చిక్కుడు

కత్తెర పురుగు

Spodoptera frugiperda

కీటకం

క్లుప్తంగా

  • మొక్క అన్ని భాగాలపైనా ఇవి ఇవి తినడం కలిగిన నష్టం కనిపిస్తుంది.
  • ఆకు అంచులు చిరిగిపోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

25 పంటలు
అరటి
చిక్కుడు
క్యాబేజీ
కాలీఫ్లవర్
మరిన్ని

చిక్కుడు

లక్షణాలు

కత్తెర పురుగు యొక్క లార్వాలు మొక్కల అన్ని భాగాలను తిని నష్టం కలుగచేస్తాయి. చిన్న లార్వాలు ఒకవైపునుండే ఆకులను తింటాయి. ఆకు ఇంకొక ప్రక్కన చెక్కుచెదరకుండా ఉంటాయి(విండో ఫీడింగ్). మొక్కలు నాశనం అయ్యేవరకు ఇవి మొగ్గలు మరియు ఎదుగుతున్న వాటిని తింటాయి. పెద్ద లార్వాలు ఆకులు చిల్లులు పడినట్లు మరియు చిరిగిపోయినట్టు చేస్తాయి. ఇవి పునరుత్పత్తి భాగాలు మరియు ఇంకా పక్వానికి రాని పండ్ల పైన దాడి చేయవచ్చు. తెగులు తీవ్రంగా వున్నప్పుడు, కత్తెర పురుగు లార్వా ఆకులు విస్తృతంగా రాలిపోయేటట్టు చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కాటేషియా మార్గినివెంట్రిస్ మరియు చేలొనస్ టెక్సనుస్ మరియు C. రేముస్ లాంటి అనేక పరాన్నజీవి శత్రువులు ఫాల్ ఆర్మీవార్మ్ ను నియంత్రిస్తాయి. సాధారణంగా ఈగ జాతి పరాన్న జీవి అర్చిటస్ మార్మోరాటస్ ను ఉపయోగిస్తారు. గ్రౌండ్ బీటిల్, స్పైన్డ్ సోల్జర్ బగ్స్ , ఫ్లవర్ బగ్స్, పక్షులు లేదా ఎలుకలు వీటికి శత్రువులు. వేప సారం, బాసిల్లస్ తురింగియెన్సిస్ లేదా బక్యూలోవైరస్ స్పోడోప్టెరా మరియు స్పైనోసాడ్ వంటి జీవ సంబంధమైన పురుగులమందులు కూడా పిచికారీ చేయవచ్చు. మొక్కజొన్నలో ఎర్రని మట్టి, రాతి ఉప్పు బొగ్గు పొడి లేదా ఫ్లై యాష్ (వరసగా 100%, 98%, 90 మరియు 80% సామర్థ్యం కలిగి ఉంటాయి) ఈ లార్వా ఆహారం తీసుకోకుండా చనిపోయేటట్టు చేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎస్ఫేన్వలేరేట్, క్లొర్ఫెరిఫోస్, మలాథియాన్ మరియు లాంబా-సైహలోత్రిన్ ఈ తెగులును నియంత్రించడానికి సిఫార్సు చేయబడినది. ఈ పురుగులమందులు వుపయోగించి విషపుఎరతో ఎదిగిన లార్వాను నియంత్రించడానికి రైతులకు సలహా ఇవ్వబడుతుంది.

దీనికి కారణమేమిటి?

ఆకుల అడుగుభాగంలో 100 నుండి 300 క్లస్టర్లలో ఇవి గుడ్లు పెడతాయి. సాధారణంగా ఈ గుడ్లు పొలుసులతో కప్పబడి ఉంటాయి. లార్వా రాగి రంగు లేదా పచ్చని రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. పక్కభాగంలో చారలు ఉండి ఒక పసుపురంగు చార వెనక వరకు ఉంటుంది. ఈ లార్వా లేత మరియు ముదురురంగు మచ్చలతో తెల్లని పారదర్శకమైన వెనుక రెక్కలు మరియు గోధుమరంగు ముదురు రెక్కలను కలిగి వుంటాయి. ప్రతి ముదురు రెక్కకు చివరి భాగంలో తెల్లటి మచ్చ వుంటుంది. ఆహారం మరియు ఉష్ణోగ్రత వీటి వివిధ జీవిత చక్ర దశల యొక్క వ్యవధిని నిర్ణయిస్తాయి. చల్లని, వసంతఋతువు ఆ తర్వాత వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులును బాగా తట్టుకునే సామర్థ్యం గల మొక్కలను నాటండి.
  • ఈ పురుగుల ఉనికిని గుర్తించి వాటిని గుంపుగా పట్టుకోవడానికి దీపం లేదా లింగాకర్షక బుట్టలను వాడండి.
  • వీటి జనాభా అధికంగా పెరగకుండా ఉండడానికి సీజన్ కంటే ముందే మొక్కలను నాటండి.
  • కలుపు మొక్కలను నియంత్రించండి.
  • నష్టాన్ని తగ్గించడానికి పంటను త్వరగా కోయండి.
  • లార్వాను మరియు ప్యూపాలను అధిక ఉష్ణోగ్రతలకు బహిర్గతం చేసే విధంగా భూమిని దున్నండి.
  • తెగులు అధికంగా వున్నప్పుడు కత్తెర పురుగు లార్వా అధికంగా ఆకులు రాలిపోయేటట్టు చేస్తాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి