Phyllocoptruta oleivora
పురుగు
పంట రకం మరియు పండ్ల పరిపక్వత ఆధారంగా లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా, పరిపక్వత చెందిన నారింజ పండ్లు, ఆకులు మరియు కొమ్మల తొక్కలపై సిట్రస్ తుప్పు నల్లి కాంస్యం రంగులో ఉంటాయి. ఆకుపచ్చ కాడలు, ఆకులు మరియు పండ్లపై ఇవి తినడం వలన కలిగిన నష్టాన్ని గమనించవచ్చు. ఈ పురుగులు ఆకు ఉపరితలంపై మరియు పండ్ల చర్మంపై లాలాజలాలను వదులుతాయి మరియు ఇంజెక్ట్ చేస్తాయి, దీనివలన పండు పై తొక్క యొక్క చర్మ కణాలు విచ్ఛిన్నమవుతాయి. పండు పైన తొక్క పైపొర దాని నిగనిగలాడే స్వభావాన్ని కోల్పోతుంది, మరియు మొద్దుబారినట్లై నిస్తేజంగా మరియు కాంస్యం రంగులోకి మారుతుంది లేదా రస్సెట్ అయిన ప్రాంతాల్లో పసుపు పాచెస్ ఏర్పడతాయి. ప్రారంభంలో, దిగువ ఆకు ఉపరితలాలు పాలిపోయిన లేత ప్యాచీల వలె తరువాత నిర్జీవమైన మచ్చలుగా కనిపిస్తాయి. ఇవి తినడం వలన తొక్క కణాలు నాశనం అవుతాయి మరియు నిమ్మకాయల ఉపరితలం వెండి రంగు లోకి మారి పరిపక్వత చెందిన నారింజ పండ్లపైన తుప్పు గోధుమ రంగులో మరియు ఆకుపచ్చ నారింజపై నల్ల రంగులోకి మారుతుంది. సీజన్ ప్రారంభంలో రస్ట్ మైట్ గాయం అయినప్పుడు దీన్ని "రస్సేటింగ్" మరియు పరిపక్వ పండ్లు గాయపడినప్పుడు "కాంస్యం" అని పిలుస్తారు. గాయపడిన ఉపరితలం మృదువుగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది, మరియు ఇవి చెట్లపైన ఎక్కువ సమయం ఉంటే మచ్చలు మరింత తీవ్రంగా ఉంటాయి. పండు పరిపక్వతకు ముందు గాయపడినప్పుడు ఈ తెగులు సోకిన పండు చిన్నదిగా కనిపిస్తుంది. లేత మొక్కల్లో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. వసంత ఋతువు ప్రారంభంలో ఈ నిమ్మ తుప్పు నల్లి పండ్లను తిన్నప్పుడు పై తొక్క వేసవిలో కంటే తేలికపాటి రంగుతో కఠినమైన ఆకృతిలోకి మారుతుంది. దీనిని షార్క్ స్కిన్ అని పిలుస్తారు.
యూసియస్ సిట్రిఫోలియస్, ప్రోనెమాటస్ అన్బిక్విటస్, మరియు అంబ్లిసియస్ జాతులు మరియు పరాన్నజీవి ఫంగస్, తుప్పు నల్లిపై దాడి చేయడానికి హిర్సుటెల్లా థాంప్సోని వంటి పురుగుల వాడకం ఈ పురుగుల జనాభాను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నూనె ఆధారిత ఆకు పిచికారీ (4 లీటర్ల నీటితో 3 టేబుల్ స్పూన్లు వంట నూనె మరియు సగం టేబుల్ స్పూన్ డిటర్జెంట్ సబ్బు) లేదా సబ్బు ద్రావణం పిచికారీ (2 టేబుల్ స్పూన్లు సబ్బు / వాషింగ్ లిక్విడ్ 4 లీటర్ల నీటితో) వీటి బారిన పడడాన్ని తగ్గించవచ్చు. 35°C కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆయిల్ పిచికారీ చేయవద్దు. ఆకుల దిగువ భాగంలో పిచికారీ చేసి, అవసరమైతే 3 నుండి 4 వారాల తర్వాత తిరిగి పిచికారీ చేయాలి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 30% కంటే ఎక్కువ చెట్లకు ఈ తెగులు సోకినప్పుడు చర్య తీసుకోండి. మీ రసాయన చికిత్సను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే ఇది ప్రయోజనకరమైన కీటకాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిఘటన వృద్ధిని తగ్గించడానికి అన్ని మిటిసైడ్లను సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. పురుగుమందులను తొలగించడానికి స్పిరోడిక్లోఫెన్, డిఫ్లుబెంజురాన్, అబామెక్టిన్, అస్క్వినోసిల్, స్పిరోటెట్రామాట్, మైక్రోనైజ్డ్ లేదా తడి సల్ఫర్, ఫెన్పైరోక్సిమేట్ మరియు క్లోర్‌పైరిఫాస్ వంటి పురుగుమందులు ఉపయోగించవచ్చు.
ఎదిగిన తుప్పు నల్లి తినడం వలన ఈ నష్టం కలుగుతుంది. ఇది చాల సూక్ష్మరూపంలో ఉండి మామూలు కంటికి కనపడదు. పండు లేదా ఆకు ఉపరితలంపై పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పొడి దుమ్ము రూపాన్ని ఇస్తుంది. ఇది ఆకులు లేదా పండ్ల ఉపరితలంపై చిన్న సమూహాలలో తెలుపు, గోళాకార గుడ్లు పెడుతుంది. ఈ గుడ్డు పెద్ద నల్లిగా మారడానికి ముందు రెండు చురుకైన దశలను కలిగి ఉంటుంది. 30°C వద్ద ఈ పురుగులు ఆరు రోజులలో ఒక తరాన్ని పూర్తి చేయగలవు ఆడ నల్లులు నాలుగు వారాలు జీవించి వాటి జీవితకాలంలో 30 గుడ్లు పెడతాయి. తరుచుగా అక్కడక్కడా మచ్చలు వున్న పండ్లు కనపడడం పండ్ల తోటలో తుప్పు నల్లి సంక్రమణకి మొదటి సంకేతం. ఒక సీజన్లో ఇది గుర్తించబడినప్పుడు, తరువాతి సీజన్లో ఇది తీవ్రమైన తుప్పు నల్లి హెచ్చరికగా పరిగణించాలి. ఈ తెగులు తేమతో కూడిన పరిస్థితులను ఇష్టపడుతుంది మరియు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణంలో చాలా సాధారణం. ఇవి గాలి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాప్తి చెందుతాయి.