చెరుకు

ఉన్ని పేనుబంక

Eriosoma lanigerum

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు మరియు చిగుర్లు ఎండిపోయి పసుపు రంగులోకి మారతాయి.
  • బెరడు, చిగుర్లు మరియు వేర్లపై బుడిపెలు మరియు వాపులు వస్తాయి.
  • ఇవి తిన్న ప్రాంతంలో తెల్లని మెత్తటి పదార్థం కప్పబడి ఉంటుంది.
  • అవకాశవాద శిలీంధ్రాలకు గురవుతుంది.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

3 పంటలు

చెరుకు

లక్షణాలు

తెల్ల వెంట్రుకలు కలిగిన కీటకాలు మొగ్గలు, కొమ్మలు, రెమ్మలు, చిగుర్లు మరియు వేర్లను కూడా తినడం చూడవచ్చు. ఇవి తినడం వలన వంకర తిరిగిన ఆకులు, పసుపు రంగు ఆకులు, పేలవమైన పెరుగుదల మరియు కొమ్మల డైబ్యాక్ వంటి లక్షణాలు కలుగుతాయి. ఇవి తిన్న ప్రాంతాల వద్ద తెల్లని మెత్తటి పదార్థం మరియు తేనెబంక కనిపిస్తాయి. బెరడు మరియు రెమ్మలపై, క్యాంకర్లు మరియు వాపు వృద్ధి చెందడం కూడా ఒక లక్షణం. పేనుబంక యొక్క భూగర్భ రూపాలు వేర్లపై కూడా దాడి చేస్తాయి మరియు పెద్ద ముడులు ఏర్పడటానికి దారితీస్తాయి. నీరు మరియు పోషకాల రవాణా సరిగా ఉండకపోవడం వలన చెట్లు పసుపు రంగులోకి మారతాయి. ఇవి తినడం వలన ఈ బుడిపెలు ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి. పురుగుల వలన కలిగే గాయాలు మరియు తేనెబంక వలన అవకాశవాద శిలీంధ్రాలు ఆకర్షించబడి కణజాలాలను నల్లని బూజుతో కప్పేస్తాయి. ఈ తెగులు సోకిన చిన్న మొక్కలను పీకినప్పుడు భూమిలో నుండి సులభంగా వూడివస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పేనుబంకను చంపడానికి ఇవి స్రవించిన ఉన్ని పొరలోకి పిచికారీ ద్రావణాలు చొచ్చుకుని ప్రవేశించగలగాలి. వీటిని చెదరగొట్టడానికి పలుచగ చేసిన ఆల్కహాల్ ద్రావణాలు లేదా పురుగుమందుల సబ్బులను ఈ ఉన్ని మచ్చల మీద చల్లవచ్చు. పర్యావరణహేతు నూనెలు లేదా వేప సారాన్ని కూడా (ఒక లీటర్ నీటికి 2-3 మి.లీ) చెట్లపై పిచికారీ చేయవచ్చు. మొదటి పిచికారీ అయిన 7 రోజుల తర్వాత మంచి కవరేజ్ మరియు తిరిగి పిచికారీ అవసరం. లేస్‌వింగ్స్, లేడీబగ్స్ (ఎక్సోకోమస్ క్వాడ్రిపుస్టూలాటస్), హోవర్‌ఫ్లైస్ లార్వా మరియు పరాన్నజీవి కందిరీగలు (అఫెలినస్ మాలి) వంటి పరాన్నజీవులు మరియు వీటిని వేటాడి తినే కీటకాలు వీటి జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి. కృత్రిమ శరణాలయాలు కుమ్మరి పురుగుల జనాభాను పెంచుతాయి, ఉదాహరణకు ఫోర్ఫిక్యులా ఆరిక్యులరియా.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ముందస్తుగా లేదా తెగులును గుర్తించిన తర్వాత రసాయన నియంత్రణలను వాడవచ్చు. చికిత్స చేసిన మొక్కలను పేనుబంక పురుగులు తినకుండా ఉండటానికి ఈ చికిత్సలు ఉపయోగపడతాయి. దురదృష్టవశాత్తు అవి ప్రయోజనకరమైన కీటకాలకు కూడా హాని చేస్తాయి. రియాక్టివ్ పిచికారీలలో డెల్టామెథ్రిన్, లాంబ్డా-సిహలోథ్రిన్ మరియు ఎసిటామిప్రిడ్ ఆధారిత ఫార్ములేషన్లు ఉన్నాయి. పరాన్నజీవులు మరియు వీటిని వేటాడే కీటకాలను చంపడం ద్వారా పేనుబంక వ్యాప్తి చెందడాన్ని ప్రోత్సహిస్తున్నందున కార్బమేట్స్ మరియు పైరిథ్రోయిడ్స్ ను నివారించాలి. పరాగ సంపర్కానికి సహాయపడే కీటకాలకు ప్రమాదం ఉన్నందున పూలతో వున్న చెట్లపై పిచికారీ చేయరాదు.

దీనికి కారణమేమిటి?

ఉన్ని అఫిడ్ ఎరియోసోమా లానిగెరం తినడం వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. చాలా అఫిడ్స్ మాదిరిగా కాకుండా, ఇది ఆకుల నుండి కాకుండా చెక్క కాండం మరియు చిగుర్ల నుండి కణద్రవ్యాన్ని పీల్చుకుంటుంది. ఇది తెల్లని, మందపాటి, మెత్తటి మైనపు పూత కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఇది బెరడుపైన పగుళ్లలో లేదా ముందు తిన్న ప్రాంతం చుట్టూ ఉన్న గాయాలపై జీవిస్తుంది. వసంత ఋతువులో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఇవి మళ్లీ చురుకుగా మారతాయి మరియు సన్నని బెరడు వున్న ప్రదేశాల కోసం సక్కర్స్, లేత చిగుర్లు మరియు కొమ్మలపైకి ఎక్కుతాయి. అక్కడ ఇవి గుంపుగా బెరడు క్రింద నుండి కణద్రవ్యాన్ని పీలుస్తాయి మరియు చివరికి కాలనీని చుట్టే మెత్తటి వెంట్రుకలను స్రవిస్తాయి. అప్పుడు ఈ బహిరంగ గాయాలను అవకాశవాద వ్యాధికారక సూక్ష్మ జీవులు ఆవాసంగా చేసుకుంటాయి. పెద్ద పురుగులు, వేసవిలో రెక్కలు పెంచి, కొత్త అతిధి మొక్కల కోసం ఎగిరిపోతాయి. పండ్ల తోటల సమీపంలో ఉన్న ఎల్మ్ చెట్లు ఆపిల్ తోటలకు ఈ అఫిడ్ యొక్క వలసలను పెంచుతాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను ఎంచుకోండి.
  • తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు పురుగును బ్రష్ తో తొలగించవచ్చు.
  • మొక్కలను బలోపేతం చేయడానికి ఫోర్టిఫైయర్స్ లేదా సమతుల్య ఎరువులను వాడండి.
  • పురుగుమందుల అధిక వినియోగాన్ని నివారించండి ఎందుకంటే అవి ప్రయోజనకరమైన కీటకాల జనాభాను తగ్గిస్తాయి.
  • వృద్ధి చెందుతున్న వీటి ఆవాసాలను తొలగించడానికి వేసవి చివరలో మొక్కలను కత్తిరించండి.
  • తెగులు సోకిన లేత చిగుర్లు మరియు కొమ్మలను తొలగించండి.
  • పేనుబంక పురుగుల కోసం తక్కువ అనుకూలమైన పరిస్థితులను సృష్టించడానికి మొక్క మొదలు వద్ద సక్కర్లను తొలగించండి.
  • వీటి ఆవాసాలను నిరుత్సాహపరిచేందుకు వాణిజ్య ప్రూనింగ్ పెయింట్‌తో పెద్ద కత్తిరింపు కోతలపై పెయింట్ వేయండి.
  • ఆపిల్ చెట్ల తోటలకు దగ్గరగా ఎల్మ్ చెట్లను నాటవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి