ప్రత్తి

పేను బంక

Aphis

కీటకం

క్లుప్తంగా

  • చుట్టుకుపోయిన, రూపం మారిన ఆకులు.
  • ఆకులు మరియు చిగుర్ల కింద చిన్న చిన్న పురుగులు కనపడతాయి.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

ప్రత్తి

లక్షణాలు

ఈ కీటకాలు తక్కువ నుండి ఒక మోస్తరు సంఖ్యలో ఉన్నపుడు పంటకు నష్టం పెద్దగా ఉండదు. ఇవి ఎక్కువగా ఆకులు మరియు రెమ్మలకు నష్టం కలిగిస్తాయి. సాధారణంగా మొక్కల తేజస్సు తగ్గిపోతుంది. ఇవి తేనె బంక ను ఉత్పత్తి చేస్తాయి. తేనె బంక వలన అవకాశవాద ఫంగస్ ద్వారా ఇతర రకాలైన తెగుళ్లు వ్యాపిస్తాయి. ఆకులపై అచ్చుల వలే తయారవ్వటం దీనికి నిదర్శనం. ఈ తేనె బంక చీమలను కూడా ఆకర్షిస్తుంది. ఈ కీటకాలు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వైరస్ ను వ్యాపింప చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఉపయోగకరంగా ఉండే పురుగులు లేడీ బగ్స్, అల్లిక రెక్కల పురుగులు, సోల్జర్ బీటిల్స్ మరియు పెంకు పురుగులు వంటివి వీటికి విరుద్ధంగా బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రత తక్కువగా వున్నప్పుడు కీటక నాశక సబ్బు ద్రావణాన్ని లేదా మొక్కల నూనెల ఆధారిత ద్రావణాలను వాడవచ్చుఉ.దా.., వేప నూనె (3 మిల్లీ/లీ). తేమ అధికంగా వున్నప్పుడు పేనుబంక సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులుకు ప్రభావితమైన మొక్కలపై నీటిని పిచికారీ చేసి కూడా వీటిని తొలగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రసాయన పురుగు మందులు వాడకం వలన పేను బంక ఈ మందులకు నిరోధకత పెంచుకుంటుంది అని తెలుసుకోండి. విత్తిన( డి ఏ ఎస్) 30, 45, 60 రోజులకు కాండంపై ఫ్లోనికామిడ్ మరియు నీరు1:20 నిష్పత్తిలో వాడడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా థియామెథోక్సమ్ 0.2 గ్రా చొప్పున లేదా ఫ్లోనికామిడ్ .03 గ్రా చొప్పున లేదా ఎసిటామిప్రిడ్ .02 గ్రా చొప్పున( ఒక లీటర్ నీటికి) కూడా వాడవచ్చు. కానీ ఈ మందులు పేను బంక సహజ శత్రువులపైనా దుష్ప్రభావం చూపించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పేను బంక పురుగులు చిన్నగా ఉండి మృదువైన శరీరం కలిగి ఉంటాయి. ఇవి పొడవైన కాళ్ళు మరియు కొమ్ములు కలిగి ఉంటాయి. ఇవి 0.5 నుండి 2 మిల్లీమీటర్లు ఉండవచ్చు మరియు జాతులను బట్టి శరీర రంగు పసుపు, గోధుమ, ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. వీటి జాతులు రెక్కలు లేని రకాల నుండి రెక్కలు ఉన్న లేదా మైనపు రకాలుగా ఉంటాయి. ఇవి సహజంగా ఆరోగ్యంగా ఉన్న లేత ఆకుల కింది భాగంలో ఉంటాయి. ఇవి లేత మొక్క కణజాలాల్ని తినివేస్తాయి. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటే ఎటువంటి నష్టం ఉండదు. మొదట దాడి తర్వాత వసంత కాలం చివరిలో లేదా ఎండాకాలం ప్రారంభంలో ఇవి సహజ శత్రువుల వలన మెల్లగా అంతరించి పోతాయి . అనేక జాతులు, మొక్కల వైరస్ లకు ఇవి వాహకాలుగా వుంటాయి. అందువలన వేరొక రకం తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంటుంది.


నివారణా చర్యలు

  • పొలం చుట్టూ అధిక సంఖ్యలో వివిధ రకాల మొక్కలను పెంచండి.
  • ముందు పంట అవశేషాలను తొలగించండి.
  • ముందు వేసిన పంట అవశేషాలను తొలగించండి.
  • కాంతిని ప్రతిబింబచేసే రక్షణ కవచం వాడి పంటకు తామర పురుగులు సోకకుండా చేయండి.
  • తెగులు సోకిందా లేదా తెగులు యొక్క తీవ్రతను అంచనా వేయడానికి పొలాన్ని తరుచు గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • నీరు లేదా ఎరువులు అధికమొత్తంలో వాడరాదు.
  • జిగురు పట్టీలను వాడి, ఈ పేను బంక ను రక్షించే చీమల జనాభాను నియంత్రించండి.
  • ప్రసరణ బాగా జరగడానికి వీలుగా చెట్ల కొమ్మలను కత్తిరించండి లేదా చెట్టు క్రిందిభాగంలో వున్న ఆకులను తొలగించండి.
  • వీలైతే మొక్కలను రక్షించడానికి వలలను వాడండి.
  • పంటకు ప్రయోజనం చేకూర్చే కీటకాలను రక్షించడం కోసం పురుగుమందుల వాడకాన్ని నియంత్రించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి