ద్రాక్ష

ద్రాక్షలో పొక్కు నల్లి

Colomerus vitis

పురుగు

క్లుప్తంగా

  • ఆకు పైపొర పైన పొక్కు లాంటి వాపు ఏర్పడుతుంది.
  • ఈ పొక్కుల్లాంటి ప్రాంతాల కింద చిన్న మెత్తని వెంట్రుకల పొర (తెలుపు నుండి పింక్ ఎరుపు) ఉంటుంది.
  • భూతద్ధం లేకుండా చూడడం వీలుపడని చిన్న కీటకాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు తెగులును కారణమైన నల్లి రకం, వివిధ రకాల ద్రాక్ష మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. వసంత ఋతువు చివర్లో చాలా సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. లేత ఆకుల ఎగువ ఉపరితలం యొక్క కొన్ని ప్రాంతాలు పైకి ఉబ్బిపోయి పొక్కులాంటి వాపులుగా వృద్ధి చెందుతాయి (దీనిని ఎరినియం అని కూడా పిలుస్తారు). చిన్న పరిమాణంలో తెలుపు నుండి గులాబీ ఎరుపు రంగులో మెత్తటి వెంట్రుకల పొర ఈ వృద్ది చెందిన ప్రాంతాల క్రింద ఉన్న పగుళ్లలో చూడవచ్చు. సన్నటి, అపారదర్శక పురుగులు ఈ దట్టమైన వెంట్రుకల పూతలతో రక్షించబడతాయి. తరువాత, ఈ పొక్కులు మరియు వెంట్రుకలు ఎండిపోయి గోధుమ రంగులోకి మారుతాయి. కొన్ని దేశాలలో, ఈ పురుగులు వేరే రకమైన నష్టాన్ని కలిగిస్తాయి, ఉదాహరణకు క్రింది ఆకుల వక్రీకరణ, మొగ్గలు మరియు ఆకు చుట్టుకుపోవడం వంటివి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటిని వేటాడి తినే పురుగు గాలెండ్రోమస్ ఆక్సిడెంటాలిస్ పొక్కు పురుగులను తింటుంది అలాగే వాటి సంఖ్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్రిమిసంహారక సబ్బు లేదా వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు, అయితే ఇవి ప్రయోజనకరమైన కీటకాల జనాభాను కూడా తగ్గిస్తాయి. ఇంకా, తడి చేయగల సల్ఫర్‌తో చికిత్సలు సహాయపడతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ పొక్కు నల్లికి వ్యతిరేకంగా స్పిరోటెట్రామాట్ విజయవంతంగా ఉపయోగించబడింది. ఈ మందును గ్రహించడానికి తగిన ఆకులు ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు వీటిని తిరిగి వాడేముందు 30 రోజుల అంతరం పాటించండి. తడి చేయగల సల్ఫర్ కూడా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఆకులపై బొబ్బలు లాంటి పెరుగుదల కొలొమెరస్ విటిస్ వల్ల కలుగుతుంది. స్పష్టమైన లక్షణాలు ఉన్నప్పటికీ, ద్రాక్షలో ఇది ప్రధాన తెగులుగా పరిగణించబడదు. సన్నటి ద్రవాన్ని పీల్చే పురుగులు ప్రధానంగా ద్రాక్షపండును ప్రభావితం చేస్తాయి. ఇవి ఆకుల బాహ్యచర్మానికి తింటున్నప్పుడు ఇవి హార్మోన్ లాంటి పదార్థాలను కణాలలోకి చొప్పించి వాటి పెరుగుదలను మారుస్తాయి. దీని ఫలితంగా ప్రత్యేకమైన వాపు ఏర్పడుతుంది. శీతాకాలంలో ఈ పొక్కు నల్లి ద్రాక్ష మొక్కపై మనుగడ సాగిస్తుంది, ఉదాహరణకు మొగ్గ పైపొరల్లో దాక్కొంటాయి. వసంత ఋతువులో ఇవి లేత ఆకుల క్రింది భాగంలోని దిగువ వైపుకు వెళ్లి ఆకులను తినడం ప్రారంభించినప్పుడు చురుకుగా ఉంటాయి. వేసవి చివరలో ఇవి ఆకులను వదిలిపెట్టి శీతాకాలం కోసం ఆశ్రయాన్ని వెతుకుంటాయి. ఆకుల దిగువ భాగంలో ఏర్పడిన బూజును పొరపాటున బూజు తెగులు వంటి ఫంగల్ వ్యాధిగా గుర్తించకూడదు. వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో, వేగంగా ఆకులు పెరిగే సమయంలో లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి కాని పండ్ల దిగుబడిపై ఈ నల్లి ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపదు.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి సేకరించిన ఆరోగ్యకరమైన మొక్కలను ఉపయోగించండి.
  • పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ముట్టడి స్థాయి తక్కువగా ఉన్నంత వరకు తెగులు సోకిన కొమ్మలను మరియు మొక్కల భాగాలను తొలగించి, వాటిని సేకరించి నాశనం చేయండి.
  • ప్రయోజనకరమైన కీటకాల జనాభాకు హాని కలిగించకుండా ఉండటానికి పురుగుమందుల వాడకాన్ని నియంత్రించండి.
  • ద్రాక్ష మొక్కల చుట్టూ కలుపు సంహారక మందులను పిచికారీ చేయకుండా ఉండండి.
  • ఎందుకంటే వీటిని వేటాడి తినే పురుగులు వంటి ప్రయోజనకరమైన కీటకాలకు కూడా ఈ పురుగు మందులు హానికరం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి