ఇతరములు

మచ్చల కాండం తొలుచు పురుగు

Chilo partellus

కీటకం

క్లుప్తంగా

  • చిన్న గొంగళిపురుగులు ఆకుల పైపొరకు రంద్రాలను చేసి ఆకులపై ఒక వరసలో లేని మచ్చలను రంధ్రాలను చేస్తాయి.
  • పెద్ద పురుగులు కాండాలపై దాడి చేసి వాటి అంతర్గత కణజాలాన్ని తింటాయి.
  • ఆకుల పైభాగం ఎండిపోతుంది.
  • పెద్ద పురుగులు కంకులలో కూడా రంధ్రాలు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

చిన్న గొంగళిపురుగులు ఆకులలొ రంద్రాలు చేసి ఆకులపై సక్రమంగా లేని మచ్చలను రంధ్రాలను చేస్తాయి. పెద్ద పురుగులు కాండాలపై దాడి చేసి వాటి అంతర్గత కణజాలాన్ని తింటాయి. ఆకుల పైభాగం ఎండి పోతుంది. పెద్ద పురుగులు కంకులలో కూడా రంధ్రాలు చేస్తాయి. దీని వలన మొక్కలకు నీరు మరియు పోషకాలు అందవు. ఈ పురుగులు మొక్కలను తినడం వలన కాండాలలో రంధ్రాలు కలిగి అందులో గొంగళిపురుగులు తప్ప ఇక ఏమీ ఉండదు. మొదటి దశల్లో దాడికి గురైన మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఉపయోగంగా ఉండే పురుగులు కొటాసియా సెసామియా, C ఫ్లావైప్స్ మరియు ట్రైకొగ్రామా షిలోనీస్ ఈ మచ్చల కాండం తొలుచు పురుగుల లార్వా పైన వాటి గుడ్లను పెడతాయి. మరొక కందిరీగ జాతికి చెందిన, క్షంతోఫీమ్ప్ల స్టెమ్మతొర్, ఈ పురుగులు ప్యూపా దశలో వున్నప్పుడు ఈ తెగులు పైన దాడి చేస్తాయి. అక్షింతల పురుగులు, అల్లిక రెక్కల పురుగులు, పెంకు పురుగులు మరియు పెంకు పురుగులు వంటివి ఈ పురుగులకు విరుద్ధంగా బాగా పనిచేస్తాయి. చివరగా మొలాసిస్ గడ్డి (మిలినీస్ మినుతిఫ్లోరా) లేదా గ్రీన్ లీఫ్ డెస్మోడియం(డెస్మోడియం ఇంతీర్తుము) ఈ పురుగులకు వ్యతిరేకంగా కొని ఏజెంట్లను ఉత్పత్తిచేస్తాయి. బాసిల్ల తూరంగియాన్సీస్, వేప నూనె లేదా బెయువేరియా బస్సియానా లను కూడా ఈ తెగులును నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. దిగుబడి నష్టాలను బట్టి పురుగుల మందులు ఎంత శాతంలో వాడాలి అనేది నిర్ధారించాలి. డెల్టామిత్రిన్ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ ఆధారిత కీటక నాశినులను గుళికల రూపంలో వీటి గూడులో వేయడం వలన ఈ మచ్చల గొంగళి పురుగులను నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పెద్ద పురుగులు లేత గోధుమ రంగులో 20 నుండి 25 మిల్లీమీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటాయి. ముందు రెక్కలు లేత గోధుమ రంగుతో ముదురు మచ్చలు కలిగి ఉంటాయి వెనకటి రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయి మరియు ఉదయం సమయాల్లో మొక్కలు లేదా మొక్కల అవశేషాలపై నిద్రిస్తాయి. ఆడ పురుగులు 10-80 గుడ్ల గుంపులుగా తెల్లటి గుడ్లు ఆకులపై పెడతాయి. గొంగళిపురుగులు ఎరుపు గోధుమ తల, లేత గోధుమ రంగు శరీరంపై ముదురు రేకలు పొడవుగా మరియు ముదురు మచ్చలు కలిగి ఉంటాయి అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. వేడి మరియు అధిక తేమ కలిగిన వాతావరణం వీటి జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా వేడి వాతావరణం వుండే లోతట్టు ప్రాంతాల్లో ఉంటుంది మరియు 1500 మీటర్లకన్నా అధిక ఎతైన ప్రదేశాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులును తట్టుకునే రకాలను వాడాలి.
  • ఈ తెగులు లక్షణాలకోసం పొలాన్ని తరుచూ గమనిస్తూ ఉండాలి.
  • చిక్కుడు జాతి, కంది మరియు మొలాసిస్ గడ్డి( మెలినీస్ మినుతిఫ్లోరా) పంటలను అంతర పంటగా వేయాలి.
  • సరైన మోతాదులో మొక్కలను వేయాలి.
  • పొలంలో అన్ని వైపులా రెండు మూడు వరసల ట్రాప్ పంటలు వేయాలి.
  • పంట లేదా ఫెరొమోన్ ట్రాప్స్ ను వాడాలి.
  • ఈ తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించాలి.
  • సీజన్లో ముందుగా కానీ సీజన్ మొదలైన తర్వాత కాస్త ఆలస్యంగా కానీ పంటను వేయడం వలన ఈ తెగులు తహెవ్రత నుండి పంటను రక్షించుకోవచ్చు.
  • సరైన మోతాదులో ఎరువులను వాడండి కానీ అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడవద్దు.
  • దీని వలన పంటకు చీడలు సోకే అవకాశం అధికంగా ఉంటుంది.
  • ఈ తెగులు సోకని ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.
  • పంట కోత అనంతరం పంట అవశేషాల్ని నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి