Aleyrodidae
కీటకం
ఈ తెల్ల ఈగలు పొలంలో మరియు గ్రీన్ హౌసులో పండించే రకాల మొక్కలను ఆశిస్తాయి. లార్వా మరియు పెద్ద పురుగులు మొక్కల కణజాలాన్ని తిని తేనె బంకను ఆకులపై, కాండంపై మరియు పండ్లపై విసర్జిస్తాయి. క్లోరోటిక్ మచ్చలు మరియు నల్ల బూజు ఈ తెగులు సోకియాన్ ప్రాంతాల వద్ద కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా వున్నప్పుడు ఈ మచ్చలు అన్ని ఒక్కటిగా కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి చుట్టుకుపోయి కప్ వంటి ఆకారంలోకి మారతాయి. తెల్ల దోమలు టమాటో పసుపు ముడత వైరస్ లేదా కాస్సావా గోధుమ చారల వైరస్ వంటి వాటిని సంక్రమింప చేస్తాయి.
తెల్ల ఈగల జాతులపైన మరియు పంట పైన ఆధారపడి వాటికి సంబంధించిన జీవ నియంత్రణలను వాడాలి. షుగర్ ఆపిల్ నూనె (అన్నోనా స్క్యూవమోస), పెరిత్రిన్స్, కీటక నాశక సబ్బులు, వేల గింజల సారం (NSKE 5%), వేప నూనె (5 మిల్లీలీటర్లు/ఒక లీటర్ నీటికి) సిఫార్స్ చేయబడింది. తెగులు కారక సూక్ష్మ క్రిములైన బెయువేరియా బస్సియన, ఇస్సరియ ఫుమ్సోరోసియా, వెర్టిసిల్లీయం లెక్కని మరియు పెసిలోమైసిస్ ఫుమోసోరోస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెల్ల ఈగలు చాలా త్వరగా పురుగులమందులకు నిరోధకతను పెంచుకుంటాయి. అందువలన ఒక దాని తర్వాత ఇంకొక మందులను మార్చి మార్చి వాడడం మంచిది. ప్రత్యామ్నాయ చికిత్స ఏమి లేకపోతే బైఫెంత్రిన్, బుప్రోఫెజిన్, ఫెనోక్సీకార్బ్, డెల్టామేత్రిన్ , లాంబ్డా- సైహాలోత్రిన్, సైపర్మేత్రిన్, పెరిత్రాయిడ్స్, పైమెట్రోజిన్, అజాడిరక్టిన్ లేదా స్పిరోమెస్ఫిన్ వాడటం వలన కూడా ఈ కీటకాలను నిర్మూలించవచ్చు. నివారణ చర్యలు తీసుకోవడం వలన ఈ కీటకాల జనాభాను పంటకు నష్టం కలిగించని విధంగా తగ్గించవచ్చు.
తెల్ల దోమలు 0.8 నుండి ఒక సెంటీమీటర్ పొడవు ఉంటాయి. వీటి శరీరం మరియు రెండు జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద, మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకుల క్రింది భాగంలో కనిపిస్తాయి. వీటిని కదిపినట్లైతే తేళ్లను మేఘం లాగ ఒక్కసారే పైకి వస్తాయి.ఇవి పొడి మరియు వెచ్చని వాతావరణంలో జీవిస్తాయి. ఇవి ఆకుల క్రింద గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు పసుపు రంగు నుండి తెల్లని రంగులో ఉండి చదునుగా, కోలగా మరియు పాలిపోయిన పచ్చ రంగులో ఉంటాయి. ఆహారం లేకుండా ఇవి ఎక్కువ కాలం బ్రతకలేవు. అందువలన ఈ తెగులును నివారించడంలో కలుపు మొక్కల నియంత్రణ చాలా ముఖ్యమైనది.