Epilachna vigintioctopunctata
కీటకం
ఎదిగిన పురుగులు మరియు లార్వాలు ఆకులను తిని తీవ్రమైన నష్టము కలిగించవచ్చు. ఆకుల ఈనెల మధ్య ఆకుపచ్చని కణజాలాన్ని తినడం ద్వారా నష్టము యొక్క ప్రారంభ చిహ్నాలు కనబడతాయి. ఆకులు ఈనెలు మాత్రమే మిగిలి అస్థిపంజరంలాగా కనిపిశాయి. దీనివలన ఆకులో గట్తిగా వుండే భాగాలు మాత్రమే (ప్రధానమైన ఈనెలు మరియు ఆకు కాడలు) మిగిలి వుంటాయి. అక్కడ పండ్ల ఉపరితలంపై లోతు లేని రంధ్రాలు కూడా ఉండవచ్చు. పండ్లపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. మొలకలు నశిస్తాయి మరియు బాగా ఎదిగిన మొక్కల ఎదుగుదల ఆగిపోవవచ్చు. ఈ తెగులు వలన ఎక్కువగా ఆకులు రాలిపోవడం మరియు ఎక్కువగా పంట దిగుబడి నష్టము జరుగుతుంది అందువలన వంకాయలో అతి ప్రమాదకరమైన తెగుళ్లలో ఇది ఒకటి.
ఈ తెగులు నియంత్రణకు కందరీగ పెడియోబియస్ కుటుంబముకు చెందిన పరాన్న జీవులను ఉపయోగించవచ్చు. ఈ కందరీగలు ప్రయోజనకారకులైన లేడీ బర్డ్స్ పైన కూడా దాడి చేస్తాయి, అందువలన వీటిని వాడక ముందు తెగులు రకాన్ని సరిగా గుర్తించడం చాలా ముఖ్యం. ఈ తెగులు కారక సూక్ష్మజీవులు కూడా ఈ ఆకులను తినే బీటిల్ జనాభాను నియంత్రించడానికి సాయపడతాయి. బాక్టీరియం, బాసిల్లస్ తురింగ్జెనిసిస్ లేక ఫంగస్ ఆస్పెరిగిల్లస్ గల జీవ క్రిమి సంహారకాలను ఆకులపై స్ప్రేగా వాడవచ్చు. రిసినస్ కమ్యూనిస్ (ఆముదపు నూనె), కాలోట్రోపిస్ ప్రోసెరా మరియు డాటురా ఇన్నోక్సియాలను ఆకుల స్ప్రేగా వాడవచ్చు. అదనంగా బూడిదను వాడడం వలన ప్రారంభదశలో ఈ తెగులును ప్రభావవంతంగా తగ్గించవచ్చు.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడవలసి వస్తే డైమేథోఎట్, ఫెన్వేలరేట్ , క్వినాల్ ఫాస్, క్లోరోపైరిఫాస్, మాలాథియాన్, ఫెనిట్రోతిన్లతో కూడిన ఉత్పత్తులను ఆకులపైన పిచికారీ చేయవచ్చు.
ఎదిగిన పురుగులు గుడ్డు ఆకారములో వుండి పాలిపోయిన నారింజ రంగులో వుండి వెనుక భాగాన 28 నల్లటి మచ్చలు మరియు చిన్న మెత్తని వెంట్రుకలను కలిగి వుంటాయి. ఆడ పురుగు గుడ్డు ఆకారములో వుండే పసుపురంగు గుడ్లను (0.4-1) నిటారుగా మరియు చిన్న గుంపులలో సాధారణంగా ఆకుల క్రింది భాగాల్లో పెడతాయి. తరువాత 4 రోజులకు వీపు మీద పొడవైన, నల్లటి కొనలు కలిగి విడదీయబడిన వెన్నెముకలను కలిగివుండే పాలిపోయిన పసుపు-తెల్లటి లార్వాలు పొదుగుతాయి. ఈ లార్వాలు ఉష్ణోగ్రత మీద ఆధారపడి18 రోజులలో దాదాపు 6 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఆ తరువాత ఇవి ఆకుల క్రిందికి వెళ్లి ప్యూపాగా రూపాంతరం చెందుతాయి. తరువాత మరో 4 అదనపు రోజులకు ఒక కొత్త తరం ఎదిగిన బీటిల్స్ పొడగబడతాయి. ఈ పునరుత్పత్తి సమయములో (మార్చి – అక్టోబర్), చల్లటి ఉష్ణోగ్రతలు పురుగు జీవిత చక్రానికి మరియు వాటి జనాభా పెరుగుదలకు అనుకూలంగా వుంటాయి. ఇవి శీతాకాలమంతా ఎండిన ఆకుల కుప్పలలో వుంటాయి.