బాదం

గోధుమ రంగు నల్లి

Bryobia rubrioculus

పురుగు

క్లుప్తంగా

  • ఆకులు పురుగులు తిన్న గుర్తులు కలిగివుండి మరియు లేత లేదా కాంస్య రంగులో ఉంటాయి.
  • ఆకు ప్రధాన ఈనె దాదాపుగా చదునుగా, చిన్నగా మారిన ఫలితంగా ఆకులు రూపం కోల్పోతాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
బాదం
ఆపిల్
చెర్రీ

బాదం

లక్షణాలు

దీని వలన కలిగే నష్టం ఇతర సాలీడు పురుగుల వల్ల కలిగే నష్టాన్ని పోలి ఉంటుంది. అన్ని చలనశీల దశలలో ఇవి ఆకుల దిగువ నుండి తింటాయి మరియు కణాల నుండి క్లోరోఫిల్‌ను తొలగిస్తాయి. ఇవి తిన్న గుర్తులు పేరుకుపోవడం వల్ల ఆకు పైభాగంలో చిన్న చిన్న చుక్కలు ఏర్పడతాయి, ఇవి లేత ఆకుపచ్చ, వెండి లేదా కాంస్య రంగులో కూడా కనిపించవచ్చు. పోషకాలు ఆకు కణజాలాలకు చేరనందున, అవి చాలా చిన్నవిగా, దాదాపు చదునుగా ఎదుగుతాయి, ఆకు ఈనెలు గట్టిపడడం వలన ఉపాంత పొరలు దాదాపుగా ఉండవు. అయినప్పటికీ, ఈ జాతితో ఆకులు రాలుట తక్కువగా ఉంటుంది. చెట్టు యొక్క బెరడు కూడా రంగు మారవచ్చు. సాధారణంగా ఈ పురుగులు పెద్ద తెగుళ్లుగా పరిగణించబడవు మరియు వసంతకాలంలో వీటి సహజ శత్రువులకు ఇవి ఆహారంగా ఉపయోగపడడం వలన ఇవి తక్కువ నుండి మితమైన సంఖ్యలో వున్నట్లైతే ప్రయోజనకరంగా ఉంటాయి. సాధారణంగా కొన్ని చెట్లకే ఈ అంటుతెగులు పరిమితమవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అక్షింతల పురుగు, మైన్యూట్ పైరేట్ బగ్స్, ప్రిటేటరీ మిరిడ్ బగ్స్ మరియు గోధుమరంగు అల్లిక రెక్కల పురుగు లాంటి అనేక రకాల పురుగులు బ్రౌన్ మైట్ యొక్క ప్రభావవంతమైన సహజ శత్రువులు. అయినప్పటికీ, సమీకృత తెగులు నిర్వహణలో భాగంగా వాటిని ఉపయోగించకపోతే అవి గోధుమ రంగు నల్లుల జనాభాను నియంత్రించలేకపోవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. శీతాకాలపు నూనెలను వసంతకాలంలో వాడాలి. ("నిద్రాణ స్థితి చికిత్సలు"), దీని ఫలితంగా బెరడు మరియు కొమ్మలపై ఉండే శీతాకాలపు గుడ్లు క్షీణిస్తాయి. వేసవిలో ఈ తెగులు తీవ్రంగా ఉంటే, తెగులుకు వ్యతిరేకంగా వాణిజ్యపరంగా లభించే పురుగుమందులను ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

ఈ గోధుమ రంగు నల్లి బాదం మరియు యాపిల్ పంటలను ఆశించే పురుగులన్నింటిలో పరిమాణంలో అతి పెద్దది, ఇది వసంతకాలంలో మొదటసారిగా ఉద్భవిస్తుంది. పెద్ద పురుగులు పొడవాటి ముందు కాళ్ళతో చదునుగా ఉంటాయి. వాటి శరీరం ముదురు నారింజ రంగులతో మందమైన ఎర్రటి గోధుమ రంగులో ఉంటుంది. ఇతర రకాల పండ్ల చెట్ల పురుగుల మాదిరిగా ఇవి గూళ్ళను ఏర్పరుచుకోవు. ఓవర్‌వింటరింగ్ గుడ్లు ఎరుపు రంగులో ఉండి కొమ్మ లేకుండా ఉంటాయి. ఇవి కొమ్మలపై గుంపులు గుంపులుగా, ముఖ్యంగా రెండు మునుపటి సీజన్లలో కలప పెరిగిన జంక్షన్ వద్ద గుడ్లను పెడతాయి. ఆకు మరియు పూల మొగ్గలు తెరుచుకునే సమయంలోనే గుడ్లు పొదగబడతాయి. తరువాత అవి ఆ పూమొగ్గలు మరియు ఆకులను తింటాయి. ఈ పురుగులు పగటిపూట చల్లని సమయాల్లో లేదా రాత్రిపూట మాత్రమే చురుకుగా ఉంటాయి మరియు మధ్యాహ్న సమయంలో ఆకులను వదిలి కొమ్మలపై గుమికూడతాయి. వేసవిలో వేడిగా ఉండే సమయాల్లో ఇవి చురుకుగా ఉండవు. ఇవి సంవత్సరానికి 2 నుండి 3 తరాలు కలిగి ఉంటాయి. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వంటి కొన్ని పురుగుమందుల అవశేషాలు బ్రౌన్ మైట్ ను ఆహారంగా తీసుకునే కీటకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి మరియు వీటి జనాభా పెరుగుదలకు దారితీస్తాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలు లేదా వ్యాధిని తట్టుకోగల రకాలను నాటండి.
  • తెగులు లక్షణాల కోసం ఆపిల్ తోటను పర్యవేక్షించండి.
  • ఇతర రకాల పురుగులను నియంత్రించడంలో మరింత ప్రభావవంతమైన స్థాయికి ప్రెడేటర్ పురుగుల జనాభా వృద్ధి చెందడానికి వసంతకాలంలో తక్కువ స్థాయిలో పండ్ల తోటలో గోధుమ రంగు నల్లుల జనాభాను అనుమతించండి.
  • ఇతర చికిత్సలు తెగులును నాశనం చేయలేకపోతే, తీవ్రంగా తెగులు సోకిన చెట్ల భాగాలను తొలగించండి.
  • గోధుమ నల్లి యొక్క సహజ శత్రువులను చంపే పురుగుమందులను ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి