Sesamia inferens
కీటకం
ముఖ్యంగా గొంగళి పురుగులుపంటను తినడం వలన పంటకు నష్టం జరుగుతుంది. ఇవి కాండాలకు లేదా మొలకల కుదుళ్లవద్ద అంతర్గత పదార్దాన్ని తిని మొక్కకు పోషకాలు అందకుండా మొక్కలో పల నీటి రవాణా జరగకుండా చేస్తాయి. కాండములపై మరియు కంకుల మొదళ్ళలో గొంగళి పురుగు బయటకు వచ్చే రంద్రాలను కూడా చూడవచ్చు. ఈ తెగులు సోకిన మొక్క నీరు మరియు పోషకాలు అందక వాడిపోతుంది. కాండాన్ని అడ్డంగా కత్తిరించినప్పుడు కాండంలోపల లార్వాలను మరియువాటి మలపదార్ధాలను 'డెడ్ హార్ట్స్' గమనించవచ్చు.
టెలీనొమస్ మరియు ట్రైకోగ్రమ్మ గ్రూపుకు చెందిన అనేక పరాన్న కందిరీగలు సెసామియా ఇన్ఫెరెన్స్ గుడ్లులో తమ గుడ్లను పెట్టి వాటిని నాశనం చేసి వాటి జనాభాను నియంత్రించడానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకు, పరాన్నజీవి గుడ్లు ట్రైకోగ్రమ్మ చిలోనిస్ (హెక్టారుకు 8 కార్డులు), 12 నుంచి 22 రోజులలో పొదగబడుతాయి. కందిరీగలు అపాంటెలెస్ ఫ్లావిపెస్, బ్రాకోన్ చినెన్సిస్ మరియు స్టూర్మియాప్సిస్ ఇన్ఫరెన్సులచే కూడా లార్వాలు పరాన్నజీవిగా మారతాయి. చివరగా, ప్యూపాల మీద క్షంతోన్ పిప్లా మరియు టెట్రాస్టిచస్ యొక్క జాతులు దాడి చేస్తాయి. ఫంగస్ బెయువెరియా బస్సియానా మరియు బ్యాక్టీరియా బాసిల్లస్ తూరంగియన్సీస్ ఆధారిత బయో-క్రిమిసంహారకాలు పర్పుల్ స్టెమ్ బోరర్ కూడా వ్యతిరేకంగా బాగా పనిచేస్తాయి.
అందుబాటులో వుంటే, ఎల్లప్పుడూ జీవ చికిత్సలతో పాటు నివారణా చర్యలు గల ఒక వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గుళికలు లేదా పిచికారీ రూపంలో క్రిమిసంహారకాలతో కూడిన రోగనిరోధక చికిత్స (ఉదాహరణకు, క్లోరంట్రినిలిప్రోల్ )తో ఈ కీటకాల జనాభాను నియంత్రించడానికి ఆకులపై పిచికారీ చేయవచ్చు.
ఊదారంగు కాండం తొలుచు, సెసామియా ఇంఫెర్న్స్ వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. లార్వాలు ప్యూపాగా చలికాలం అంతా కాండంలోపల లేదా పొలంలోని మొక్కల వ్యర్థాలలో ఉంటాయి. పెద్ద పురుగులు వసంత ఋతువులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు బయటకు వస్తాయి. కీటకాలూ చిన్నగా వుండి లావుగా మరియు లేత గోధుమ రంగులో తలపై వెంట్రుకలతో వుంటాయి. ముందర రెక్కలు బంగారు రంగు మార్జిన్ కలిగిన గడ్డి రంగులో వుంటుంది. వెనుక రెక్కలు పారదర్శకమైన తెలుపుతో పసుపుపచ్చ సిరలతో ఉంటాయి. శతృవుల కంట పడకుండా ఉండడానికి ఆడ పురుగులు ఆకు తొడిమ వెనుక భాగంలో గుండ్రటి అతుకులతో, పాలిపోయిన మరియు పసుపుపచ్చ నుండి ఆకుపచ్చ గుడ్లను అనేక వరుసలుగా పెడుతాయి. గొంగళి పురుగులు 20 నుంచి 25 మిల్లీమీటర్ల పొడవుతో గులాబీరంగులో ఉండి ఎరుపు-గోధుమ తలలతో చారలు మరియు వెంట్రుకలు లేకుండా ఉంటాయి.