పొగాకు

ఫ్లీ పెంకు పురుగులు

Chrysomelidae

కీటకం

క్లుప్తంగా

  • ఆకులను తినడం వలన కలిగిన నష్టం ఆకులపైన కనిపిస్తుంది.
  • తుపాకీతో పేల్చినట్టు వున్న చిన్న చిన్న రంద్రాలు ఏర్పడతాయి.
  • ఇవి తిన్న ప్రాంతం చుట్టూ కొంచెం పసుపురంగు లోకి మారుతుంది.

లో కూడా చూడవచ్చు

25 పంటలు
అరటి
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
మరిన్ని

పొగాకు

లక్షణాలు

ఇవి ఎదిగినవి ఆకులను తింటాయి. నష్టము అనేది ఆకు అంతా పరుచుకున్నట్టు చిన్న రంద్రాలుగా (1-2 ఎంఎం), మరియు ఆకు ఈనెల మధ్యన కత్తిరించకుండా చిన్న నమిలే కుహరాలుగా కనబడుతుంది. దెబ్బతిన్న కణజాలము చుట్టూ కొంచెం పసుపుపచ్చ రంగు కనబడవచ్చు. దుంపల లోపల ఒకొక్కటి ఒకొక్క పరిమాణంలో వున్న సన్నని నిలువు రంధ్రాలు చేయబడతాయి. వీటి వలన దుంప ఉపరితలము మీద చిన్న ఎత్తైన గడ్డలు కూడా కనబడవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లేస్ వింగ్ ( క్రిసోప జాతులు) యొక్క లార్వా , ఎదిగిన డాంసెల్ బగ్స్ ( నబిస్ spp) మరియు కొన్ని పరాన్నజీవుల కందరీగలు పెద్దవైన ఫ్లీ బీటిల్స్ ను ఆహారంగా తీసుకొంటాయి లేదా చంపుతాయి. కొన్ని నులి పురుగులు కూడా మట్టిలో వుండే లార్వాలను చంపుతాయి. వీటి జనాభాను తగ్గించడానికి ఫంగల్ తెగులు కారకములు , క్రిమిసంహారక సబ్బులు లేక బాక్టీరియా క్రిమిసంహారక స్పైనోసాడ్ ను ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పురుగు మందులను బీటిల్స్ యొక్క ఆకర్షక కాలములో, అనగా అవి ఆకుల పైన కనబడే సమయంలో వాడాలి, అసిటమిప్రిడ్, కార్బరీల్, మాలాథియాన్ మరియు పేర్మత్రిన్ ఆధారిత ఉత్పత్తులు జనాభాను నియంత్రించడానికి బాగా పని చేస్తాయి.

దీనికి కారణమేమిటి?

కొన్ని రకాల మొక్కలను ప్రభావితము చేసే ఫ్లీ బీటిల్ రకాలు చాలానే వున్నాయి. బాగా ఎదిగినవి చిన్నగా ( 4 ఎం ఎం), నలుపు రంగులో వుండి, కొన్ని సార్లు ఒక మెరుస్తున్న లేదా లోహ అంశమును కలిగి వుంటాయి. అవి కోడి గుడ్డు ఆకార శరీరాన్ని మరియు జంప్ చేయడానికి వెనుక కాళ్ళను కలిగి వుంటాయి. లార్వాలు మట్టిలో ఉంటాయి మరియు వేర్లను లేదా దుంపలను ఆహారంగా తీసుకోగా, ఎదిగిన పురుగులు లేత మొక్కలను తింటాయి. చాలా ఫ్లీ బీటిల్స్ మొక్కల వ్యర్థాల క్రింద, మట్టిలో గాని, లేదా పొలముల చుట్టూ కలుపులో సోమరిగా పడుకొని వుంటాయి. ఇవి వసంతఋతువులో మళ్ళీ చురుకుగా అవుతాయి. జాతులు మరియు వాతావరణ పరిస్థితిని బట్టి, ప్రతి సంవత్సరము ఒకటి నుండి నాలుగు తరాలు పెరుగుతాయి. ఫ్లీ బీటిల్స్ వెచ్చని, పొడి పరిస్థితులను ఇష్టపడతాయి.


నివారణా చర్యలు

  • పెద్దవాటి కార్యకలాపాలను నిరోధించుటకు నాటే సమయాలను సవరించుకోండి.
  • ఫ్లీ పెంకు పురుగులను ఆకర్షించుటకు ఆకర్షక మొక్కలను నాటండి.
  • అడ్డుకునే వికర్షక మొక్కలను లేదా కీటకాల నిరోధక మొక్కలను నాటండి.
  • ఆకులను మట్టిపై పరచడం వలన ఇవి గుడ్లు పెట్టడాన్ని మరియు లార్వా దశలతో జోక్యం చేసుకుంటాయి.
  • మీ మొక్కలను, ప్రత్యేకంగా వసంత ఋతువులో, పర్యవేక్షణ చేయండి.
  • ఎదిగిన పురుగుల చర్యలను నివారించడానికి మొక్కలను నాటే సమయాన్ని (ముందుగా లేదా తరువాత) సర్దుబాటు చేయండి.
  • మొక్కలకు అవసరమైన పోషకాలను మరియు నీటిని అందివ్వండి.
  • ఈ పెంకు పురుగును ఆకర్షించే వల పంటలను నాటండి.
  • కీటక చీడలను నిలువరించే లేదా ఎదుర్కొనే ఆతిధ్యము ఇవ్వని మొక్కలను నాటండి.
  • కలుపు మొక్కలను లేదా ఇతర అతిధి మొక్కలను మీ పొలం నుండి తొలగించండి.
  • పంట వ్యర్థాలను ఉంచబడిన స్థలములను దున్నటము ద్వారా మరియు నాశనము చేయడం ద్వారా తీసివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి