ఇతరములు

క్యాబేజీలో గొంగళి పురుగులు

Mamestra brassicae

కీటకం

క్లుప్తంగా

  • ఆకులను ఆహారంగా తినడం వలన, ఆకులు అస్తి పంజరం లాగ అయిపోతాయి.
  • రంద్రాల చుట్టూ మరియు టన్నెల్స్ చుట్టూ విసర్జించిన మల పదార్ధం కనపడుతుంది.

లో కూడా చూడవచ్చు

10 పంటలు
చిక్కుడు
క్యాబేజీ
వెల్లుల్లి
లెట్టూస్
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

క్యాబేజీలో గొంగళి పురుగులు ఆకులను తినడం మొదలుపెట్టి క్యాబేజీ హెడ్ మీద రంద్రాలను తొలుస్తాయి. ఇవి అకులో మెత్తని భాగాలను తిని ఈనెలను వదిలేయడం వలన ఆకుల ఆస్థి పంజరం మాత్రమే మిగులుతుంది. మొట్టమొదటి తరం (వేసవి ప్రారంభంలో వసంతకాలం) కు భిన్నంగా, రెండవ తరం బలంగా వుండి (అక్టోబరు వేసవికాలం) బాగా గట్టిగా వుండే కణజాలాన్ని తినడమే కాకుండా, ఆకులను కూడా తిని క్యాబేజీ యొక్క అంతర్గత భాగంలో కూడా సొరంగాలను చేస్తుంది. ఇవి రంద్రాలను చేసి బైట వాటి మలంతో కప్పిపెడతాయి. ఈ పురుగులు అధిక మొత్తంలో పంటను నాశనం చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ట్రైకొగ్రమ్మ జాతుల పారాసిటోయిడ్ కందిరీగలు కీటకం యొక్క గుడ్లను నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. కొన్నిమాంసాహార కీటకాలు, ఎల్లో జాకెట్స్, గ్రీన్ లాసింగ్, సాలీడులు మరియు లార్వా ఫీడ్ పక్షులు లార్వాను తింటాయి. సహజంగా సంభవించే బ్యాక్టీరియా బాసిలస్ తురంగియన్సీస్ మరియు కొన్ని వైరల్ ద్రావణాలు, గొంగళి పురుగులను చంపుతాయి మరియు ఆకు పైన మరియు దిగువన బాగా స్ప్రే చేసినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పర్యావరణంలో ఈ క్రిమిసంహారకాలు ఎల్లకాలం వుండవు. పాథోజెనిక్ నెమటోడ్స్ గొంగళికి వ్యతిరేకంగా పనిచేయవచ్చు మరియు ఆకులు తడిగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, ఉదాహరణకు చల్లని చల్లని వాతావరణం.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పైరెత్రుమ్, లాంబ్డా-సైహలోత్రిన్ లేదా డెల్టామేత్రిన్ ఆధారిత ఈ పురుగుల్ని నివారించడానికి వాడవచ్చు. పైరెత్రుమ్ సారాలను అనేక సార్లు మరియు పంట కోయుటకు ఒకరోజు ముందు కూడా వాడవచ్చు. లాంబ్డ-సైహోలోథ్రిన్ మరియు డెల్టమేథ్రిన్లకు, గరిష్టంగా 2 సార్లు వాడుటకు సిఫార్సు చేయబడ్డాయి. పంట కోయడానికి ఏడు రోజుల ముందు ఈ పురుగుల మందులను వాడరాదు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు క్యాబేజి గొంగళిపురుగులు( మమేస్త్ర బ్రాస్సికా) వాలా కలిపిస్తాయి. వీటి లార్వా మట్టిలో జీవిస్తుంది. పెద్ద పురుగులు గోధుమ రంగు ముందర రెక్కలను కలిగి నలుపు-గోధుమ రంగుతో కూడిన విడగొట్టినట్టుండి కావలసిన దిక్కుకు త్రిప్ప గలిగే రెక్కలను కలిగివుంటాయి. నాలుగు రెక్కలు లేత బూడిద రంగులో వుంటాయి. పుట్టిన కొన్ని వారాల తర్వాత, ఆడ పురుగులు ఆకుల రెండు ఉపరితలాలపై సమూహాలుగా తెల్ల గోళాకార గుడ్లు పెడుతాయి. పొదిన తరువాత, గొంగళి పురుగులు ఆకు కణజాలాలను తినడం ప్రారంబించి, ఆకులకు రంధ్రాలు చేసి చివరికి క్యాబేజీపై పెద్ద రంద్రాలు చేస్తాయి. ఇవి పసుపు పచ్చతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ ఆకుపచ్చతో వాటి శరీరం మీద వెంట్రుకలు లేకుండా వుంటాయి. క్యాబేజ్ గొంగళి పురుగులు సంవత్సరానికి రెండు తరాలను ఉత్పత్తి చేస్తాయి. వసంతకాలం చివరిలో మొదటి తరం నేలలో నుండి పొదుగుతుంది. గొంగళి పురుగులను తెగులు సోకిన మొక్కల పైన చూడవచ్చు. వేసవి చివరలో రెండవ తరం కనిపిస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే అధిక తెగులు నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.
  • ఈ తెగులు చిహ్నాల కోసం పొలాన్ని నిరంతరం గమనిస్తూ ఉండండి.
  • తెల్ల గోళాకార పురుగులను మరియు గొంగళి పురుగులను ఏరివేయండి.
  • ఆడ పురుగులను గుడ్లు పెట్టకుండా నిరోధించే బ్రాసికా పంటలను పొలం చుట్టూ పెంచండి.
  • కాయలు రావడం మొదలయ్యే సమయానికి ఈ తెగులును ఆశించని పంటలతో పంట మార్పిడి చేయండి.
  • పురుగుల మందులను అవసరమైనంత మేరకు వాడడం ద్వారా ఈ పురుగుల సహజ శతృవులను రక్షించుకోండి.
  • కీటకాలను ఆకర్షించి పెద్ద మొత్తంలో పట్టుకొనుటకు ఫేరోమోన్ ట్రాప్ ఉపయోగించండి.
  • క్యాబేజి పొలానికి దగ్గరగా ఈ తెగులు సోకే అవకాశం ఉన్న మొక్కలను నాటకండి.
  • ఈ తెగులును ప్రత్యామ్నాయ ఆవాసాలైన కలుపు మొక్కలను తొలగించండి.
  • పంట కోత తరవాత పొలాన్ని లోతుగా లోపలి గుడ్లు బయటపడి వాటిని తినే పక్షులకు కనబడే విధంగా మరియు చల్లని వాతావరణాలకు బహిర్గతం అయ్యేటట్టు చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి