ఆపిల్

కోడ్లింగ్ చిమ్మట

Cydia pomonella

కీటకం

క్లుప్తంగా

  • ఎరుపు వలయాలు మరియు విసర్జన పదార్ధాలు చుట్టూ వున్నరంధ్రాలు పండ్లపైన కనిపిస్తాయి.
  • పండు లోపల సొరంగాలు మరియు కుళ్ళిపోవడం జరుగుతుంది.
  • పండు కోసి తెరిచినప్పుడు, కోర్ దగ్గర కొన్నిసార్లు గొంగళి పురుగు కనిపిస్తుంది.
  • పాడైపోయిన పండ్లు ముందుగా పండిపోయి పడిపోతాయి లేదా మార్కెట్ చేయడానికి పనిచేయవు.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
మొక్కజొన్న
మరిన్ని

ఆపిల్

లక్షణాలు

లార్వా తినడం వలన పండ్లకు నష్టం కలుగుతుంది. పండ్ల చర్మంపై లోతు తక్కువగా వున్న ప్రవేశ మార్గాలు కనిపిస్తాయి మరియు వదిలేసిన ప్రవేశ మార్గాలుగా ఉంటాయి. ఇక్కడ లార్వా చనిపోవడం లేదా ఆ ప్రాంతాన్ని వదిలేసి మరొక ప్రాంతంలో ప్రయత్నించి ఉంటుంది. విజయవంతంగా ప్రవేశించినట్లైతే లార్వా పండు యొక్క కండలోకి చొచ్చుకుపోతుంది మరియు విత్తనాలను తినడానికి పండు మధ్య భాగానికి చేరుతుంది. ప్రవేశ రంధ్రాలు ఎర్రటి వలయంతో ఉండి ఎర్రటి-గోధుమరంగులో ఉండే లార్వా విసర్జనలతో కప్పబడి ఉంటాయి. పండును కోసినప్పుడు కొన్నిసార్లు పండు మధ్యలో చిన్న తెల్ల గొంగళి పురుగు కనిపిస్తుంది. పాడైపోయిన పండ్లు ముందుగానే పండిపోయి పడిపోతాయి లేదా అమ్మకానికి పనికిరావు. వీటిని నియంత్రించకుండా వదిలేస్తే లార్వా గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది రకం మరియు స్థానాన్ని బట్టి ఇది 20 నుండి 90% పండ్లకు సంక్రమిస్తుంది. ఉంటుంది. నిల్వ చేసిన పండ్లలో ఇవి బాగా లోతుగా ప్రవేశించినట్లైతే తీవ్రమైన సమస్య అవుతుంది. ఎందుకంటే వీటిని బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆవాసాలుగా చేసుకుంటాయి. దీనివలన పండ్లు కుళ్లిపోతాయి. త్వరగా పరిపక్వతకు వచ్చే రకాల కంటే ఆలస్యంగా పరిపక్వతకు వచ్చే రకాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కోడింగ్ మాత్ గ్రాన్యులోసిస్ వైరస్ (సివైడి-ఎక్స్) ను, చిమ్మటలు లేదా పండ్ల పైన చిన్న రంధ్రాలను మొదట గమనించినప్పటినుండి మొదలుపెట్టి, వారానికి ఒకసారి వాడవచ్చు. ఈ వైరస్ చిమ్మట యొక్క లార్వాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది మరియు 1% నూనెతో కలిపి పిచికారీ చేయాలి. స్పినోసాడ్ వంటి పురుగుమందులు తెగులు నియంత్రణకు కూడా సిఫారసు చేయబడ్డాయి. కానీ ఇది సేంద్రీయేతర పరిష్కారాలకన్నా చాలా తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ తెగులు యొక్క అపరిపక్వ దశల్లో వీటిలోనికి చొచ్చుకుపోయి నాశనం చేసే ప్రయోజనకరమైన నెమటోడ్లు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. ఈ తెగులును అరికట్టడానికి తడి చేయగల కావొలిన్ బంకమట్టిని కూడా ఉపయోగించవచ్చు మరియు నష్టాన్ని 50-60% తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. లింగాకర్షక బుట్టలు మరియు పురుగుమందుల పిచికారీలను ప్లాన్ చేయండి మరియు సమన్వయం చేయండి. కోడింగ్ మాత్ గ్రాన్యులోసిస్ వైరస్ (సివైడి-ఎక్స్) ను, చిమ్మటలు లేదా పండ్ల పైన చిన్న రంధ్రాలను మొదట గమనించినప్పటినుండి మొదలుపెట్టి, వారానికి ఒకసారి వాడవచ్చు. ఈ వైరస్ చిమ్మట యొక్క లార్వాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది మరియు 1% నూనెతో కలిపి పిచికారీ చేయాలి. స్పినోసాడ్ వంటి పురుగుమందులు తెగులు నియంత్రణకు కూడా సిఫార్స్ చేయబడ్డాయి. అయినప్పటికీ స్పినోసాడ్ చాలా తక్కువ విస్తృత-స్థాయి విషపూరితం.

దీనికి కారణమేమిటి?

సిడియా పోమోనెల్లా యొక్క లార్వా వల్ల లక్షణాలు ఏర్పడతాయి. సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు మరియు తరువాత పెద్ద పురుగులు చురుకుగా ఉంటాయి మరియు సూర్యాస్తమయం ఉష్ణోగ్రతలు 16°C దాటినప్పుడు అవి సంభోగంలో పాల్గొంటాయి. మొదటి తరం చిమ్మటలు వసంత ఋతువులో లేదా వేసవి ప్రారంభంలో పువ్వులు వికసించే ముందు గుడ్లు పొదుగుతాయి. అవి ఎగరడం ప్రారంభించిన ఒకటి లేదా రెండు వారాల తరువాత, ఈ చిమ్మటలు పండ్లపై గుడ్లు పెడతాయి. సాధారణంగా ఇవి ఒక పండుపై ఒక గుడ్డు చొప్పున పెడతాయి. ఈ గుడ్ల నుండి చిన్న లార్వా పొదగబడుతుంది మరియు పండు పైతొక్కను నమిలి పండ్లలోకి రంధ్రాలను చేస్తుంది. గొంగళి పురుగు పూర్తిగా అభివృద్ధి చెందడానికి మూడు నుండి ఐదు వారాలు పడుతుంది. పూర్తిగా ఎదిగిన లార్వా పండ్లను వదిలివేసి దాక్కోవడానికి ఒక స్థలాన్ని కనుగొంటుంది. ఉదా. కాండంలో పగుళ్లు. రెండవ తరం పురుగులు వేసవి చివరిలో లేదా శరదృతువు ప్రారంభంలో పొదగబడతాయి. ఇవి నిద్రావస్థకు చేరడానికి ఆవాసం లభించేంతవరకు పండిన పండ్లకు నష్టం కలుగచేస్తుంది.


నివారణా చర్యలు

  • త్వరగా పరిపక్వతకు వచ్చే రకాలను ఎంచుకోండి.
  • పువ్వులు వికసించిన 6-8 వారాల తరువాత తెగులు సంకేతాల కోసం మొక్కలు మరియు పండ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
  • చిమ్మటలను పర్యవేక్షించడానికి మరియు నాశనం చేయడానికి లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేయండి.
  • పువ్వులు వికసించిన 4 నుండి 6 వారాల తరువాత పండ్లను బ్యాగింగ్ చేయడం పండ్లను రక్షించడానికి ఉపయోగపడుతుంది.
  • గట్టి బ్రష్ లేదా ప్రత్యేక బెరడు స్క్రాపర్‌తో బెరడు నుండి లార్వాలను తొలగించండి.
  • మృదువైన బెరడు రకాల్లో చిమ్మట లార్వాలను పట్టుకోవడానికి కాండం చుట్టూ కార్డ్‌బోర్డ్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయవచ్చు.
  • చెట్ల అవశేషాలు మరియు తెగులు సోకిన పండ్లను వీలైనంత త్వరగా తొలగించి, పండ్ల తోటకు దూరంగా లోతుగా కప్పెట్టడం లేదా కాల్చివేయడం ద్వారా నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి