ద్రాక్ష

ద్రాక్ష తుప్పు నల్లి

Calepitrimerus vitis

పురుగు

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న అపారదర్శక చుక్కలు.
  • ఆకులపై తెల్లటి వెంట్రుకలు.
  • ముదురు ఆకుపచ్చ-ఊదా రంగు మరియు ఆకులు వంకర పోవడం.
  • ఎదుగుదల తగ్గిపోవడం.
  • చాలా చిన్న కీటకాలు, కంటికి కనబడనంత చిన్నగా ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఆకులపై మచ్చలు తెగులు యొక్క మొదటి సంకేతం. ఆకులు సూర్యుడికి వ్యతిరేకంగా ఉంచినప్పుడు ఇవి పూర్తిగా కనపడతాయి. ఆకుపై చిన్న అపారదర్శక నిర్జీవ చుక్కల సంఖ్యను బట్టి మొక్కకు సోకిన తెగులు తీవ్రత తెలుస్తుంది. అపారమైన తెల్ల వెంట్రుకలు ఉండటం కూడా ముట్టడికి సంకేతం. తరువాత ఆకులు ముదురు ఆకుపచ్చ-ఊదా రంగులోకి మారిపోయి వంకరగా మారతాయి. సీజన్ ప్రారంభంలో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే రెమ్మలు, ఆకులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఆకులు రాలిపోయి ఎదుగుదల తగ్గడం జరుగుతుంది. పూలు దెబ్బతినడం వలన లేదా అభివృద్ధి ఆలస్యం అయినందున పండ్ల ఉత్పత్తి తగ్గుతుంది. సాధారణంగా, తుప్పు నల్లి ఒక చిన్న సమస్య. ఎందుకంటే సీజన్ చివరిలో, ద్రాక్ష మొక్క, ఈ ఎదుగుదల క్రుంగడాన్ని అధిగమిస్తుంది. ఏదేమైనా, జనాభా వేగంగా వృద్ధి చెందడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది దిగుబడి మరియు నాణ్యత నష్టాలకు కారణమవుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అనేక సహజ శత్రువులకు, ముఖ్యంగా వీటిని వేటాడి తినే పురుగులకు తుప్పు నల్లి ఒక ఎర వంటిది. నిద్రావస్థ దశలో మరియు మొగ్గ విరామ సమయంలో తడి చేయగల సల్ఫర్ ను సకాలంలో వాడడం ద్వారా పురుగులను నివారించవచ్చు. అయితే, ఈ పిచికారీలు చేయడం ఆపిన తర్వాత తుప్పు నల్లి జనాభా మరలా పెరుగుతుంది. వేప నూనె సారం లేదా కొన్ని పురుగుమందుల సబ్బులను కూడా ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటి శత్రు కీటకాలు నశించకుండా ఉండడానికి చాలా సందర్భాల్లో నల్లి నివారణ మందుల వాడకం నివారించబడతాయి. వీటిని వేటాడి తినే కీటకాలు ఈ తెగులును నియంత్రించడంలో సహాయపడతాయి.

దీనికి కారణమేమిటి?

విటిస్ వినిఫెరా యొక్క తప్పనిసరి తెగులు అయిన ద్రాక్ష తుప్పు నల్లి (కాలేపిట్రిమెరస్ విటిస్) వల్ల వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి. శీతాకాలంలో ఇవి బెరడు క్రింద లేదా తీగల యొక్క పగుళ్లలో పెద్ద ఆడ పురుగులు మనుగడ సాగిస్తాయి అలాగే వసంత ఋతువులో ఇవి అక్కడ నుండి వృద్ధి చెందుతున్న రెమ్మలకు వలసపోతాయి. వాటి సూక్ష్మ పరిమాణం మరియు అపారదర్శక రంగు వలన వాటిని గుర్తించడం కష్టం. ఆకులపై, అవి తరచుగా తెల్లటి మొక్కల వెంట్రుకలతో ఉంటాయి. ఇవి వసంత ఋతువు ప్రారంభంలో లేత ఆకులు మరియు రెమ్మలను విపరీతంగా తింటాయి. వాటి స్టైలెట్ ను(నోటి భాగాలు) పై పొరల కణాలలోకి చొప్పించి లోపలి పదార్ధాన్ని పీలుస్తుంది. తినేటప్పుడు కణాలలోకి ఇవి ప్రవేశపెట్టే కొన్ని పదార్థాలు హార్మోన్ల లక్షణాలను కలిగి ఉంటాయి మరియు ఇది కణజాలాల వైకల్యానికి కారణమవుతుంది. వేసవి మధ్య నుండి చివరి వరకు, పురుగులు అవి మనుగడ సాగించే ప్రదేశాల్లో రక్షణను కోరుకుంటాయి. వీటిని తినే పురుగులు మరియు కీటకాలు వీటిని ఆహారంగా తింటాయి. అందువలన సాధారణంగా ఇవి సమస్య కాదు.


నివారణా చర్యలు

  • పొలం తయారీ సమయంలో నీరు నిలబడకుండా ఉండునట్లు చదును చేయండి.
  • నేల యొక్క కార్బన్ కంటెంట్ ను సమతుల్యం చేయడానికి సేంద్రియ ఎరువును జోడించండి.
  • వ్యాధి సంకేతాల కోసం మొక్కలను పూర్తిగా పరిశీలించండి.
  • తెగులు సంకేతాల కోసం ద్రాక్షతోటలను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • పురుగు మందుల వాడకాన్ని నియంత్రించండి, ఇది ప్రయోజనకరమైన పురుగులు మరియు కీటకాల జనాభాను తగిన విధంగా ఉంచుతుంది.
  • సరైన సమయం, మోతాదులో ఎరువులు వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి