ఉల్లిపాయ

ఉల్లిలో లార్వా క్రిములు

Delia platura

కీటకం

క్లుప్తంగా

  • ఈ మగ్గట్స్ మొలకెత్తే మొలకలు మరియు విత్తనాలను తింటాయి.
  • ఎదుగుదలకు ఉపయోగ పడే కణజలాలను నాశనం చేస్తాయి.
  • లేత ఆకులపై దాడి చేస్తాయి.
  • మొలకలు ఎండిపోయి, ఎదుగుదల లోపించి, వంకర పోతాయి.
  • దిగుబడి కూడా క్షీణిస్తుంది.
  • వీటికి తడి నేల మరియు దీర్ఘ కాలం చల్లటి వాతావరణం, అధిక తేమ వంటివి సహకరిస్తాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
చిక్కుడు
క్యాబేజీ
వెల్లుల్లి
లెట్టూస్
మరిన్ని

ఉల్లిపాయ

లక్షణాలు

ఈ క్రిములు భూమిలో ఉన్న సేంద్రియ పదార్థాలపై మరియు మొలకెత్తిన విత్తనాలపై దాడి చేస్తాయి. ఇవి విత్తనంలోకి దూరి ఎదుగుదలకి తోడ్పడే కణజాలాన్ని తినివేస్తాయి మరియు అంకురోత్పత్తి జరగకుండా ఆపుతాయి. కణజాలాలు కుళ్ళి పోతాయి. ఇవి లేత ఆకులను తిన్న గుర్తులు కనిపిస్తాయి. మొలకలు ఎండిపోయి ఎదుగుదల లోపించి, మొక్కలు వంకరగా ఎదగడం మొదలవుతుంది. అంతే కాదు, దిగుబడి కూడా క్షీణిస్తుంది. ఇవి వృద్ధి చెందడానికి తడి నేల మరియు దీర్ఘకాలిక చల్లటి వాతావరణం, అధిక తేమ వంటివి సహకరిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

గింజను తొలిచే ఈ పురుగులు భూమి లోనే ఉండటం వల్ల వీటికి సహజ శత్రువులు చాలా తక్కువ. పెంకు పురుగులు, సాలెపురుగులు మరియు పక్షులు పెద్దవి మరియు ఫంగస్ వ్యాధుల లార్వాను ప్రభావితం చేస్తాయి. ఇవి సహజంగా ప్రకాశవంతం అయిన రంగులకు ఆకర్షితం అవుతాయి కాబట్టి వీటిని పట్టుకోవటానికి ప్రకాశవంతం అయిన బకెట్లలో సబ్బు నీరు వాడటం మంచిది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలపై కీటక నాశినులను వాడటం వలన ఈ పురుగులను దూరంగా ఉంచవచ్చు. తియామెతోక్సమ్ లేదా క్లోతియానిధిం వంటి పురుగుల మందులు వాడ వచ్చు. వీటిని మీ దేశంలో వాడడానికి ఏమైనా ఆంక్షలు ఉన్నాయేమో తెలుసుకోండి. భూమిలో వేసే కీటక నాశినులను కూడా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

డెలియా ప్లాటురా మరియు D. యాంటిక జాతి ఈగల వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. పెద్ద పురుగులు రంగులో ఈగలను పోలి ఉంటాయి, కాని కాస్త చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇవి భూమిలో పాత వేర్లు మరియు మొక్కల అవశేషాలకు దగ్గరగా గడుపుతాయి. పురుగులు పెద్దవిగా మారి వసంత కాలంలో విత్తనాలు నాటే సమయానికి బయటకు వస్తాయి. ఆడ పురుగులు అధిక సంఖ్యలో శిధిలమైన పధార్థాలు లేదా ఎరువులు కలిగిన తడి భూమిలో గుడ్లు పెడతాయి. పసుపు- తెలుపు, కళ్ళు లేని లార్వా ఒక వారం రోజులలో పొడగబడతాయి మరియు శిధిలమైన పదార్ధాలపై దాడి చేస్తాయి. చల్లటి, తడి వాతావరణాలలో నష్టం అధికంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులు వీటి జీవన చక్రాలకు సహకరిస్తాయి. వేడి మరియు ఎండ వాతావరణాలు ఇవి గుడ్లు పెట్టడంలో అంతరాయం కలిగిస్తాయి దీని వల్ల మొక్కలు త్వరగా మరియు ఆరోగ్యంగా ఎదుగుతాయి.


నివారణా చర్యలు

  • తక్కువ సేంద్రియ పదార్ధాలు కలిగిన పొడి భూమిలొ నాటాలి.
  • వెచ్చని మరియు ఎండగా ఉన్న వాతావరణాలలో నాట్లు లోతు తక్కువలో వేయాలి.
  • ఎరువులు వాడుతుంటే, నాటడానికి ముందు కొన్ని వారాల వరకు ఆగాలి.
  • గడ్డి లాంటి ప్రత్యామ్నాయ పంటలు వాడాలి.
  • విత్తనాలు దెబ్బ తినకుండా జాగ్రత్త వహించాలి.
  • పొలంలో మరి చుట్టుపక్కల కలుపు లేకుండా చూడాలి.
  • నారుమడిపై చిన్ ఆకన్నాలు ఉన్నటువంటి నెట్ వాడటం వల్ల ఈగలను, లద్దె పురుగుల్ని దూరంగా ఉంచవచ్చు.
  • పొలాన్ని దున్ని పంట అవశేషాల్ని భూమిలో లోతుగా పాతి పెట్టాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి