Lacanobia oleracea
కీటకం
ఈ పురుగులు రంద్రాలు చేసి నమలడం వలన జరిగిన నష్టం లేత ఆకులు, కాండాలు, పువ్వులు మరియు పండ్ల పైన కనిపిస్తుంది. పిల్ల లార్వాలు ఆకుల క్రింది భాగంలో చిన్న రంధ్రాలు చేసి తింటాయి. ఇవి పెద్దవి అవుతున్నప్పుడు మొత్తం ఆకు అంత, ఆకు కాడలుమరియు పూవులు ఇంకా పండ్లను బాగా నష్టపరుస్తాయి. పండ్లపైన రంధ్రాలు చిన్న సొరంగాలు వంటి నిర్మాణాలు పైన గీతాలు వంటివి కనిపిస్తాయి. దెబ్బ తిన్న కణజాలం మరియు మల పదార్ధాలపై అవకాశవాద సూక్ష్మ క్రిములు చేరి నివశిస్తాయి. అందువలన చాలా తక్కువ మొత్తంలో ముదురు ఆకులపైన ఈ తెగులు సోకిన పంటకు చాలా అధిక మొత్తంలో నష్టం కలుగుతుంది. వీటికి టమోటో, పెప్పర్, బంగాళాదుంప, లెట్టూస్, కీరా దోస, ఉల్లి , క్యాబేజ్ ఇంకా కాలిఫ్లవర్ లాంటి చాలా రకాల అతిధి మొక్కలు వున్నాయి.
కొన్ని పరిస్థితులలో ట్రైకోగ్రమ్మ పరాన్నజీవి కదిరీగలను( T ఎవనేసెన్సు) లేదా పొడిసస్ మాక్యులివెంట్రిస్ ఈ గొంగళి పురుగులు జనాభాను తగ్గిస్తాయి. స్పైనోసాడ్ లేదా బాసిల్లస్ తురింజియన్సీస్ (Bt) వంటి వాటిని ఉపయోగించవచ్చు. లార్వాలు కనపడిన వెంటనే 0.1% సాంద్రతతో రెండు సార్లు పిచికారీ చేయడం వలన రసాయనాలకు ప్రత్యామ్న్యాయంగా ఇది పనిచేస్తుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. స్పైనోసాడ్ మరియు బిటి వంటి మందులవలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆల్ఫా-సైపర్మేత్రిన్ బెటా-సైఫ్లూత్రిన్, బిఫెన్త్రిన్, సైపర్మేత్రిన్, డెల్టామేత్రిన్, డైఫ్లూబెంజ్యురోన్, ఫెన్ప్రోపత్రిన్, లాంబ్డా- సైహాలోత్రిన్,టెఫ్లోబెంజురోన్ వంటి మందులను ఉపయోగించవచ్చు. సరైన ప్రణాళికతో సమీకృత యాజామాన్య పద్థతులతో ఈ పురుగులు మందులను వాడాలి. పంటకు లాభం చేకూర్చే కీటకాలు నశించిపోకుండా వీటిని ఉపయోగించాలి.
లకానోబియా ఒలేరాసియా అనే బ్రైట్ లైన్ బ్రౌన్ ఐ గొంగళి పురుగు వలన నష్టం కలుగుతుంది. ఇది కొద్దిగా తేమ వున్న పోషకాలు అధికంగా వున్న పొలాలలో మరియు గ్రీన్ హౌసులలో నదుల వెంట లేదా అడవుల నరికివేత జరిగిన ప్రదేశాలలో ఉంటుంది. పెద్ద పురుగు 35 -45 మిల్లి మీటర్ల రెక్కల పొడవుతో గోధుమ రంగు శరీరంతో ఉంటుంది. ముందు రెక్కలు ముదురు ఎర్రని గోధుమరంగు లో ఉండి లేత నారింజ రంగు కిడ్నీషేప్ పొక్కును కలిగి ఉంటుంది. ఒక తెల్లని ప్రకాశవంతమైన గీత ‘W’ ఆకారంలో ఉండడం దీని ప్రత్యేకత. వెనక రెక్కలు బూడిద రంగులో ఉండి చివరకు వెళ్ళేకొలదీ ముదురు రంగులోకి మారతాయి. ఆడ పురుగులు150 యూనిట్లుగా ఆకుల క్రింది భాగంలో గుడ్లను పెడతాయి. ఇవి ఐదు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి ఆకు పచ్చ నుండి ముదురు గోధుమ మరియు తెల్లని రంగులో ఉంటాయి. పార్శ్వపు భాగంలో నల్లని చుక్కలు మరియు పసుపు రంగు చారాలతో ఉంటాయి.