Polyphagotarsonemus latus
పురుగు
ఈ నష్టం కలుపు సంహారకాల దుర్వినియోగం మరియు పోషకాల లోటు వల్ల కలిగే నష్టాన్ని పోలి ఉంటుంది. ఆకులు ముడుచుకొని, సన్నగా అయ్యి, గోధుమ రంగులోకి మారుతాయి. ఈనెల మధ్యన గోధుమ కార్కీ మచ్చలు ఆకుల కింది భాగంలో కనిపిస్తాయి. పుష్పాలు రాలిపోతాయి మరియు లేత ఆకులు రూపు మారిపోతాయి. ఎదుగుదల తగ్గిపోవటం. మొక్కలు పైనుండి మొదలు పెట్టి క్రిందికి చనిపోతాయి.(డైబ్యాక్). ఈ పురుగులు కలగజేసే నష్టం వలన పండ్లు వెండి రంగులోకి మారుతాయి
ఈ నల్లులపైన నియోసెలుస్, కుకుమేరిస్ మరియు అంబ్లీసెస్ మోంట్దొరెన్సిస్ వంటి సహజంగా వేటాడే పురుగులను ఉపయోగించాలి. వెల్లులి స్ప్రే మరియు క్రిమినాశక సబ్బులు కూడా వాడొచ్చు. లేత మొక్కలకు వేడి నీటి చికిత్స (15 నిముషాల వరకు 43°C నుండి 49°C) కూడా ఉపయోగకరంగా ఉంటుంది
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు అధికంగా ఉన్నపుడు మాత్రమే రసాయన చికిత్స వాడాలి. వీటి జీవిత కాలం చాలా తక్కువగా ఉండడం వలన నల్లులను రసాయన చికిత్సల ద్వారా నియంత్రించటం చాలా కష్టం, . ఇవి పురుగుల మందులకు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. నిజంగా పురుగుల మందుల వాడకం అవసరం అనుకుంటే అబామెక్తిన్, స్పిరోమెసిఫెన్ లేదా పైరిడిన్ కలిగిన పురుగుల మందులను వాడాలి.
నల్లులు లేత ఆకులలో రంధ్రాలు చేసి, మొగ్గల్లో ఉండే పోషకాల్ని జుర్రకుంటాయి. వాటి లాలాజలంలో మొక్కల హార్మోన్ వంటి పదార్థం కలిగి ఉంటుంది ఇది కణజాలాల రూపు మార్పటంలో తోడ్పడుతాయి. నల్లులు చాల చిన్నగా ఉండి, భూతద్దం లేకుండా చూడటం చాల కష్టం. పెద్దవి 0.2 మిల్లీమీటర్ల పొడవుతో మరియు గుండ్రపు ఆకారంలో ఉంటాయి. ఇవి పసుపు మరియు ఆకుపచ్చ వంటి రంగులు కలిగి ఉంటాయి. పెద్ద ఆడ నల్లులు రోజుకు ఐదు గుడ్లు పెడతాయి, ఆకుల కింది భాగంలో. లార్వా రెండు మరియు మూడు రోజుల్లో పగులుతాయి. పురుగుల్ని వాహకాలుగా వాడి లేదా గాలి వల్ల వ్యాప్తి చెందితే తప్ప నల్లుల వ్యాప్తి చాలా మెల్లగా జరుగుతుంది. ఈ తెగులు రకాలు వేడి తేమ వాతావరణాలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి.