Agromyzidae
కీటకం
ఆకుల పైన సక్రమంగా లేని సర్పాకారంలోని బూడిద రంగు చారలు ఆకుల ఈనెలకు కొద్ది దూరంలో ఏర్పడతాయి. ఇవి సహజంగా ఆకుల ఈనెలకు పరిమితమై ఉంటాయి. ఈ చిన్న రంధ్రాలవంటి సొరంగాలలో వీటి నల్లని మలపదార్ధం ఉంటుంది. మొత్తం ఆకు అంత ఈ పురుగులతో కప్పబడి ఉండవచ్చు. తెగులు సోకిన ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. దీనివలన పంట దిగుబడి తగ్గి పండ్ల పరిమాణం తగ్గడం మరియు పండ్లకు సూర్య కాంతి ప్రత్యక్షంగా తగిని నష్టం వాటిల్లుతుంది.
జిగురు ఉచ్చులను తెగులు అణిచివేసే ప్రత్యక్ష పద్ధతిగా ఉపయోగించవచ్చు. ఉదయాన్నే లేదా సాయంత్రం ఆకుల మీద లార్వాకు వ్యతిరేకంగా వేప నూనె ఉత్పత్తులను (ఆజాదిరాచ్టిన్) పిచికారీ చేయాలి. ఉదాహరణకు, వేప నూనె (15000 పిపిఎమ్) ను 5 మి లి/ లీ చొప్పున పిచికారీ చేయాలి. ఈ పిచికారీ ఆకు మొత్తం కవరేజ్ అయ్యేలా చూసుకోండి. వేప, కొద్దిగా ఆకుల్లోకి ప్రవేశించి సొరంగం లోపల కొన్ని లార్వాల వద్దకు చేరుకుంటుంది. ఎంటోమోఫాగస్ నెమటోడ్, స్టీనెర్నెమా కార్పోకాప్సే లను ఆకులపై పిచికారీ ఆకు మైనర్ జనాభాను తగ్గించగలవు. ఆకు మైనర్ల యొక్క ఇతర జీవ నియంత్రణ పద్ధతుల్లో పారాసిటోయిడ్స్ (ఉదా. క్రిసోనోటోమియా పంక్టివ్‌ట్రిస్ మరియు గణస్పిడియం హంటెరి) మరియు నెమటోడ్లు (ఉదా. స్టెయిర్‌నెర్మా కార్పోకాప్సే) వున్నాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత పరిధి కల కీటక నాశినులైన ఆర్గానోఫాస్ఫెట్స్, కార్బమెట్లు మరియు పెరిత్రోయిడ్స్ కుటుంబానికి చెందిన పురుగు మందులు ఆడ ఈగలు గుడ్లు పెట్టకుండా నిరోధిస్తాయి. కానీ ఈ మందులు లార్వాను చంపవు. అంతే కాకుండా కాకుండా ఈ పురుగుల మందుల వలన పంటకు సహాయంగా వుండే కీటకాలు కూడా నశిస్తాయి. ఈ కీటకాలు ఈ పురుగుల మందులకు నిరోధకతను కూడా పెంచుకుంటాయి. దీని వలన కొన్ని సార్లు కీటకాల జనాభా మరింత ఎక్కువ అవుతుంది. అబామెక్టిన్ , క్లోరాన్త్రనిలిప్రోల్, ఎసిటామిప్రిడ్, స్పీనేటోరమ్ లేదా స్పైనోసాద్ ఒక దాని తర్వాత మరొకటి వాడడం వలన ఈ మందులకు కీటకాలు నిరోధకతను పెంచుకోలేవు
అగ్రోమిజిడే కుటుంబానికి చెందిన అనేక జాతుల ఈగల ఈ లక్షణాలను కలిగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిలో అనేక వేల జాతులు వున్నాయి. వసంత కాలంలో ఇవి ఆకు కణజాలాన్ని రంధ్రాలు చేసి, ఆకుల కింది భాగంలో అంచులవద్ద గుడ్లు పెడతాయి. లార్వా ఆకుల కింది మరియు పై భాగం మధ్యలో తింటాయి. ఇవి తింటున్నప్పుడు నల్లటి మల పదార్ధాన్ని(మలం) వదిలి, పెద్ద తెల్లటి పాయలతో సొరంగాలు చేస్తాయి. ఇవి పరిపక్వత చెందిన తర్వాత, లార్వా ఆకు యొక్క దిగువ భాగంలో ఒక రంధ్రం తెరిచి నేలమీద పడతాయి, అక్కడ అవి ప్యూపా దశకు చేరుకుంటాయి. అతిధి మొక్కల దగ్గర మొక్కల అవశేషాలు ప్రత్యామ్నాయ ప్యూపింగ్ ప్రదేశాలు. ఆకు మైనర్ ఈగలు పసుపు రంగుకు ఆకర్షింపబడతాయి.