టమాటో

టుటా అబ్సోల్యూట

Tuta Absoluta

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ లార్వా ఒక పద్దతిగా లేని బూడిద నుండి తెలుపు రంగు ఆకు చారలను ఏర్పరుస్తాయి.
  • ఈ చారలు తరువాత పసుపు రంగులోకి మారుతాయి.
  • పండ్లపై పెద్ద గుంతలు తయారవుతాయి.
  • ఇలా తెరిచి వున్న రంద్రాల ద్వారా ఇతర కీటకాలు చేరి పండ్లు కుళ్లిపోయేటట్టు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు


టమాటో

లక్షణాలు

ఈ తెగులు పంట ఏ దశలో అయినా మరియు మొక్కల ఏ భాగానైనా ఆశించవచ్చు. సహజంగా ఈ లార్వా మొగ్గలను. లేత మెత్తని చిగుర్లను మరియు పువ్వులను ఆయిస్తాయి. వీటి లార్వా సక్రమంగా లేని బూడిద నుండి తెలుపు రంగు ఆకు మచ్చలను ఏర్పరుస్తాయి. ఇవి తరువాత పసుపు రంగులోకి మారతాయి. పండ్లపై పెద్ద గుంతలు తయారవుతాయి. ఇలా తెరిచి వున్న రంద్రాల ద్వారా ఇతర కీటకాలు చేరి పండ్లు కుళ్లిపోయేటట్టు చేస్తాయి. పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చాలా రకాల పురుగులు ఈ కీటకాన్ని ఆహారంగా తింటాయి: ట్రైకొగ్రామ్మా ప్రెటీయోసమ్ కందిరీగలు మరియు నేసిడియోకోరిస్ తేనియస్ నల్లులు మరియు మేతర్హిజియం అనిసోప్లియా మరియు బెయువేరియా బస్సియానా ఈ కీటకాల గుడ్లు, లార్వా మరియు పెద్ద కీటకాలపై దాడి చేస్తాయి. వేప విత్తనాల ద్రావణం లేదా బసిల్లస్ తురింజియన్సిస్ లేదా స్పైనోసాడ్ కూడా ఈ కీటకాలపై సమర్ధవంతంగా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ లార్వా మొక్కల లోపల దాక్కొని ఉండడం వలన ఈ కీటకాలు బాగా అధిక మొత్తంలో పునరుత్పత్తి చేయడం వలన మరియు చాలా రకాల పురుగుల మందులకు నిరోధకత కలిగి ఉండడం వలన ఈ తెగులుపైన ఎటువంటి పురుగుల మందులు పనిచేయవు. అందువలన ఇండొక్సాకార్బ్, అబామెక్టిన్, వేప గింజల ద్రావణం, ఫెనోక్సికార్బి + లుఫెన్యూరాన్ లను ఒకదాని తర్వాత ఇంకొకటి మార్చి ఉపయోగించాలి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు టమాటో మొక్కలకు చాలా ప్రమాదకరమైనది. ఈ లార్వా ఒక సంవత్సరం కాలంలో 12 తరాల వరకు పునరుత్పత్తి చేయగలవు. ఆడ కీటకాలు దాదాపు 300 గుడ్లు ఆకుల క్రింది పక్కన భాగంలో పెడతాయి. ఇవి 26-30ºC మరియు 60-75% తేమ వాతావరణంలో పొదగబడతాయి. ఈ లార్వా పాలిపోయిన ఆకుపచ్చ రంగులో వుంది వాటి తల వెనుక నల్లని పట్టీ కలిగి ఉంటాయి. సరైన సహకరించే వాతావరణం ఉంటే వీటి ఎదుగుదల 20 రోజుల్లో పూర్తవుతుంది.పెద్ద కీటకాలు వెండి లాంటి గోధుమ రంగు, 5-7 మిల్లీమీటర్ల పొడవు ఉండి ఆకుల మధ్యన దాక్కుంటాయి. ఇవి గుడ్ల రూపంలో, లార్వగా లేదా పెద్ద కీటకాలుగా చాలా కాలం జీవించి వుండగలవు.


నివారణా చర్యలు

  • తెగులు సోకని నాట్లను వాడాలి.
  • అతుకుల వలలు లేదా ఫెరొమోన్ వలల్ని వుపయోగించి పెద్ద కీటకాలను పట్టుకోవాలి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలి.
  • ముందు నాటిన మొక్కలు నుండి ఈ తెగులు సోకకుండా కనీసం ఒక 6 వారాలు ఆగి తరువాత మరల నాటాలి.
  • పంట మార్పిడి పద్దతులను పాటించాలి.
  • పొలాన్ని దున్ని సూర్య కిరణాలు మట్టికి తగిలేటట్టు వదిలేయాలి లేదా ప్లాస్టిక్ కవర్ ను వుపయోగించి మట్టిని కప్పాలి.
  • పంట కోతలు పూర్తయిన తరువాత ఈ తెగులు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి