బంగాళదుంప

బంగాళాదుంప పెంకు పురుగులు (పొటాటో బీటిల్)

Leptinotarsa decemlineata

కీటకం

క్లుప్తంగా

  • పెద్ద పురుగులు మరియు లార్వా బంగాళాదుంప ఆకులను తింటాయి.
  • ఎక్కువ మొత్తంలో ఇవి వున్నప్పుడు మొత్తం ఆకులను తినేస్తాయి.
  • ఎరుపు లార్వా పెంకు పురుగు ప్రక్కన రెండు వరుసలలో నల్లని మచ్చలు కలిగి బీటిల్ లాంటి రూపంతో ఉంటుంది.
  • పెంకు పురుగులు తెల్లని-గోధుమ రంగు పెంకు పైన పది నల్లని చారాలతో ఉంటాయి.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

పెద్ద పురుగులు మరియు కొలరాడో పొటాటో బీటిల్ లార్వా బంగాళాదుంప ఆకులను తింటాయి. పెద్ద పురుగులు మరియు కొలరాడో పొటాటో బీటిల్ లార్వా బంగాళాదుంప ఆకుల అంచులను తినడంవలన ఆకులు రాలిపోయి కాండం మొండిగా అయిపోతుంది. కొన్నిసార్లు వాటి నల్లని మలవిసర్జనను గమనించవచ్చు. ఒకోసారి అవి బంగాళాదుంపలను కూడా తినేస్తాయి. పెద్ద బీటిల్స్ పసుపు-నారింజ రంగు కలిగి గ్రుడ్డు వలే కోలగా ఉంటాయి. పది నల్లటి చారలు వీటి తెల్లని గోధుమ పెంకు పైన ఉండటం. వీటి ముఖ్య లక్షణం. వీటి తల త్రికోణపు నల్లటి మచ్చ కలిగి తలకు పొట్టకు మధ్యభాగంలో అపసవ్యంగా ముదురు రంగులో మచ్చలు ఉంటాయి. లార్వా కూడా అదేవిధంగా ఉండడంతో పాటు ఎర్రటి "చర్మం" పక్కన రెండు వరుసలలో నల్లని చుక్కలు కలిగి ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

స్పైనోసాడ్ ఆధారిత బ్యాక్తీరియల్ క్రిమి సంహారిణిని ఉపయోగించండి. కొన్ని లార్వా స్టేజీలలో బాక్టీరియమ్ బాసిల్లస్ తూరంగియన్సీస్ కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. స్టింక్ బగ్ పెరిల్లుస్ బయోక్యులేటస్ మరియు నెమటోడ్ ప్రిస్టించస్ యూనిఫార్మిస్ కూడా బీటిల్స్ ని ఆహారంగా తీసుకుంటాయి. పరాన్న జీవి కందిరీగ ఏడోవుమ్ పూట్లేరి మరియు పరాన్న జీవి ఈగ, మయోఫారెస్ డోరీఫోరే కూడా కొలరాడో పొటాటో బీటిల్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇలా చాలా ప్రత్యామ్యాయ బయోలాజికల్ చికిత్సలకు వీలుపడుతుంది.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొటాటో బీటిల్ ను నివారించడానికి సాధారణంగా కీటకనాశనులను వాడతారు కానీ వాటి జీవితకాలం ఎక్కువగా వుండడంవలన ఇవి చాలా త్వరితంగా నిరోధకశక్తిని పెంచుకుంటాయి. ఇవి వృద్ధి చెందకుండా ఎటువంటి పరిష్కారాలను ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి.

దీనికి కారణమేమిటి?

శీతాకాలంలో, ఎదిగిన పొటాటో బీటిల్స్ సూర్యుని కిరణాలు తగలకుండా భూమి అడుగుభాగంలో ఉంటాయి. వసంత కాలంలో ఇవి ప్యూపా దశ నుండి బయటకి వచ్చి లేత మొక్కలను తినడం మొదలుపెడతాయి. ఆడ పురుగులు 20 నుండి 60 గ్రూపులుగా నారింజ రంగులో కోలగా సాగినట్టు వుండే గ్రుడ్లు ఆకుల క్రిందిభాగంలో పెడతాయి.గ్రుడ్డులోనుండి లార్వా బైటకి వచ్చినతర్వాత ఆకులను నిరంతరాయంగా తింటాయి. బాగా ఎదిగినతర్వాత అవి ఆకుల పైనుండి కిందకు వచ్చి మట్టిలో రంధ్రాలు చేసి అందులో ప్రవేశించి అందులో గోళాకారంలో గూడును ఏర్పాటుచేసుకుని పసుపురంగు ప్యూపాగా రూపాంతరం చెందుతాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక శక్తి ఎక్కువగా వున్న మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  • లార్వా ఎక్కువగా వృద్ధి చెందకముందే త్వరగా మొక్కలు నాటాలి.
  • బీటిల్స్ ను గమనించడానికి మరియు పెద్ద మొత్తంలో పట్టుకోవడానికి సుపు రంగు జిగురు వలలు వాడండి.
  • 45% వాలుతో కందకాలు ఏర్పాటుచేయండి లేదా ప్లాస్టిక్/సేంద్రియ పదార్ధాలతో నేలను కవర్ చేయండి.
  • బీటిల్స్ ను చేతితో తీసివేయండి లేదా మొక్కను బాగా కదల్చండి.
  • బంగాళాదుంప మొక్కకు అనుకూలంగా వుండే మొక్కలను మధ్యలో పెంచడం ద్వారా పొటాటో బీటిల్ ను అణిచివేయవచు.
  • లేడీబగ్, లేస్ వింగ్ మరియు స్పైన్డ్ సోల్జర్ లాంటి కీటకాలు పొలంలో అభివృద్ధి చెందేటట్టు చూడండి.
  • పంట మార్పిడి పద్ధతులు వాడాలి.
  • కోత అనంతరం పొలాన్ని దున్ని పంట అవశేషాలను పొలంలోనుండి తీసివేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి