ఇతరములు

ఓరియంటల్ ఆర్మీ వార్మ్

Mythimna separata

కీటకం

క్లుప్తంగా

  • మొలకలపైన పురుగులు తిన్న నష్టం కనిపిస్తుంది.
  • ఆకుల అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి.
  • వీటి మలం యొక్క తడి, గోధుమ చారలు ఇవి తిన్న ప్రాంతాలలో కనిపిస్తాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు

ఇతరములు

లక్షణాలు

ఈ గొంగళి పురుగులు మొలకలను లేదా ఆకులను తింటాయి. తరువాత దశలలో ఇవి లేత పొత్తులను కూడా తింటాయి. ముఖ్యంగా ఇవి ఆకు చివర భాగాలను మరియు అంచులను తింటాయి. దీనివలన ఆకుల అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి. వీటి మలం యొక్క తడి, గోధుమ చారలు ఇవి తిన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు మొత్తం రాలిపోతాయి. పొత్తులకు మామూలుగా పెద్దగా నష్టం కలగదు. ఇవి క్రింది భాగంలో వున్న ఆకులన్నీ తినేసిన తర్వాత మాత్రమే మొక్కల పైభాగానికి నష్టం కలగచేస్తాయి. ఒక పంటలో ఆకులు అన్ని రాల్చిన తర్వాత ఇవి పెద్ద గుంపులుగా ఇతర పొలాలకు తరలి వెళ్లిపోతాయి. గొంగళి పురుగులు లేత మొలకలను లేదా ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. తర్వాతి దశలలో అవి లేత కంకుల పై దాడి చేయొచ్చు. ఇతర బత్తిడి మొక్కలైన గడ్డి వంటి వాటివలన కూడా ఇవి వ్యాపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బ్రాకోనిడ్ కందిరీగలు అపన్టేలెస్ రుఫీక్రస్ మరియు టాచినీడ్ ఈగలు ఎక్సోరిస్టా సివిలిస్ కీటకాలు ఈ పురుగులు లార్వాను ఆశించి వీటి జనాభాను మరియు ఈ తెగులును విజయవంతంగా తగ్గిస్తాయి. స్పైనోసాడ్ ని రాపాలో వాడి ఈ పురుగులను చంపవచ్చు. బెయువేరియా బస్సియన ఫంగస్ సూక్ష్మ క్రిముల మరియు ఇసరియా ఫుమోసోరోసియా లను వాడి వీటి లార్వాలను చంపవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మాత్రమే పురుగులు మందులు ఉపయోగించాలి. సాయం సమయాలలో ఈ లార్వాల పైన సైపర్ మైథ్రిన్ ను ఉపయోగించవచ్చును. అంకురోత్పత్తి జరిగిన 25 - 30 రోజుల తర్వాత మొక్కల సూది ప్రాంతంలో (వొర్ల్ అప్లికేషన్) శీలింద్ర నాశీనుల గుళికలు వీటి జనాభాను నియంత్రించుటకు వాడవచ్చు. క్లోర్ఫైరిఫాస్ కలిగిన విషపు ఎరలను కూడా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

పెద్ద పురుగులు ఎర్రని గోధుమ రంగులో ఉండి నాలుగు నుండి ఐదు సెంటిమీటర్ల రెక్కలు కలిగి ఉంటాయి. ఇవి ఉదర భాగంలో బొచ్చు కలిగి ఉంటాయి. వీటి ముందు రెక్కలు బూడిద పసుపు రంగు లో ఉండి వీటిపైన నల్లని చుక్కలు ఉంటాయి. మధ్య భాగంలో ఇవి రెండు చిన్న చుక్కలను కలిగి ఉంటాయి. వీటి వెనక రెక్కలు నీలిబూడిద రంగులో ఉండి ముదురు ఈనెలను, ముదురు అంచులను కలిగి ఉంటాయి. ఇవి నిశాచారులు.ఇవి కాంతికి బాగా ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఆడ పురుగుల క్రీమ్ రంగు గుడ్లను ఆకుల క్రింది భాగంలో పెడతాయి. 15°C కన్నా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి బాగా విస్తరిస్తాయి. ఈ గొంగళి పురుగులు బలంగా ఉండి పాలిపోయిన పచ్చ నుండి గోధుమ రంగులో ఉంటాయి. వీటిపైన ముందు నుండి వెనక వరకు వరుసగా చారలు ఉంటాయి. ప్రక్కన వుండే చారల చివర్లు కత్తిరించినట్లు ఉండి చివరగా నల్లని మచ్చలు ఉంటాయి. రాత్రి సమయాలలో మరియు బాగా ఎరువులు అధికంగా వాడిన పొలాలలో ఇవి బాగా విస్తరిస్తాయి. బాగా అధిక సమయం పొడి వాతావరణం ఉండడం తరువాత వర్షాలు పడడం ఈ తెగులు విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ పురుగులు జనాభా అధికంగా వుండే సమయంలో పంట వేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • మొక్కలలో ఉన్న లార్వాలను చేతితో పీకేయండి.
  • వీటిని గుంపుగా పట్టుకోవడానికి లైట్ లేదా ఫెరోమోన్ వలలను ప్రయోగించవచ్చు.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కల చుట్టు గుంతలు తవ్వి ఈ పురుగుల కదలికను నియంత్రించండి.
  • నారుమడిలో నీరు అధికంగా పెట్టి వీటి లార్వాలు నీటిలో మునిగిపోయేటట్టు చేయండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి