Thysanoptera
కీటకం
చిన్న వెండి అతుకులు ఆకు ఈనెల మధ్య భాగంపై కనిపిస్తాయి, దీన్ని 'సిల్వరింగ్' అంటారు. రంగు కోల్పోయిన ప్రాంతంలో పూరేకులపై ఇదేవిధమైన అతుకులు కనిపిస్తాయి. ఆకుల క్రింది భాగంలో తామర పురుగులు మరియు వాటి లార్వా ఒకే ప్రదేశంలో వాటి నల్లటి పేడ రంగు మచ్చల దగ్గర గుంపుగా కూర్చుని ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి, రూపు మారిపోవడం లేదా ముడుచుకొని పోతాయి. మొగ్గలు లేదా పూత వృద్ధిచెందుతున్న సమయంలో ఈ పురుగులు తినటం వలన, తరువాత గీతలు పడిన, కుంగిపోయిన లేదా రూపు మారిన పువ్వులు లేదా పండ్లు ఏర్పడి దిగుబడిలో నష్టం కలుగుతుంది.
ప్రత్యేకంగా తామర పురుగుల పైనే పనిచేసే కొన్ని రకాల జీవ నివారణ పద్ధతులు వృద్ధిచేయపడ్డాయి. తామర పురుగులపై ఇతర మందులు లేదా జీవ సంబంధిత ఫార్ములేషన్లకన్నా స్పైనోసాద్ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ప్రభావం చూపిస్తుంది మరియు పిచికారీ చేసిన కణజాలంపై కొంత లోపలివరకు చొచ్చుకుపోతుంది. కానీ తామర పురుగుల కొన్ని సహజ శత్రువులైన (ఉదా., ప్రెడేటరీ మైట్స్, సైర్ఫిడ్ ఫ్లై లార్వా) మరియు తేనె తీగలకు కూడా ఇది విషపూరితం అవుతుంది. అందువలన పుష్పించే దశలో వున్నా మొక్కలపై స్పైనోసాద్ ను వాడకండి. పువ్వుల తామర పురుగుల విషయానికి వస్తే, కొన్ని పురుగు మందులు మరియు వెల్లుల్లి సారం కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. పువ్వులపై కాకుండా ఆకులపై దాడిచేసే ఈ పురుగులపైన వేప నూనె లేదా సహజ పైరిత్రిన్స్ ను ఉపయోగించండి. ముఖ్యంగా వీటిని ఆకుల క్రిందిభాగంలో వాడాలి. బాగా ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే అల్ట్రా వయొలెట్ కవర్( మెటల్ మల్చ్) ఉపయోగించడం సిఫార్స్ చేయబడినది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.అధిక పునరుత్పత్తి రేటు మరియు వీటి జీవన చక్రాల వలన తామర పురుగులు వివిధ రకాల పురుగుల మందులకు నిరోధకతను పెంచుకున్నాయి. ప్రభావవంతమైన సంపర్క పురుగుమందులైన ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ లేదా ఎసిటామిప్రమిడ్ పెరిత్రాయిడ్సును పిపెరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి వాడడం వలన వీటి ప్రభావం అధికంగా ఉంటుంది.
తామర పురుగులు 1-2 మి. మీ పొడవు, పసుపు, నలుపు రంగులో లేదా ఈ రెండు రంగుల్లోనూ ఉంటాయి. కొన్ని రకాల పురుగులకు రెండు జతల రెక్కలు ఉంటే మరి కొన్ని పురుగులకు అసలు రెక్కలు ఉంటాయి. మొక్కల అవశేషాలలో, మట్టిలో లేదా ఇతర ఆతిధ్య మొక్కల పైన ఇవి నిద్రావస్థలో ఉంటాయి. ఇవి అనేక చీడపీడలకు వాహకాలుగా ఉంటాయి. పొడి మరియు వేడి వాతావరణం వీటి ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. గాలిలో తేమ వీటి జనాభాను తగ్గిస్తుంది.