Acigona ignefusalis
కీటకం
ఈ కాండం తొలుచు పురుగు లార్వా చిరు ధాన్యాల ఆకులపైన మరియు ఆకుల కొనలపైన దాడిచేస్తుంది. ఈ లార్వా కాండంలోకి రంద్రాలు చేయడం వలన మొక్కలు చనిపోతాయి. పూర్తిగా ఎదిగిన లార్వా 20 మిల్లీమీటర్ల పొడవు ఉండి ఎర్రని గోధుమ రంగు తల మరియు తెల్లని శరీరం కలిగి ఉంటుంది. పెద్ద పురుగు తెల్లని 8 నుండి 15 మిల్లీమీటర్ల రెక్కల పొడవు కలిగి ఉంటుంది. ఆడ పురుగులు పసుపు రంగులో వుండే గుడ్లను గుంపులు గుంపులుగా పెడతాయి.
ఫెరొమోన్ వలలు వుపయోగించి వీటి జనాభాను నియంత్రించవచ్చు. కంచెలు వెంబడి మరియు ధాన్యాగారాల వద్ద ఈ వలలు ఉపయోగించాలి( ముఖ్యంగా చిరు ధాన్యాల కాండాలు లేదా ఇతర గడ్డి వుపయోగించి వీటిని తయారు చేసినట్లయితే). సీజన్లో ముందుగా ఉపయోగించినట్లైతే ఈ కాండం తొలుచు పురుగులపైన వేపనూనె మంచి సమర్ధవంతమైన ప్రభావం చూపుతుంది. "పుష్ పుల్" పద్దతి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. డెస్మోడియంను చిరు ధాన్యాల పంటలో అంతర పంటగా వేయవచ్చు. డెస్మోడియం ఈ పురుగులను తిప్పికొడుతోంది. దీనివలన కాండం తొలుచు పురుగులు మొక్కలనుండి దూరంగా వెళ్లిపోతాయి. నేపియర్ లేదా సూడాన్ గడ్డి రకాలను పొలం చుట్టూ వేయవచ్చు. ఈ పంటలు ఈ పురుగులను ఆకర్షించి చిరు ధాన్యపు పంటల నుండి ఈ పురుగులు దూరంగా వెళ్ళేటట్టు చేస్తాయి.
కీటక నాశినులు వాడడం కష్టతరంగా ఉంటుంది మరియు అధిక ఖర్చుతో కూడుకున్న పని. డైమిథోయేట్ ను వాడవచ్చు కానీ దీనికి పెట్టిన ఖర్చు సమర్ధనీయం కాదు.
అధికంగా తేమ వుండే ప్రాంతాలలో సంవత్సరంలో మూడు తరాల లార్వా ఉంటాయి. పొడి వాతావరణ ప్రాంతాలలో ఇవి రెండు ధరలకే పరిమితమౌతాయి.ఇవి కాండానికి రంద్రం చేయడం వలన వేర్ల నుండి మొక్కకు అందవలసిన నీరు మరియు పోషకాలు అందక మొక్క ఎదుగుదలకు అవరోధం కలుగుతుంది. వీటి లార్వా పంట అవశేషాలలో జీవించి ఉంటుంది.