తాయి.
  • అందువలన కన్నాలు ఏర్పడి ఆకు చిరిగిపోయిన అంచులు ఏర్పడతాయి.


మినుములు మరియు పెసలు

లక్షణాలు

గొంగళి పురుగులు మొక్కల భాగాలని తినటం వలన అధికంగా నష్టం కలుగుతుంది. పిల్ల లార్వా మొదట ఆకు కింది భాగాలని తిని పైభాగాలను వదిలేస్తాయి. దీని వలన ఒక విండో లాంటి నమూనా (ఫీడింగ్ విండో) ఆకులపై ఏర్పడుతుంది. పెద్ద లార్వా అంచులతో మొదలుపెట్టి ఒక్క ప్రధాన ఈనెను మాత్రం వదిలిపెట్టి ఆకును మొత్తంగా తినేస్తాయి. దేనికి వలన ఓక సక్రమంగా లేని రంద్రాలు చిరిగిపోయిన అంచులు ఏర్పడతాయి. ఇవి అరుదుగా పూలు లేదా కాయలను తింటాయి. కానీ ఆకులన్నీ రాలిపోతే ఇవి సోయాబీన్ కాయలను తినడం మొదలుపెడతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పరాన్నజీవి కందిరీగలు వీటికి సహజ శత్రువులు. ఇవి సోయాబీన్ లూపర్ లార్వా ను తింటాయి. లూపర్ లార్వాను తినే కీటకాలు: కాపీడోసోమా ట్రూన్కటెల్లుమ్ కాటెల్లుమ్, కాంపోలిటిస్ సోనోరెన్సిస్, కేసినారియా ప్ల్యూసీఏ, మెసోఖోరుస్ డిసిటెర్గ్గస్ మరియు మైక్రోచారోప్స్ బీమాక్యులట, కోటెసియా గ్రేనాడెన్సిస్ మరియు పరాన్నజీవి ఈగలు ఒరియా రురలిస్, పాటల్లోఆ సిమిలీస్, ఇంకా యూఫోరోసెరా మరియు లెస్పీసియా జాతుల ఉత్పత్తులు. బాక్యూలోవైరసస్ లేదా బాసిల్లస్ తురంగియన్సీస్ ఆధారిత ఉత్పత్తులు వాడాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సోయాబీన్ లూపర్ వాటంతట అవి పంటకు నష్టం కలిగించవు. ఏ విధమైన మందులు వాడాలి అని ఒక నిర్ణయం తీసుకునే ముందు. ఆకురాలిపోయేటట్టు చేసే ఇతర తెగుళ్లను కూడా గమనించండి. పుష్పించే దశకు ముందే నలభై శాతం కన్నా ఎక్కువగా ఆకులు రాలిపోయినా, పుష్పిస్తునప్పుడు గింజ తొడుగుతునప్పుడు 20 శాతం ఆకులు రాలిపోయినా లేదా గింజ తొడిగినప్పటినుండి పంట కొత్త సమయంలోపు 35 శాతం ఆకులు రాలిపోయినా అప్పుడు పురుగులమందులు వాడాలి. మేథోక్సీఫెనోజైడ్ లేదా స్పీనేటోరం వంటి కీటక నాశనులను వాడవచ్చు. తెగులును నిరోధకత పెంచుకున్న ఫైరిథ్రాయిడ్స్ వంటి కీటకనాశనులను ఉపయోగించవద్దు.

దీనికి కారణమేమిటి?

సోయాబీన్ లూపర్ సూడోప్లుసియా ఇంక్లూడెన్స్ యొక్క లార్వా వలన ఈ నష్టం కలుగ్గుతుంది.పెద్ద పురుగులు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ముందు రెక్కలు గోధుమ రంగులో ఉండి రాగి నుండి బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయి. వీటి మధ్యలో రెండు వెండి రంగులో మచ్చలు కనిపిస్తాయి. ఆడ పురుగు మొక్కల క్రిందిభాగంలో ఆకుల పక్క పార్శ్వాలపై గ్రుడ్లను పెడతాయి. వీటి లార్వా పచ్చ రంగులో ఉండి పక్కన మరియు వెనక భాగంలో తెల్లని చారలు ఉంటాయి. వీటికి మూడు జతల కాళ్ళు ఉంటాయి. ఇవి శరీరం అంతా వంకరటింకరగా ఉంటాయి( రెండు మధ్యలో ఒకటి చివర భాగంలో ఉంటాయి). దీనివలన అవి పాకుతునప్పుడు వాటి వెనక భాగాన్ని పైకి ఎత్తి పాకడానికి వీలవుతుంది. అందువలనే వాటికి లూపర్ అనే పేరు వచ్చింది. ఈ ప్యూపా ఆకుల క్రిందిభాగంలో వదులుగా గూడును అల్లుకుంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలను వాడండి.
  • పంటను ముందుగా వేయండి మరియు త్వరగా పక్వానికి వచ్చే రకాలను వాడండి.
  • ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని, ముఖ్యంగా మొక్కల క్రింది భాగంలో ఆకులను, క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • లార్వాను తొలగించి నాశనం చేయండి లేదా తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • సీజన్లో మొక్కలను ఆరోగ్యంగా ఉంచండి.
  • పంటకు మంచి చేసే కీటకాలను కాపాడడానికి కీటక నాశనులను సరిగా నియంత్రించుకుని వాడండి.
  • తెగులు లార్వాను తినే పక్షులకు గూళ్ళు మరియు స్తలాలను ఏర్పరచండి.
  • వీటిని పట్టుకోవడానికి ఉచ్చులు ఏర్పాటుచేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి