ఇతరములు

ఎర్మైన్ చిమ్మట

Yponomeutidae

కీటకం

క్లుప్తంగా

  • కొమ్మల చివర్ల వద్ద ఆకులు రాలిపోతాయి.
  • ఆకులు ఒకదానితో మరొకటి అల్లుకుపోతాయి.
  • పండ్ల పెరుగుదల తగ్గడం మరియు అకాలంగా పడిపోవడం జరుగుతుంది.
  • తెల్లని, పొడవైన, సన్నని శరీరం కలిగిన చిమ్మట తెలుపు, నలుపు చుక్కలు కలిగిన బూడిద రంగు రెక్కలతో ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
ఆపిల్
చెర్రీ
పియర్

ఇతరములు

లక్షణాలు

ఎర్మైన్ ఆపిల్ ఎర్మైన్ చిమ్మటలు ప్రధానంగా వదిలివేసిన పండ్ల తోటలు మరియు పెరటి చెట్లపై దాడి చేస్తాయి, కాని వాణిజ్య తోటలకు కూడా సంక్రమించవచ్చు. ఇది ఆకులను విపరీతంగా తిని కొమ్మల చివర్ల వద్ద ఆకులు రాలిపోవడానికి కారణమవుతుంది. ఇవి అనేక ఆకులను కలపడం ద్వారా గూళ్ళను తయారు చేస్తాయి. ఇవి తయారు చేసే గూళ్ళు లేదా "గుడారాలు" తగినంతగా ఉంటే, చెట్టు ఆకులు పూర్తిగా రాలిపోతాయి. అలాంటి సందర్భాల్లో, పండ్లు పెరగడం మాని, అకాలంగా రాలిపోవచ్చు. అయినప్పటికీ, ఈ తెగులు చెట్టు యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని లేదా శక్తిని అరుదుగా ప్రభావితం చేస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

చాలా సందర్భాల్లో చికిత్స అనవసరం, ఎందుకంటే చాలా వరకు నష్టం చెట్ల ఉపరితలానికి మాత్రమే పరిమితమై వుంటుంది. అందువలన చెట్టు ఈ తెగులును తట్టుకోగలదు. టాచినిడ్ ఈగలు, పక్షులు మరియు సాలెపురుగులు వంటి వీటిని వేటాడి తినే జీవులు ఆపిల్ ఎర్మైన్ చిమ్మటను నియంత్రించడంలో సహాయపడతాయి. అజెనియాస్పిస్ ఫస్సికోల్లిస్ జాతికి చెందిన పరాన్న జీవి కందిరీగలు వీటి జనాభాను తగ్గించడానికి మరియు దాని వ్యాప్తిని నెమ్మదించేటట్టు చేయడానికి విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. బాసిల్లస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా ఆధారిత బయో క్రిమి నాశినులు గొంగళి పురుగుల జనాభాను నియంత్రించడంలో మంచి ఫలితాలను చూపించాయి. కాంటాక్ట్ పురుగుమందు పైరెథ్రమ్ కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చెట్టు మొత్తం పూర్తిగా పురుగుమందు వాడడం వలన విస్తృతమైన ముట్టడిని నియంత్రించవచ్చు. సంపర్క పురుగుమందులు డెల్టామెథ్రిన్ లేదా లాంబ్డా-సైహలోథ్రిన్ లార్వాలను నియంత్రించడంలో సహాయపడతాయి. దైహిక పురుగుమందు ఎసిటామిప్రిడ్‌ను కూడా ఉపయోగించవచ్చు. కీటకాలు పరాగసంపర్కం చేసే ప్రమాదం ఉన్నందున పువ్వులు వున్న మొక్కలపై ఈ మందులను పిచికారీ చేయరాదు.

దీనికి కారణమేమిటి?

వైపొనోమియుటోయిడియా కుటుంబానికి చెందిన లార్వా తినడం వలన ఈ లక్షణాలు ఏర్పడుతాయి. వేసవి మధ్యలో ఈ చిమ్మటలు బయటకు వస్తాయి. ఇవి తెల్లటి, పొడవైన మరియు సన్నని శరీరం మరియు 16 నుండి 20 మిమీ వెడల్పు రెక్కలను కలిగి ఉంటాయి. తెల్లని చివర్లు కుచ్చులాగా వుండే ముందు రెక్కలపై నల్లని చిన్న చిన్న చుక్కలు ఉంటాయి, అయితే వెనక రెక్కలు బూడిద రంగులో ఉండి వీటి అంచులు కూడా కుచ్చులాగా ఉంటాయి. ఆడ చిమ్మట పసుపురంగు గుడ్లను గుంపులుగా ఒకదానిపైన ఒక వరుసలో, మొగ్గలు లేదా కొమ్మలు కలిసే ప్రాంతానికి దగ్గరగా బెరడుపై పెట్టి ఒక విధమైన గూడును ఏర్పరుస్తాయి. మొగ్గ విచ్చుకునే సమయంలో లార్వా బైటకు వచ్చి ఆకులను తినడం ప్రారంభిస్తుంది. ఇవి ఆకుపచ్చ-పసుపురంగులో ఉండి, సుమారు 20 మి.మీ పొడవు మరియు వీటి శరీరం వెంబడి రెండు వరుసల నల్ల మచ్చలతో ఉంటాయి. ఆకులను కలిపి నిర్మించిన "టెంట్" లో ఇవి గుంపులు గుంపులుగా తింటాయి. అనేక లార్వా దశలను దాటిన తరువాత, ఈ గొంగళి పురుగులు ఆకులనుండి వేలాడుతున్న స్పిన్డిల్ ఆకారపు పట్టు కాయల్లో ప్యూపా దశకు చేరుకుంటాయి. వీటికి సంవత్సరానికి ఒక తరం మాత్రమే ఉంది.


నివారణా చర్యలు

  • పండ్ల తోటలను గమనిస్తూ ఏదైనా తెగులు సోకిన రెమ్మ లేదా కొమ్మను తొలగించండి లేదా కత్తిరించండి.
  • పురుగుమందుల నియంత్రిత ఉపయోగం ద్వారా టాచినిడ్ ఈగలు, పక్షులు మరియు సాలెపురుగులు వంటి వీటిని వేటాడే కీటకాల జనాభాను ప్రేరేపించండి.
  • చిమ్మటను పట్టుకోవడానికి మరియు జనాభాను పర్యవేక్షించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి