మామిడి

మామిడిలో పండు ఈగ

Ceratitis cosyra

కీటకం

క్లుప్తంగా

  • తొక్క పైన గోధుమరంగు గాయాలు.
  • పండు రంగు మారుతుంది.
  • పండు రసం మరియు జిగురు వంటి పదార్ధం కారుతుంది.
  • నిష్క్రమణ రంధ్రాలు కనపడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

C. కోసిరా తెగులు ప్రత్యేకంగా పండ్లపై మాత్రమే కనిపిస్తాయి. ఆడ పురుగులు వాటి గుడ్లను పండ్లలోకి ఇంజెక్ట్ చేస్తాయి. ఎదిగిన మామిడి పండ్లు రంగు కోల్పోయి, పళ్ళ రసాలను విసర్జిస్తాయి మరియు ఇవి జిగురు పదార్థం కలిగి ఉంటాయి. లోపల కుళ్ళు కారణంగా గోధుమ లేదా నల్లటి పొక్కులు పండు పై తొక్కపై కనిపిస్తాయి. పండ్లు ఒక రకమైన దుర్వాసనను వెదజల్లుతాయి. వాటినుండి ఒకరకమైన ద్రవం కారుతూ ఉంటుంది. మరియు ఫంగస్ మరియు బూజు లాంటి పదార్ధం పండ్లపైన ఏర్పడుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ప్రోటీన్ పదార్థాలను ఎరగా వాడే వలల్ని వాడి C. కోసిరా ను నియంత్రించవచ్చు. మెతర్హిజియం అనిసోప్లై అనే ఫంగస్ కూడా వీటి ప్యూపాపై దాడి చేస్తుంది. దీనిని చేతితో కానీ ఆయిల్ ఆధారిత పిచికారీ కానీ చేయవచ్చు. కోత అనంతరం మామిడి పండ్లను 46 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత వున్న నీటిలో శుద్ధిచేయడం లేదా 7.5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచటం వలన కూడా ఈ లార్వాను నాశనం చేయవచ్చు.

రసాయన నియంత్రణ

కీటక నాశినులు కలిగిన ఎరలు ( మలాథియాన్ లేదా డెల్టామెత్రిన్) మరియు ప్రత్యేకమైన ఎరలు ( ప్రోటీన్ హైడ్రోలైసైట్ లేదా ప్రోటీన్ ఆటోలైసైట్) వుపయోగించవచ్చు. ఈ పద్ధతి ఈగలను పట్టుకోవడంలో బాగా పని చేస్తుంది. తెర్పినియోల్ అసిటేట్ లేదా మిథైల్ యుగేనాల్ వంటి వాడి C కోసిరా మెగా ఈగలను పట్టుకోవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు కెరాటిటీస్ కోసిరా అనే పండు పురుగు వలన కలుగుతాయి. ఇవి పసుపు రంగు శరీరంతో నల్ల మచ్చలు కలిగి ఉంటాయి. రెక్కలు కూడా పసుపు రంగులో 4-6 మిల్లీమీటర్ల విస్తారం కలిగి ఉంటాయి. ఆడ పురుగులు పండుతున్న మామిడి పండ్లలో గుడ్లను పెడతాయి. ఒక 2-3 రోజుల తరువాత లార్వా బయటకి వచ్చి పండులో రంధ్రాలను చేస్తుంది. ఒకొక్క పండు కనీసం 50 లార్వాలను కలిగి ఉండే అవకాశం ఉంది మరియు ఈ లక్షణాలు కేవలం పండ్లను కోసిన తర్వాతే కనిపిస్తాయి. ఇవి ప్యూపా దశకు చేరుకోవడానికి వాటికవే నేలపై పడి నేల పైపొరను చీల్చుకుని లోపలకు చేరతాయి. 9 నుండి 12 రోజుల తర్వాత ఇవి ప్యుపానుండి బైటకు వచ్చి పూర్తిగా ఎదిగిన ఈగలు బైటకు వస్తాయి.


నివారణా చర్యలు

  • ఈ ఈగల జనాభా బాగా పెరగకముందే పక్వానికి వచ్చే రకాలను వాడండి.
  • ప్రతి రోజు తెగులు సోకిన మరియు రాలిపోయిన పండ్లను ఏరివేయాలి.
  • ప్రోటీన్ ఎరలను వుపయోగించి వీటి మనుగడను కనిపెట్టవచ్చు.
  • జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి మొక్కలను మామిడి తోటకు దగ్గరలో పెంచకుండా చూడాలి.
  • చెట్ల చుట్టూ వున్నా కలుపు మొక్కలను తొలగించాలి.
  • ఆరోగ్యంగా ఉన్న పండ్లను మాత్రమే రవాణ చేయాలి.
  • అమ్మకం కానీ పండ్లను వెంటనే తినడం కానీ నాశనం చేయడం కానీ చేయాలి.
  • చెట్ల మొదళ్ళలో చుట్టూ మట్టిని దున్నడం వలన వీటి ప్యుపాలను నాశనం చేయవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి