అరటి

వేరు తొలుచు పురుగు

Cosmopolites sordidus

కీటకం

క్లుప్తంగా

  • ఈ పురుగులు తినటం వల్ల కలిగిన రంధ్రాలు లేదా మల పదార్ధం ముదురు ఆకుల తొడిమ కింది భాగంలో లేదా కాండాలపై కనిపిస్తాయి.
  • ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే ఫంగల్ క్షయం వలన కణజాలాలు కుళ్లిపోతాయి.
  • దీని వలన ఆకులు ఎండిపోయి త్వరగా చనిపోతాయి.
  • మొక్కల ఎదుగుదల తగ్గి ప్రతికూల వాతావరణంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది.
  • గెలల సంఖ్య మరియు పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

పాలిపోయిన ఆకుపచ్చ మచ్చలు, వాలిపోవడం మరియు రాలిపోయిన ఆకులు ఈ తెగులు మొదటి లక్షణాలు. ఈ తెగులు లక్షణాలు ముందుగా మొక్క కాండం క్రింది భాగాలు మరియు ముదురు ఆకుల పైపొరల్లో కనిపిస్తాయి. లార్వాలు కాండంలోకి, వేర్లలోకి కొన్ని సార్లు వాటి పొడవు మొత్తం మీద రంద్రాలు చేస్తాయి. తెగులు తీవ్రంగా సోకిన భాగాలు ఫంగస్ వలన కుళ్ళిపోయిన నల్లటి భాగాలని చూడవచ్చు. యితర అవకాశవాద ఫంగస్ తినడం వలన మొక్కలో నీరు మరియు ఇతర పోషకాలు రవాణా కాకుండా అడ్డుకుంటాయి. దీనివలన మొక్కలకు నీరు మరియు పోషకాలు సరిగా అందక ఎండిపోయి చనిపోతాయి. చిన్న మొక్కలు పెరగవు మరియు పెద్ద చెట్లలో కూడా ఎదుగుదల తగ్గిపోతుంది. వ్యాధి తీవ్రంగా వున్నప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. గెలల సంఖ్య మరియు పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

గతంలో చీమలు, పెంకు పురుగులు వంటి పరభక్ష ప్రాణులను నియంత్రణ కోసం వాడి మంచి ఫలితాలు సాధించారు. అధిక ఫలితాలు ఇచ్చిన వాటిల్లో ప్లెసిస్ జవానస్ మరియు డాక్టిలోస్టెర్నస్ హైడ్రోఫిలోయ్డ్స్ అనేవి వున్నాయి. విత్తనాలను నాటడానికి ముందు వేడి నీళ్లలో ముంచటం కూడా (43°C వద్ద 3 గంటలు లేదా 54°C వద్ద 20 నిముషాల పాటు) ప్రభావం చూపింది. సక్కర్స్ లను కొత్త పంటలో వెంటనే నాటాలి. సక్కర్స్ ను 20% వేప విత్తనాల ద్రావణంలో ముంచటం కూడా చిన్న మొక్కలలో ఈ తెగులు సోకకుండా కాపాడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులను మొక్కల మొదళ్ళ దగ్గర వేయడం వలన వేరు తొలుచు పురుగుల్ని నియంత్రించవచ్చు. ఆర్గానోఫాస్ఫాట్స్ మీద ఆధారపడిన కీటక నాశినులు ( క్లోరోఫాస్ , మలాథియాన్) అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి చాలా ఖరీదైనవి మరియు వాడే వారికి, పర్యావరణానికి విష పూరితం.

దీనికి కారణమేమిటి?

కాస్మోపాలిటెస్ సార్డిడస్ అనే కీటకం మరియు దీని లార్వాల వలన మొక్కలకు నష్టం కలుగుతుంది. పెద్ద కీటకాలు ముదురు గోధుమ నుండి బూడిద నలుపు రంగులు మెరుస్తున్నటువంటి తొడుగు కలిగి ఉంటాయి. ఇవి సహజంగా మొక్క కింది భాగంలో పంట అవశేషాలలో లేదా ఆకు తొడిమల్లో కనిపిస్తాయి. ఇవి ఏమి తినకుండా కూడా కొన్ని నెలల పాటు ఉండగలవు. ఆడ పురుగులు తెల్లటి, గుండ్రపు గుడ్లని నేలలోని పంట అవశేషాల్లోని రంధ్రాలలో పెట్టి ఆకు తొడుగుల్లో దాక్కుంటాయి. 12 డిగ్రీలు సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే గుడ్ల ఎదుగుదల ఆగిపోతుంది. లార్వాలు బయటకి వచ్చిన వెంటనే కాండాల వేర్లలో రంధ్రాలు చేసి మొక్కను బలహీనపరుస్తాయి. దీని వల్ల మొక్కలు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆవకాశవాదులు ఈ రంద్రాలను అవకాశంగా ఉపయోగించుకొని వేరు తొలుచు పురుగులు చేసిన గాయాల ద్వారా వ్యాపిస్తాయి . ముఖ్యంగా ఒక పంట నుండి ఇంకొక పంటకి సహజంగా తెగులు సోకిన పంట పదార్థాల వల్లనే వ్యాపిస్తాయి.


నివారణా చర్యలు

  • అరటి మొక్క పదార్థాలను ఒక చోటు నుండి ఇంకొక చోటుకు రవాణా చేయకూడదు.
  • విత్తనాలు ద్రువీకరించబడిన డీలర్ల వద్ద నుండి మాత్రమే కొనండి.
  • అందుబాటులో వుండే నిరోధక రకాలను నాటండి.
  • మొక్కలకు ఉపయోగకరం అయిన కీటకాలను మరియు చీమలను ప్రోత్సహించాలి.
  • ఆడ పురుగుల్ని ఆకర్షించటానికి కొన్ని కాడలు మరియు వేర్ల భాగాలను రెండు భాగాలుగా కత్తిరించి భూమిలో పాతి పెట్టాలి.
  • (ఈ కత్తిరించిన కాండాలపైన పెట్టిన గుడ్లు కొన్నాళ్లకు చనిపోతాయి).
  • ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే మొత్తం పంటను తవ్వి అన్ని మొక్కల అవశేషాల్ని తొలగించండి.
  • మళ్ళీ నాటడానికి రెండుసంవత్సరాల ముందు తీగ జాతి పంటలను వేయండి.
  • ఈతెగులు సోకిన పొలంలో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి