ఇతరములు

పండ్ల చెట్టు బెరడు పెంకు పురుగు

Scolytus mali

కీటకం

క్లుప్తంగా

  • అణగారిన చెట్ల కాండం లేదా కొమ్మలపై రంధ్రాలు మరియు విసర్జన పదార్ధాలు కనపడతాయి.
  • బెరడు కత్తిరించి తొలగించినట్లైతే బెరడు కింది చెక్కపై సొరంగాల అమరిక నేరుగా కనిపిస్తుంది.
  • ఈ సొరంగం మాయన్ క్విపును పోలి ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
పీచ్
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

సాధారణంగా , ఆడ పురుగులు గుడ్లు పెట్టడానికి అణగారిన చెట్లను లేదా లేత చెట్లను ఎంచుకుంటాయి. ఆరోగ్యకరమైన చెట్ల బెరడు బాగా బలంగా ఉన్నందున తెగుళ్ల బారిన పడే అవకాశం తక్కువ. కాండం లేదా కొమ్మల వద్ద విసర్జన పదార్ధాలతో కూడిన నిష్క్రమణ లేదా ప్రవేశ రంధ్రాలను చూడవచ్చు. బెరడు కత్తిరించి తొలగించినట్లైతే బెరడు కింద చెక్కపై సొరంగాల అమరిక నేరుగా కనిపిస్తుంది. ఆడ పురుగులు 5-6 సెం.మీ లోతు (10 సెం.మీ వరకు), 2 మి.మీ వెడల్పుతో కొరికి రంధ్రాలు చేస్తాయి. అలా చేసి ఇది ఈ సొరంగం ప్రక్కల ఉన్న చిన్న కుహరాలపై గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగిన తరువాత లార్వా బెరడు క్రింద కొంచెం చిన్నగా మరియు ఇరుకైన రంధ్రాలను చేస్తుంది. ఇది అసలు సొరంగం నుండి మొదలై దాదాపు లంబంగా ఉంటుంది. ఈ సొరంగం మాయన్ క్విపును పోలి ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

స్కోలిటస్ మాలికి పెద్ద సంఖ్యలో వేటాడే కీటకాలు వున్నాయి, కాని ఈ రంగంలో జీవ నియంత్రణగా వాటి ఉపయోగం గురించి చాలా తక్కువ అధ్యయనాలు జరిగాయి. అనేక జాతుల పక్షులు స్కోలిటస్ మాలి యొక్క లార్వాను వేటాడి తింటాయి. వీటి జనాభాను నియంత్రించడానికి స్పాథియస్ బ్రెవికాడిస్ జాతికి చెందిన బ్రాకోనిడ్ పరాన్నజీవి కందిరీగలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. చాల్సిడ్ రకానికి చెందిన ఇతర కందిరీగలను కూడా ఉపయోగించవచ్చు ( ఇతర రకాల్లో చెరోపాచిస్ కొలోన్ లేదా డినోటిస్కస్ అపోనియస్).

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటి జనాభా దాడి స్థాయికి చేరుకుంటే, పెద్ద పురుగులుఎగిరే సమయంలో ఇవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. పండ్ల చెట్టు బెరడు పెంకు పురుగులను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎటువంటి పురుగు మందులు అందుబాటులో లేవు.

దీనికి కారణమేమిటి?

పండ్ల చెట్లపై గమనించిన లక్షణాలు బీటిల్ స్కోలిటస్ మాలి వలన కలుగుతాయి. వీటి లార్వా జిలోఫాగస్, అంటే ఇవి బెరడు క్రింద ఉన్న కణద్రవ్యం కలిగిన చెక్కను తింటాయి. పెద్ద పురుగులు ఎర్రటి-గోధుమ రంగులో, నల్లటి తల మరియు 2.5-4.5 మి.మీ పొడవుతో మెరుస్తూ ఉంటాయి. సాధారణంగా , ఆడ పురుగులు గుడ్లు పెట్టడానికి అణగారిన చెట్లను లేదా లేత చెట్లను ఎంచుకుంటాయి. ఇవి బెరడు గుండా ఒక రంధ్రం చేసి సాప్‌వుడ్‌లోకి ఒక సొరంగం చేస్తాయి. అలా చేసి ఇది ఈ సొరంగం ప్రక్కల ఉన్న చిన్న కుహరాలపై గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగిన తరువాత లార్వా బెరడు క్రింద కొంచెం చిన్నగా మరియు ఇరుకైన రంధ్రాలను చేస్తుంది. ఇది అసలు సొరంగం నుండి మొదలై దాదాపు లంబంగా ఉంటుంది. వసంత ఋతువులో లార్వా అక్కడ ఒక గూడులో ప్యూపా దశకు చేరుతుంది. స్థిరమైన వెచ్చని ఉష్ణోగ్రతలలో (18-20°C) పెద్ద పెంకు పురుగులు పొదిగి, బెరడు ద్వారా ఒక సొరంగం చేసి కొత్త జీవిత చక్రం ప్రారంభించడానికి అనుకూలమైన ఇతర చెట్ల పైకి ఎగిరి వెళతాయి. ఈ దాడి అనేది చెట్లు అప్పటికే బలహీనపడ్డాయి అనడానికి సంకేతం, ఉదా. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా అననుకూల నేల పరిస్థితుల ద్వారా.


నివారణా చర్యలు

  • చెట్లకు సమతుల్య పోషణ ఉండేలా చూసుకోండి.
  • తగినంత నీటి పెట్టండి.
  • అంతే కాని నీటిని అధికంగా పెట్టకండి.
  • పండ్ల చెట్లకు దగ్గరగా వంట చెరకును నిల్వ చేయవద్దు.
  • వీటి జనాభాను పర్యవేక్షించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • ఉచ్చు చెట్లు లేదా ఉచ్చు శాఖలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
  • తెగులు సోకిన కొమ్మలను లేదా చెట్లను కత్తిరించి కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి